ఆహార అభయ'హస్తం'
ఆహార భద్రత నేడు ప్రపంచ దేశాల లక్ష్యంగా అవతరించింది. ఆర్థిక సంక్షోభానికి తోడు, కృత్రిమ అహార కొరత, అధిక ధరలు తోడై కోట్లాది మంది ఆకలి అగాథంలోకి జారుకున్నారు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడుత్ను వారి సంఖ్య 87కోట్లకు చేరుకోగా వారిలో 25 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆహార భద్రతపై చట్టాన్ని రూపొందించేందుకు యూపీఏ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. 'జాతీయ సలహా మండలి' (ఎన్ఏసీ) సోనియా గాంధీ సారధ్యంలో ఈ నెల 23న సమావేశమై రాబోయే ఆర్థిక సంవత్సరానికల్లా దేశంలోని 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సంక్షేమ కార్యక్రమం ఫలిస్తే 75 శాతం దేశ జనాభా అకలి సమస్య నుంచి బయటపడే అవకాశముంది.
అంతర్జాతీయ విధాన పరిశోధనా సంస్థ (ఇన్‌ఫ్రీ) రూపొందించిన అకలితో నకనకలాడుతున్న 84 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం 67 స్థానంలో ఉంది. మనకంటే పేద దేశాలుగా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల్లాంటి అసియా దేశాలే కాకుండా యుగాండా లాంటి ఆఫ్రికా దేశాలు కూడా ఈ విషయంలో ముందున్నాయి.
మరోవైపు ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో మన దేశ సంపన్నుల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. పేద ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న ఈ అంతరం రాబోయే సామాజిక ఉత్పాతాలకు సంకేతంగా భావించవచ్చు. అంతేకాకుండా ప్రపంచ ఆహారధాన్యాలు, చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలోనూ, పాలు, వంటనూనె, పప్పుల ఉత్పత్తిలో అగ్రస్థానంలోనూ ఉన్న భారత్‌లో ఆకలితో కునారిల్లే వారిసంఖ్య అధికంగా ఉండటం శోచనీయం.
దేశంలో పోషకాహార లోపంతో, ఆకలితో మర ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిపోతోంది. ఒకపక్క లక్ష్యానికి మించిన ఆహారోత్పత్తి సాధిస్తున్నప్పటికీ మరోపక్క దాని లభ్యత 50ల నాటి స్థితికి చే రుకుంది. ఈ పరిస్థితిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు చొరవ చూపడంలేదు. జీడీపీ వృద్ధి రేటు పెంచేందుకు పార్రిశామిక రంగానికి ఉపకరించే విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు ఆమ్ ఆద్మీని నిర్లక్ష్యం చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
మరోపక్క లక్షాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మానవ వినియోగానికి పనికి రాకుండా పాడై పోతుండడంతో సుప్రీంకోర్టు పేదల కు పంచాలని ఆదేశించినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇనాళ్ళు తాత్సారం చేసిం ది. 'సమ్మిళిత అర్థికాభివృద్ధి' విధానంలో భాగంగా ప్రజలందరికి పోషకాహార లభ్యతను సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా నేడు ఎంచుకుంది.

'ప్రాణాంతకమైన హింసలన్నిటిలోకి ఆకలి అత్యంత శక్తివంతమైనది.' అని ప్రజల్ని ఆకలి రక్కసికి వదిలి వేస్తున్న ప్రభుత్వ చర్యలు రాజ్యహింసలో భాగమేనని మేధావి జాన్ మెండల్ వ్యాఖ్యానించారు. 2009 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) పటిష్టం చేసి పట్టణాలకు వలస వచ్చే ప్రజల కోసం సార్వత్రిక వంట శాలలను ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం గురించి ఇంత వరకు పట్టించుకోనేలేదు.
ఇంధన ధరలను పెరగడం, నిత్యావసర ధరలు అందుబాటులో లేకపోవడంతో సర్వత్రా అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఆహార భద్రత చట్టాన్ని రూపొందించడంలో మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకపడిపోయాము.
జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేయడం లో భాగంగా దారిద్య్ర రేఖ ప్రమాణాన్ని పక్కన పెట్టింది. ఆహార భద్రతా చట్టం కింద 'ప్రాధాన్య', 'సాధారణ' అనే రెండు విశాలమైన తరగతులుగా కుటుంబాల ను విభజించింది. ప్రాధాన్య విభాగంలోని ప్రజలకు సబ్సిడీ ధరలకు, సాధారణ విభాగంలోని ప్రజలకు కనీస మద్ధతు ధరలో సగం ధరకు ఆహార ధాన్యాలను, చిరు ధాన్యాలను అందించాలని ఎన్ఏసీ సూచించింది.
90 శాతం గ్రామీణ జనా భా, 50 పట్టణ జనాభా ఈ పథకం పరిధిలోకి వస్తారు. గ్రామాల్లో 46 శాతం పట్టణాల్లో 28 శాతం ప్రాధాన్య కుటుంబాలున్నాయని, అదే విధంగా గ్రామాల్లో 44 శాతం, పట్టణాల్లో 22 శాతం సాధారణ కుటుంబాలున్నాయని ప్లానింగ్ కమిషన్ అంచనా వేసింది. ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తూ 2014 కల్లా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని ఎన్ఏసీ నిర్ణయించింది.
2014 గడువుతో రూపొందిన ఈ ఆహార భద్రత చట్టంపై ప్రతి పక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. ఎఫ్‌సీఐ గోడౌన్లలో పాడైపోతున్న బియ్యాన్ని వదిలించుకోవడానికే యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, నిత్యావసరాల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం ఇలాంటి జనాకర్షణ పథకంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తోందని విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో రాహుల్ గాంధీని ఢీల్లీ సింహాసనంపై కూర్చోబెట్టడం కోసం, పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను పునర్ధురించడం కోసం ఒక ఎన్నికల ఎత్తుగడగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, ఉపాధి హామీ పథకాలకు పట్టిన గతే దీనికి పడుతుందని కొందరు పెదవి విరుస్తున్నారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంత్యోదయ అన్న యోజన లాంటి పలు విఫల పథకాలలో ఇదొకటి కాకూడదు. ఇంతకాలంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాలన్నిటిని ఒకే గొడుగు కింద కు తీసుకొస్తే ఆహార భద్రత సాకారమవుతుందని నిపుణులు అభ్రిపాయపడుతున్నారు.
ఆహార భద్రత అనేది ఆహార ధాన్యాల పంపిణీపై కాకుండా, దేశంలో అమల య్యే సామాజికార్థిక విధానాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆహార పంట లు స్థానంలో వాణిజ్య పంటల్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో ప్రజానీకం ఆహారం కొరతను ఎదుర్కోవలసి వస్తోంది. పలు రకాల ఆహార పంటలు వేస్తున్నపుడు కొంత ధాన్యాన్ని రైతు తన అవసరాల కోసం అట్టిపెట్టుకునే వాడు.
అంటే ఉత్పత్తిలోనే ఆహార భద్రత అంశం కూడా ఇమిడి ఉంది. ఎగుమతుల ఆధారిత ఆర్థిక విధానం ఫలితంగా దేశంలో ఆహార అభద్రత నెలకొంది. ప్రభుత్వాలు శాస్ట్రీయమైన వ్యవసాయక, పారిశ్రామిక, కార్పొరేట్ విధానాన్ని రూపొందించకపోవడంతో... అన్నపూర్ణ కాస్తా ఆకలి చావుల దేశంగా మారింది. ఆహార భద్రత అనేది సామాజికార్థిక విధానంలో అంతర్భాగం.
అలాంటిది మిగిలిన సామాజికార్థిక అంశాల నుంచి ఆహార భద్రత అనే అంశాన్ని మాత్రమే విడదీసి పరిష్కరించలేము. ఇతర సంక్షేమ పథకంలాగా పీడీఎస్ ద్వారా ఆహార భద్రత సాధించాలనుకోవడం ప్రభుత్వ హ్రస్వదృష్టికి తార్కాణం. రాజకీయక లబ్ధి కోసం రూపొందించిన ఇతర సంక్షేమ పథకాల లాగా ఇది కూడా ప్రజలకు పాక్షికంగానే ఉపయోగపడుతుంది.

No comments:
Post a Comment