Friday, December 24, 2010

సచిన్‌కు సచినే సాటి .. ‘ సచిన్‌ అంటే సచినే '. అతనికి అతనే సాటి.

Mangeshkar క్రికెట్‌ దేవుడు సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌ లాంటి కొడుకు ఒక్కడుంటే చాలని ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల లతా మంగేష్కర్‌ ప్రశంసించారు. మరెన్నో సంవత్స రాలు సచిన్‌ క్రికెట్‌లో బ్యాట్‌ను ఝళిపించాలని, ఇంకెన్నో రికార్డులు సాధించి దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ అందుకోవాలని లతా మంగేష్కర్‌ అభిలషించారు. ప్రస్తుత టెస్ట్‌ క్రికెట్‌లో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో 50 సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ను లతా మంగేష్కర్‌ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ‘సచిన్‌ అంటే సచినే. అతనికి అతనే సాటి. లిటిల్‌ మాస్టర్‌కు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి’ అంటూ లతా దీదీ ప్రశంసలతో ముంచెత్తారు. సచిన్‌‌‌ అంటే లతా మంగేష్కర్‌కు ఎనలేని అభిమానం కూడా. గురువారం ఇక్కడ పీటీఐ విలేకరితో లతా దీదీ మాట్లాడుతూ తన మదిలో సచిన్‌ పట్ల ఉన్న పలు భావాలను ఆవిష్కరించారు.

‘సచిన్‌ నన్ను తల్లిలా భావిస్తాడు. నన్ను సచిన్‌ తొలిసారిగా ‘ఆయి’ (అమ్మా) అంటూ పిలిచిన రోజు ఎన్నడూ మరిచిపోలేను. నన్ను సచిన్‌ అలా పిలుస్తాడని కలలో కూడా ఊహించలేదు. అమ్మా అని నన్ను సచిన్‌ సంబోధించడం నాకొక అనిర్వచనీయమైన, అపూర్వ మైన ఆనందం. సచిన్‌ లాంటి గొప్ప కొడుకుకు జన్మనివ్వాలన్న భావన కలిగింది’ అన్నారు. ‘సచిన్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 24. ఆ రోజే మా తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ వర్ధంతి. అందు వల్ల ఆ రోజున మేం ఏనాడూ కలుసుకోవడం కుదరలేదు. అయితే, ఒక సందర్భంలో ఏప్రిల్‌ 23వ తేదీన ఒకసారి సచిన్‌ నేనూ కలుసుకునే అవకాశం వచ్చిందని లతా మంగేష్కర్‌ పేర్కొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా బదులిచ్చారు.

sachin‘తల్లి గురించి ఎవరైనా ఏమని భావిస్తారు?’ అంటూ మరో ప్రశ్నకు 81 సంవత్సరాల ‘భారత రత్న’ లతా మంగేష్కర్‌ సమాధానం చెప్పారు. ‘సచిన్‌ నిజంగా ఆదర్శవంతుడైన కొడుకు. అతను ఎల్లప్పుడూ విజయాలు సాధించాలని, మరింత ఉన్నత స్థితికి చేరాలని భగవంతుడ్ని తాను ప్రార్థిస్తానన్నారు.లతా మంగేష్కర్‌ - సచిన్‌ టెండూల్కర్‌ మధ్య ఉన్న అవినాభావ ప్రేమాభిమానాలు జగమెరిగిన సత్యం. లతా మంగేష్కర్‌ పాటలు తనను ఎలాంటి ఒత్తిడి నుంచి అయినా బయట పడేస్తాయంటాడు సచిన్‌. దేశంలో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’కు సచిన్‌ అక్షరాలా అర్హుడని లతా మంగేష్కర్‌ అంటారు. తన దృష్టిలో సచిన్‌ నిజమైన భారత రత్న అని అభివర్ణించారు. మన దేశం కోసం సచిన్‌ సాధించిన విజయాలు చాలా అరుదైనవి. అలాంటి రికార్డులు అతి కొద్ది మంది మాత్రమే సాధించగలరన్నారామె. మనందరం సగర్వంగా తలెత్తుకు తిరిగేలా సచిన్‌ చేశాడని లతా మంగేష్కర్‌ ప్రస్తుతించారు. భారత దేశం అనేక మంది గొప్ప గొప్ప క్రికెటర్లను తయారు చేసింది. కానీ సచిన్‌ అంటే సచినే. అతనికి అతనే సాటి అని గాన కోకిల అభినందించారు. తాను చేసే పనిపై సానుకూలమైన నిబద్ధత గల వ్యక్తి సచిన్‌ అన్నారు. తాను కూడా అలాంటి వ్యక్తినే అని తెలిపారు. సంగీతం అంటే సచిన్‌కు అమితమైన అభిమానం అని తనకు కూడా క్రికెట్‌ చెప్పలేనంత ఇష్టమని లతా మంగేష్కర్‌ అన్నారు.

