సచిన్ టెండూల్కర్... ఈ పేరు వింటేనే ప్రతి ఒక్క భారతీయుడి ఒళ్లు గర్వంతో పులకించిపోతుంది. క్రికెట్ క్రీడను ప్రేమించే వారైతే అతడిని దేవునిగా ఆరాధిస్తారు. రెండు దశాబ్దాల సుధీర్ఘమైన క్రికెట్ కెరీర్, లెక్కలేనన్ని రికార్డులు... అనేక ఘనతల్ని తన సొంతం చేసుకున్న సచిన్ ఖాతాలో కొద్ది రోజుల క్రితం (డిసెంబర్ 19, 2010) మరో చారిత్రాత్మక ఘనత వచ్చి చేరింది. 133 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ సాధించని సరికొత్త రికార్డును మాస్టర్ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 50 శతకాలు పూర్తి చేసిన తొలి క్రికెటర్ అయ్యాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని అనితర సాధ్యమైన రికార్డును సాధించి కూడా... ‘50వ సెంచరీ అనేది నా గణాంకాల్లో చేరిన మరో అంకె మాత్రమే’ అని చెప్పడం అయిన సచిన్‌కే చెల్లింది. అందుకే అతను క్రికెట్ క్రీడకు రారాజు.. క్రికెట్ ఎవరెస్టు అయ్యాడు. అసలు సచిన్ ఇంత గొప్ప క్రికెటర్‌గా రూపాంతరం చెందడానికి ఏఏ అంశాలు తోడ్పడ్డాయి అనేది ఒకసారి విశ్లేషిస్తే...
నిత్య విద్యార్థి...
తన కెరీర్లో ఎన్నో రికార్డుల్ని తన అక్కున చేర్చుకున్న సచిన్ ఇప్పటికీ కూడా నిత్య విద్యార్థే... క్రికెట్ సంబంధించి ఏ విషయానై్ననా అతను తదేకమైన దీ, అంకుఠిత భావంతో నేర్చుకుంటాడు. ఇప్పటికీ కూడా తనకంటే జూని యర్ల నుంచి సలహాలను స్వీకరించడానికి అతను సిగ్గుపడడు. నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నప్పుడు.. తాను ఎలా షాట్లను ఆడుతున్నానని... ఆ షాట్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా అన్న విషయాల్ని... తన సహచరులతో అడిగి తెలు సుకునే ప్రయత్న సచిన్ చేస్తుంటాడు. ఇలాంటి గుణం సమకాలీన క్రికెటర్ లలో కనిపించడం చాలా అరుదు.
క్రికెటే లోకం...
టెండూల్కర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం క్రికెట్ పట్ల అతనికున్న మోజు, ఏకాగ్రత, అంకితభావం, అంకుఠిత దీక్ష అలాంటిది. అతను ఆడే ప్రతి షాట్లో ఇది మనకు కనబడుతుంది. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం ప్రారంభించిన తొలినాళ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను మైదానంలో క్రికెట్ ఆడుతూనే గడుపుతూ ఉండేవాడు. ఇంతటి ఏకాగ్రత అంకుఠిత భావం మాస్టర్ తన ఆటపై చూపెట్టాడు కాబట్టే.. ఈ రోజు ప్రపంచ రికార్డులన్నీ అతనికి దాసోహమంటున్నాయి.
