Thursday, October 21, 2010

పారిశ్రామిక హబ్‌ గుజరాత్‌

gujarath-ind-hubఅహ్మదాబాద్‌: పారిశ్రామికాభివృద్ధిలో ఎప్పుడూ ముందు వరసలో ఉండే గుజరాత్‌ రాబోయే 5-6 ఏళ్లలో కొత్తగా12 పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు చేయబోతోంది. వీటిలో ప్రైవేట్‌ రంగానికి చెందిన కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తాయి. మొత్తం 12 ప్రాజెక్టులకు గాను ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులను గుర్తించింది. 2015- 16 నాటికి ఇవి కార్యరూపం దాలు స్తాయని గుజరాత్‌ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ (జీఐడీసీ) సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (సర్‌)కు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది.

మొట్ట మొదటిసారి ఏర్పాటు చేసే ఈ హబ్‌లో పెట్రో కెమికల్‌ - పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌)ను బరూచ్‌లో గత సంవత్సరం 4.53 లక్షల చదరపు హెక్టార్లలో నిర్మించారు. రాష ్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్‌ అనే పారిశ్రామిక హబ్‌లో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. వాటిలో ఆటో విడి పరికరా లు, రసాయ నాలు, హెల్త్‌కేర్‌, ఎలక్ట్రానిక్స్‌కు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి రూ.70,000 కోట్లకు పైగా పెట్టుబడులు అవసరమవుతా యి. దీనికి గాను ఒఎన్‌జీసీ పెట్రో అడిషన్స్‌ లిమిటెడ్‌ పీసీపీఐఆర్‌లో రూ.19,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతుంది.

ప్రైవేట్‌ రంగానికి చెందిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారిని ఆహ్వానిస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న డజను స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (సర్‌)లో 10 జీడీఐసీ, పీఎస్‌యూలు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తాయి. మిగిలిన రెండు గుజరాత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (జీఐడీబి) గుజరాత్‌ మెరిటైం బోర్డు నిర్మిస్తాయి. 50,000 వేల హెక్టార్లలో నిర్మిస్తున్న స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌లో (సర్‌)లో పారిశ్రామికవేత్తలు స్థానిక యజమానులతో సంప్రదించి ఇక్కడ స్థలాలను కొనుగోలు చేసుకోవచ్చు. సెజ్‌ల మాదిరిగా పన్నుల్లో రాయితీలు మాత్రం ఉండవు. అయితే ఇక్కడ కొనుగోలు చేసిన స్థలాలు నాణ్యమైన మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తారు. అనుకున్న సమయం కంటే ముందే ఇక్కడ యూనిట్‌లను ప్రారంభించవచ్చు. స్పెషల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ రీజియన్‌లో (సర్‌)లో 55 శాతం గృహ సముదా యాలు టౌన్‌షిప్‌లు కాగా, మిగిలినవి పారిశ్రామిక యూనిట్‌లు ఉంటాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

సంతాల్‌ పూర్‌లో ఏర్పాటు చేసే సర్‌లో 1.86 లక్షల హెక్టార్లలో (ప్రధానంగా ఆగ్రో, సోలార్‌ ఎనర్జీపై) దృష్టి పెడతారు. హలోల్‌ సావ్లీ సర్‌లో ఏర్పాటు చేసే 1.22 లక్షల ెహక్టార్లలో ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ విడపరికరాలు పరిశ్రమలకు కేటాయించారు.విరామ్‌గామ్‌సానాంద్‌ సర్‌ 1.38 లక్షల హెక్టార్లు (ఇక్కడ ఆటో, ఇంజనీరింగ్‌, హెల్త్‌కేర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. అతి చిన్న సర్‌ దోలెరా కూడా 50,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద సెజ్‌ చైనాలోని షెన్‌జన్‌లో ఇది 32,700 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాని కంటే కూడా ఇది చాలా పెద్దదని ఆ అధికారి తెలియజేశారు.

No comments:

Post a Comment

Jai Ho .............