నిజమైన జెంటిల్మన్‌, దేవుడంటే భయం భక్తి గలవాడు సచిన్‌ అని ప్రశంసించారు. తాను ఏ విజయం సాధించినా దేవుడికి, తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పకుండా ఏనాడూ విస్మరించలేదని అన్నారు. క్రికెట్‌లో సచిన్‌ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని, వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌ను భారత్‌కు సాధించిపెట్టాలని లతా మంగేష్కర్‌ ఆకాంక్షించారు. సచిన్‌ ప్రస్తుతం క్రికెట్‌ను చాలా బాగా ఆడుతున్నాడని, సచిన్‌ కోరుకున్నంతకాలం ఇలాగే ఫామ్‌లో ఉండాలని ఆమె ఆశీర్వదించారు.
శబాష్‌ సచిన్‌
Sachin-Tendulkarసెంచూరియన్‌ : టెస్టుల్లో చారిత్రాత్మక 50 సెంచరీని సాధించి 133 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనతను సాధించిన ఒకే ఒక్కడిగా పేరు సంపాదించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. క్రికెట్‌లో సచిన్‌కు ఓనమాలు నేర్పిన అచ్రేకర్‌ నుంచి క్రికెట్‌ సౌతాఫ్రికా సీఈఓ గెరాల్డ్‌ మెజోలా, సౌతాఫ్రికన్‌ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ దాకా.. అందరూ మాస్టర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సచిన్‌ సాధించిన ఘనతకు గుర్తుగా దక్షిణాఫ్రికా గడ్డపై భారతీయులు అడు గుపెట్టి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 9 వ తేదీన సచిన్‌ను సన్మాని స్తామని ఈ సందర్భంగా మెజోలా ప్రకటించారు. అంతేగా కుండా.. క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) తరపున మనస్పూ ర్తిగా తన అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇం త గొప్ప మైలురాయిని సచిన్‌ సాధించడం తమ కెంతో గర్వ కారణంగా ఉందని ఆయన అన్నారు.‘టెస్టు క్రికెట్‌ చరిత్ర లో ఎవ్వరూ సాధించని చారిత్రాత్మక రికార్డును సాధించిన సందర్భంగా క్రికెట్‌ సౌతాఫ్రికా తరపున సచిన్‌ కు అభినం దనలు తెలపుతున్నా.

మా (సీఎస్‌ఏ) దృష్టిలో క్రికెట్‌కు నిజమైన రాయబారివి నువ్వే. నువ్వు (సచిన్‌) ఎక్కడా ఆడినా... నీ నైపుణ్యం, పట్టుదలకు.. నీ హుందా తనమే సరితూగుతుంది.’ అని మొజోలా అన్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్లు అయితే టెం డూల్కర్‌ను అకాశానికెత్తేశారు. మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ ఐతే ఏకంగా.. ‘సచిన్‌ ఇప్పుడు క్రికెట్‌ చరిత్ర లోనే అత్యుత్తమ క్రికెటర్‌ టైటిల్‌కు తన పేరును ప్రతిపా దించొచ్చు’ పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. ఒకవేళ సచినే అత్యుత్తమ క్రికెటర్‌ అనే అంశం తో వాదనతో ఏకీభవించకపోతే.. అత్యంత విజయవంత మైన క్రికెటర్‌ అనే వాదనతో మాత్రం అందరూ నిస్సందే హంగా ఏకీభవిస్తారు.. దానికి సచిన్‌ సాధించిన 50 వ శతకమే ఒక గొప్ప ఉదాహరణ అని లతీఫ్‌ అన్నాడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సచిన్‌ ఒక లివింగ్‌ లెజెండ్‌గా అభివర్ణించాడు. ‘సచిన్‌కు సంబం దించినంత వరకు అతను ఒక లెజెండ్‌. 50 వ టెస్టు సెంచ రీ సాధించడమనేది ఒక మైలురాయి. 21 ఏళ్ల తర్వాత కూడా.. ఇప్పటికీ క్రికెట్‌ పట్ల మక్కువ తగ్గలేదు. అని సచిన్‌ ధోని అన్నాడు. సచిన్‌ను పొగడ్తలతో ముంచ ెత్తిన వారి మాటలు వారి మాటల్లోనే..

