డీఎంకే పై సీబీ'ఐ '
2జీ స్పెక్ట్రం కుంభకోణం తుపాను తమిళనాడును తాకింది. బుధవారం సీబీఐ అధికారులు పలువురు డీఎంకే నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. కరుణానిధి కూతురు కనిమోళి సారథ్యంలోని స్వచ్ఛంద సంస్థ కార్యా లయంలోనూ సోదాలు జరిగాయి. ఈ ఘటన డీఎంకే, యూపీఏల మధ్య అగాధాన్ని పెంచింది.

న్యూఢిల్లీ: నిన్నమొన్నటి వరకు పార్లమెంటును కుదిపేసిన 2జి స్పెక్ట్రం కేటాయింపుల తుపాను బుధవారం చెనై్నలో కేంద్రీకృతమైంది. డిఎంకె పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నాయకుల నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ బుధవారం పెద్ద ఎత్తున అనేక దాడులు జరిపింది. టెలికాం మంత్రి ఎ రాజాను గత నెలలో బలవంతంగా మంత్రివర్గం నుంచి తొలగిం చడం కాంగ్రెస్- డిఎంకే మైత్రికి ఒక పరీక్షగా నిలిచిం ది. అయినా, తమ స్నేహం, యూపీఏ కూటమిలో భాగ స్వామ్యం చెక్కుచెదరవని కాంగ్రెస్- డిఎంకే రెండూ ఆ సమయంలో ప్రకటించాయి. అయితే, బుధవారం 34 చోట్ల డిఎంకె నాయకుల నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ జరిపిన దాడులు ఆ మైత్రీబంధానికి విఘాతం కలిగించవచ్చు. ఇందులో 27 దాడులు తమిళనాడు లో జరగ్గా, ఏడు ఢిల్లీలో జరిగాయి.
కనిమోళి సంస్థపై కూడా...

డిఎంకేకు అనుకూలంగా వ్యవహరించే నక్కీరన్ పత్రిక అసోసియేట్ ఎడిటర్ కామరాజ్‌ను కూడా సిబిఐ విడిచిపెట్టలేదు. అలాగే, కరుణానిధి కుమార్తె, రాజ్య సభ సభ్యురాలు కనిమోళి అండదండలున్న మైలం అనే ఎన్‌జీఓపై కూడా సిబిఐ దాడులు జరిగాయి. ఈ సంస్థ కూడా చెనై్నలో ఉంది. కనిమోళి టెలికాం మాజీ మంత్రి ఎ రాజుకు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. మైలంను ఫాదర్ జెగత్ గాస్పర్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా కొన్ని ముఖ్య కార్యకలాపాల్ని కూడా ఆయనే నిర్వహిస్తారు. ఈ ఎన్‌జీఓకు కనిమోళి డైరెక్టర్‌గా ఉన్నారు. 2జి ఆర్థిక అక్రమాల్లో ఈ ఎన్‌జీఓకు కూడా పాత్ర ఉండవచ్చని సిబిఐ భావిస్తున్నట్టు ఆ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. కనిమోళి తల్లి నిర్వహిస్తున్న ఒక వ్యాపారంలో అకౌంటెంట్‌గా ఉన్న వ్యక్తి ఇంటిపై కూడా దాడి జరిగింది.
డిఎంకే అసంతృప్తి

ఇంతవరకు ఎ రాజాకే పరిమితమైన కుంభ కోణం వ్యవహారం ఇప్పుడు ఏకంగా డిఎంకె మెడకు చుట్టుకుంది. పార్టీ నాయకుల నివాసాలు, కార్యాల యాలపై దాడులు డిఎంకేకు అసంతృప్తిని కలిగించా యి. పార్టీ అధినేత, తమిళనాడు సీఎం ఎం కరుణానిధి రాజా వెనక పార్టీ ఉందని ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అయితే రాజా దోషి అని తేలితే, బయటకు పంపిస్తామని కూడా ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.
మా సంబంధాలు కొనసాగుతాయి : కాంగ్రెస్

వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకున్న కాం గ్రెస్ పార్టీ డిఎంకేతో తమ మైత్రి ఎప్పటిలాగే పటిష్టంగా ఉంటుందని చెప్పింది. �ఈ దాడులు విస్తృత దర్యాప్తులో భాగంగా మాత్రమే జరుగుతున్నాయి. మా మిత్రుల్ని మేం విశ్వసిస్తున్నాం� అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అవినీతిని ఎంతమాత్రం సహించబోమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటీవలే ప్రకటిం చారు. �నిజాయితీ, నీతినియమాలతో కూడిన పాలన ను అందించాలన్నది మా అభిమతం� అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ అన్నారు. డిఎంకే విష యానికి వస్తే అది చాలావరకు యూపీఏ కూటమిపైనే ఆధారపడి ఉందని, సిబిఐ దర్యాప్తు మరింత తీవ్రంగా మారినా ఆ పార్టీ కేంద్రంతో శత్రుత్వ వైఖరిని అవలం బించదని కాంగ్రెస్‌లో కొందరు ప్రైవేట్ సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
చెన్నై దాడులకు ప్రాధాన్యం

రాజకీయంగా చూసినట్టయితే, లాబీయిస్ట్ నీరా రాడియా, ట్రాయ్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ బైజా ల్ నివాసాలు, కార్యాలయా లపై బుధవారం ఉదయం జరిగిన దాడులకన్నా, చెన్నై లో జరిగిన దాడులకు ప్రాధాన్యం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ దాడుల సంద ర్భంగా అనేక కీలకపత్రాలు లభించినట్టు సిబిఐ ప్రతినిధి తెలిపారు. సిబిఐకి చెందిన 150 మంది ఈ దాడులు జరిపారు. రాజా సహాయకులని భావిస్తున్న కొందరి ఇళ్లలో కూడా సిబిఐ సోదాలు జరిపింది.
ఢిల్లీలో రాడియా కార్యాలయంపై దాడి, విచారణ
కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా, ట్రాయ్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ జైజాల్ ఇళ్లు, కార్యాలయాలపై సిబిఐ బుధవారం ఢిల్లీలో దాడులు నిర్వహించింది. 2జి స్పెక్ట్రం కుంభకోణంపై దర్యాప్తులో భాగం ఈ దాడులు జరిగాయి. దాడులు ప్రారంభమైన తర్వాత సిబిఐ నీరా రాడియాపై సిబిఐ విచారణ ప్రారంభించింది. రాడియా కార్యాలయం వైష్ణవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, దక్షిణ ఢిల్లీలోని ఆమెకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంపైన సిబిఐ సిబ్బం ది దాడులు నిర్వహించారు. ఆమె టెలిఫోన్ సంభాషణలపై నీరా రాడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 25న పదిగంటల పాటు ప్రశ్నించింది.తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న పది పదకొండు కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా సిబిఐ ప్రశ్నించింది.దక్షిణ ఢిల్లీలోని రాడియా సైనిక్ ఫాం హౌస్‌ను అధికారులు చుట్టుముట్టారు. అలాగే బారఖాంబా రోడ్‌లో ఉన్న ఆమె కార్యాలయంపై కూడా దాడులు జరిపారు. బుధవారం ఉదయాన్నే దాడులు ప్రారంభించాం. అవసరమున్నంతవరకూ దాడుల్ని కొనసాగిస్తామన్నారు.
No comments:
Post a Comment