బస్ దౌత్యం ద్వారా భారత పాక్‌ల మధ్య మూతబడివున్న భూ మార్గంతో పాటు దె్వైపాక్షిక సంబంధాలకు కూడా ఆనాడు వాజ్‌పేయి తలుపులు తెరిచారు. దేశ విభజన జరిగిన తర్వాత 1947 అక్టోబర్ 11వ తేదీన వాఘావద్ద నిర్మించిన ‘అడ్డు గోడ’ను వాజ్‌పేయి 1999 ఫిబ్రవరి 20న దాటారు. ఆనాటి నుండి వాఘా సరిహద్దు దేశప్రజలందరి దృష్టిలోకి వచ్చింది. అమృత్‌సర్‌కు 32 కి.మీ.లో దూరంలో ఉన్న అటారీ గ్రామంకి దగ్గర ఉందీ ‘వాఘా’ సరిహ ద్దు. ఇది అంతర్జాతీయ సరిహద్దు. భారతదేశానికి పాకిస్తాన్‌లోని లాహోర్ పట్టణానికీ మధ్య సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 వరకూ ‘జండా పండుగ’ అద్భుతంగా జరుగుతుంది.
మొత్తమ్మీద సాయం సమయంలో అస్తమిస్తు న్న సూర్యడు, చల్లని గాలులు, దారికిరు వైపులా పంటపొలాలు, వృక్షాల మీద పక్షులు గూటికి చేరిచే గోలగోలగా అరిచే అరుపులతో ఈ వాతావరణమంతా పరాటకులకు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రకృతి ఆరాధకులకు గొప్ప ఆనందా న్ని పంచుతాయి.
ఈ సరిహద్దు ప్రాంతమంతా మన బిఎస్‌ఎఫ్ దళాలు అత్యంత జాగ్రత్తగా కాపలా కాస్తుంటా రు. ఎత్తు బురుజుల్లా ఉండే షెల్టర్లలో కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటారు. ఇక ఆకాశంలో పాకిస్థాన్ నుండి ఎవరూ మనదేశంలోకి రాకుండా పహారాగా భద్రతా విమానాలు తిరుగుతూ ఉంటాయి. వాఘాకు వెళ్తుంటే ఒక మనం రక్షణ వలయంలో ఉన్నామనిపిస్తుంది. ఒక సరిహ ద్దు గేటు దగ్గరే మన జాతీయ మువ్వన్నెల జెండా గాలికి ఊగుతూ మనకు స్వాగతం పలుకు తుంది. బిఎస్‌ఎఫ్ దళాల గేటు దాటి లోపలికి వెళ్లగానే ఈజెండా ఉత్సవాన్ని చూడడానికి వచ్చే పర్యాటకులను మన దళాలు ఒక క్రమ పద్ధతిలో గ్యాలరీలో కూర్చోపెడతారు. సరిగ్గా సాయం త్రం 6గం టలకు భారత్- పాక్ సరిహద్దు గేట్లు తెరుచుకుంటాయి. ఆసమయంలో పాకిస్తాన్ గేటువైపు చూస్తే అక్కడ కూడా పాకిస్తాన్ పౌరులను చూడడము కూడా చక్కని అనుభూతినిస్తుంది. గేట్లు తెరుచుకోగానే భారత్, పాక్ సైన్యం తమ విన్యాసా లను జరుపుతారు. తరువాత ఇరు దేశాల జవాన్లు ఎరురెదురుగా నిలబడి నడుం మీ ద చేతులాన్చి నిలబడి కాళ్లను వేగంగా జాడిస్తూ విన్యాసాలు చేస్తారు. అలా ఇరుదేశా ల జవాన్లు చేసే కవాతు చూస్తుంటే మనకు గగుర్పాటు కలుగుతుంది. సంభ్రమాశ్చ ర్యాలలో మునిగిపోతాము. ఇలా జవాన్ల వివిధ విన్యాసాలతో తమ తమ దేశాల పతా కాలను అవనతం చేస్తారు. చాలా వినమ్రతతో ఆ పతాకాలను మడతపెట్టి ఎంతో గౌరవంగా మన జవాన్లు తీసుకెళ్తారు. దీంతో జెండా ఉత్సవం అయిపోతుంది.
పెల్లు బికే ఉత్సాహం... మొత్తంగా ఈ కార్యక్రమం సైనిక విన్యాసాలతో జాతీయ జెండాను తీసుకెళ్లడం వరకు ఆరగంట కాలం పడుతుంది. మన సైనిక విన్యాసాలను తిలకిస్తు న్న భారతీయుల్లో ఉత్సాహం, దేశాభిమానం, పెల్లుబికే చప్పట్లుతో ‘హమారా భారత్ మహాన్‌హై’ అంటూ పెద్దగా నినాదాలు చేస్తారు. ఈ అరుపులు, చప్పట్ల ధ్వనితో ఆ సంధ్యా సమయంలో గూళ్లకు చేరిన పక్షులు కూడా ఒక్కసారిగా అరుస్తూ గందర గోళంగా గాలిలోకి ఎగరడం చూస్తే ఆ చిన్న ప్రాణులు కూడా మనకు వత్తాసు పలు కుతున్నాయా! అనిపిస్తుంది. అక్కడి చెట్ల మధ్య నుంచి సూర్యాస్తమయ కాంతులు, పక్షుల కేరింతలు, యాత్రికుల ఉత్సాహం ఆ సంధ్యాసమయాన్ని చూసి ఆస్వాదించా లే కానీ వర్ణించడం అలవికాని పని. ఆ సమయంలో ప్రతి భారతీయుని హృదయం లో దేశాభిమానం ఉప్పొంగి ప్రవహిస్తుంది. అలాగే అటువైపు పాక్ ప్రజల ఆనందో త్సాహాలను కూడా చూస్తాం. వాఘా వెళ్లిన ప్రతి యాత్రికునికి ఇదొక అద్భుతమైన అనుభవం. ప్రతి భారతీయుడూ తప్పకుండా చూడాల్సిన పండుగ ఇది.
ఎలా వెళ్లాలి?: అమృత్‌సర్ నుండి 32 కి.మీ.లో ఉన్న అటారీ గ్రామానికి ఆ రాష్ట్ర ఆర్టీసి బస్సులో వెళ్లాలి. అక్కడి నుండి ఏదైనా వాహనంతో 5 కి.మీ. దూరంలో ఉన్న ‘వాఘా’ సరిహద్దుకు చేరాలి. లేదా సరాసరి అమృత్‌సర్ నుండి వాఘా దాకా ఏదైనా వాహనం తీసుకొనికూడా వెళ్లొచ్చు. అలాగే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ-లాహోర్‌ల మధ్య నడిచే రైల్వే సర్వీసు. వాఘా సరిహద్దుకు 5 కి.మీ. దూరంలోఉన్న అటారీ గ్రామం నుండి పాక్‌కు వెళ్తుందీ ట్రైన్. ఢిల్లీ నుంచి ఈ రైలులో అటారీ దాకా పర్యాట కులు రావచ్చు.
- దామర్ల విజయలక్ష్మి, అనంతపురం
No comments:
Post a Comment