సంతోషంగా ఉంది: జావేద్‌ మియాందాద్‌
‘ సచిన్‌ సాధించిన ఘనత పట్ల ఆనందంగా ఉన్నా. ఒక టీనెజర్‌గా తన తొలి టెస్టు మ్యాచును ఆడడానికి మైదా నంలో వచ్చినప్పుడే తనలో టాలెంట్‌ ఉందని సచిన్‌ నిరూ పించాడు. గత 21 సంవత్సరాల నుంచి క్రికెట్‌కు సంబం ధించిన రెండు ఫార్మాట్లను అద్భుతంగా రాణిస్తూ.. సచిన్‌ దేవుడు తనకు ఇచ్చిన వరానికి పూర్తి న్యాయం చేశాడు.
సచిన్‌ దేశానికి వరల్డ్‌కప్‌ సాధించాలి: ఆచ్రేకర్‌
ramakant-Achrekar తన ప్రియ శిష్యుడు సచిన్‌ టెండూల్కర్‌ సరిక్రొత్త రికార్డును సాధించడం పట్ల.. అతనికి క్రికెట్‌ ఓనమాలు నేర్పిన రమాకాంత్‌ ఆచ్రేకర్‌ అమితానం దాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వచ్చే ఏడాది ఉప ఖండంలో జరగనున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ను భారత్‌కు సచిన్‌ సాధిం చిపెట్టాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ‘సచిన్‌ సాధించిన ఘనత పట్ల ఎంతో ఆనందంగా ఉన్నా తన ఘనతతో అతను ననొక్కడినేగాకుండా.. మొత్తం జాతి ని గర్వపడేలా చేశాడు.సచిన్‌ సాధించిన ఘన తకు దగ్గర గా కూడా ఎవరైనా వస్తార ని నేననుకోను’ అని ఆచ్రేకర్‌ అన్నారు. ముంబాయిలోని శ్రధ్దాశ్రమ్‌ విద్యా మందిర్‌ స్కూల్‌లో ఆచ్రేకర్‌ శిష్యరికం లోనే సచిన్‌ క్రికెట్‌ను నేర్చు కోవడం ప్రారంభించాడు. సౌతాఫ్రికా పర్యటనకు బయలు దేరే ముందు సచిన్‌.. భార్య అంజలీ తో కలిసి తనను పరామ ర్శించాడని 78 ఏళ్ల ఆచ్రేకర్‌ వెల్ల డించారు. దాదాపు గంట సేపు తామి ద్దరం క్రికెట్‌ గురించి మాట్లాడు కున్నామని ఈ సందర్భం గా ఆయన అన్నారు. క్రికెట్‌ పట్ల సచిన్‌కున్న మక్కువ, అంకిత భావం ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయని.. అవే అతన్ని ముం దుకు నడిపిస్తున్నాయని ఆచ్రేకర్‌ అన్నారు.
సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ సర్వేలో సచిన్‌ ముందజ
సచిన్‌ 50వ సెంచరీ సాధించిన దరిమిలా.. క్రికెట్‌ చరిత్రలో అసీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ దివంగత డాన్‌ బ్రాడ్‌మ న్‌, టెండూల్కర్‌లలో ఎవరు గొప్ప అనే అంశంపై తిరిగి వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అసీస్‌కు చెందిన ప్రఖ్యాత సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక నిర్వహిస్తోన్న సర్వేలో సచిన్‌ ముందంజలో ఉన్నాడు. ఈ సర్వేలో ఇప్పటివరకు మాస్టర్‌కు 63 శాతం ఓట్లు లభించగా.. బ్రాడ్‌మన్‌కు 37 శాతం లభించాయి.
టెండూల్కర్‌ దేశానికి ఆదర్శం: చిరంజీవి
టెస్టు క్రికెట్‌లో 50వ సెంచరీ చేసి అరుదైన రికార్డు నెలకొల్పిన క్రికెట్‌ దిగ్గజం దేశానికే ఆదర్శం అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరం జీవి ప్రశంసించారు. సచిన్‌ సాధించిన ఈ ఘనత పట్ల యావత్‌దేశం పులకించిపోతోందన్నారు. భవిష్యత్తు లో మరెన్నో రికార్డులు నెలకొల్పి భారతదేశ త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెప రెప లాడించాలని చిరంజీవి ఈ మేరకు సోమవారంనాడొక ప్రకటనలో పేర్కొన్నారు.
సచినే డాన్‌
sachin ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ పత్రిక నిర్వహించిన పోల్‌లో లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ రమేష్‌ టెండుల్కర్‌ క్రికెట్‌ లెజెండ్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ కంటే ఎక్కువగా ఓట్లు లభించాయి. ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెస్ట్‌ల్లో 50 సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఆల్‌టైమ్‌ బ్యాట్స్‌మన్‌గఆ ఉన్న డాన్‌ ఘనతను లిటిల్‌ బీట్‌ చేశాడు. సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పోల్‌లో... బ్రాడ్‌మన్‌ , సచిన్‌లో ఎవరు ప్రసిద్ధి బ్యాట్స్‌మన్‌ అన్న ప్రశ్నకు ఎక్కువమంది సచిన్‌కే ఓటువేశారు. ఇందులో సచిన్‌కి 67 శాతం రాగా, డాన్‌కి కేవలం 33 మాత్రమే వచ్చాయి. సచిన్‌ టెండూల్కర్‌ ఇప్పటివరకు మూడు ఫార్మట్లలో అంటే టెస్ట్‌, వన్డే, ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లను 10 దేశాలతో ఆడాడు. అదే బ్రాడ్‌మన్‌ కేవలం టెస్ట్‌ మ్యాచ్‌లను ఒకే ఒక్క జట్టుతో ఆడాడు. ఆస్ట్రేలియా తరపున ఆడిన డాన్‌ ఒక్క ఇంగ్లాండ్‌ జట్టుపైన మాత్రమే ఆడాడు.

bradటెండూల్కర్‌ని బ్రాడ్‌మన్‌తో పోల్చితే అతను ఎన్నోరెట్లు గొప్పవాడని ఆ పత్రిక కొనియాడింది. సచిన్‌ ఎన్నో పిచ్‌లపై ఆడాడు. అతనికి ఏ గేమ్‌ని ఎలా ఆడాలో తెలుసు. మంచి అనుభవజ్ఞుడు. కష్టసమయంలో జట్టును ఎలా ఆదుకోవాలో డాన్‌ కంటే మాస్టర్‌ బ్లాస్టర్‌కే బాగా తెలుసునని పోల్‌ తెలిపింది. 30వేల పరుగులు చేశారు. టెస్ట్‌లో 50 సెంచరీలు, వన్డేల్లో 45 సెంచరీలతో అలాగే ఓ డబుల్‌ సెంచరీతో ప్రపంచంలోని ఎంతోమంది క్రీడాభిమానులు ఆయన అలరిస్తున్నారని సర్వే పేర్కొంది. అన్ని విషయాల్లోనూ ఆయన బ్రాడ్‌మన్‌ కంటే ఎక్కువేనని చాలా మంది ఆస్ట్రేలియన్లు అభిలషిస్తున్నారని పత్రిక చెప్పింది. అయితే కొంతమంది ఈ సర్వేని తప్పుపడుతున్నారు. ఎవరి గొప్పతనం వారిదేనంటున్నారు. ఫుట్‌బాల్‌లో పీలేని, మారడోనాని ఎలానైతే పోల్చిచూపించలేమో.. క్రికెట్‌లోనూ బ్రాడ్‌మన్‌ , సచిన్‌ని వ్యత్యాసించలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 

No comments:

Post a Comment

Jai Ho .............