క్రీజులో అతను చేసే అతిచిన్న కదిలిక కూడా... వంద శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటుంది. ‘సంప్రదాయం కోసం ఉపయోగించే ఫుట్‌వర్క్‌ను నేను నమ్మను. ఎందుకంటే టెస్టు క్రికెట్‌కు అవసరమైన ఆటతీరు... పుస్తకాల్లో తెలిపిన విధంగా ఉండదు’ అని సచిన్ ఒక సందర్భంలో అన్నాడు. ఈ ఒక్క ఉదాహరణ టెండూల్కర్‌కు క్రికెట్‌పై ఉన్న పిచ్చి ప్రేమను చాటి చెబుతుంది. మాస్టర్‌లోని ఈ క్వాలిటీయే అతనిలో అన్ని రకాల షాట్లను ఆడగలిగే సత్తా సాధించేలా చేసింది. బయట సచిన్ ఎలాఉన్నా... ఒక్కసారి క్రీజులోకి వచ్చాడంటే... అతను పూర్తిగా మారిపోతాడు. బయటి ప్రపంచానికి బదులు కేవలం క్రికెట్ మాత్రమే అతని లోకంగా మారుతుంది. ఈ క్రీడ పట్ల సచిన్‌కున్న ఏకాగ్రత, క్రికెట్‌పట్ల అతనికున్న అంకుఠిత భావం, మోజు... అతను ఆడే ప్రతి షాట్లోను ప్రతిఫలిస్తుంది.

ఆడేది ఏ రంజీ మ్యాచ్ అయినా... గల్లీ క్రికెట్ అయినా... టెస్టు మ్యాచైనా... వన్డే మ్యా చైనా... పూర్తిస్థాయి ఏకాగ్రత, అంకిత భావంతో ఆడడం సచిన్‌కున్న ప్రత్యేకత అని చెప్పవచ్చు. తాను ఆడేది ఏ మ్యా చైనా ప్రజలు తనను గమనిస్తున్నా రనే భావన అతనిలో ఎప్పుడూ ఉండడమే దీనికి ప్రధానమైన కార ణం. ఒక బాలు డు ప్రతీ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎలాంటి ఆసక్తిని చూపెడతాడో అదే విధమైన కుతూహలాన్ని చూపెట్టడంతో పాటు... ఆడే ప్రతి మ్యాచులో కూడా తన అత్యుత్తమంగా రాణించాలనే గట్టి పట్టుదల అతన్ని ఇంత గొప్ప క్రికెటర్‌గా మార్చింది. 21 ఏళ్ల సుధీర్ఘ కాలం నుంచి ఆడుతున్నా... ఇప్పటికీ కూడా సచిన్‌కు క్రికెటే లోకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేగాకుండా... ఇతర కెప్టెన్ లాంటి ఇతర బాధ్యతల్ని తలకెత్తుకోకుండా... కేవలం బ్యాటింగ్‌పైనే మాస్టర్ తన పూర్తి స్థాయిలో దృష్టిని సారించడం కూడా అతన్ని గొప్ప క్రికెటర్‌ను చేసింది. అర్ద సెంచరీలు, సెంచరీలు సాధించాలనే ఏకైక లక్ష్యమే అతడిని ఎన్నో బ్యాటింగ్ రికార్డులు నెలకొల్పేలా చేసింది.
సచిన్‌కున్న క్రేజ్...
సచిన్ క్రీజులోకి వచ్చిన ప్రతిసారి వేల సంఖ్యలో కళ్లు అతని ప్రతీ కదలికను గమనిస్తూ ఉంటాయి. అతను బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి కూడా తనకు తానే ఉదాహరణ గా సచిన్ కనబడుతాడు. మాస్టర్ బ్యాటు నుంచి పరుగులు జాలువారుతున్నంత సేపు... అతన్ని గమనిస్తున్న... వేల మందికి లెక్కకు మించిన ఆనందం లభ్యమౌతుంది. అదే అతను ఔటయితే... మొత్తం స్టేడియం నిశ్శబ్దంగా మారిపో తుంది. టెండూల్కర్ ఔటయితే... ఎందుకు అతను ఎలా ఔటయ్యాడనే దానికంటే... ఏ పరిస్థితులు అతను ఔటయ్యే లా చేసాయనే దానిపై విశ్లేషకులు ఆలోచిస్తారు.
అయితే టెండూల్కర్ మాత్రం వీటన్నింటిని పట్టించుకోకుండా... తన ఆటను ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆడుతూనే ఉంటాడు. ‘జెంటిల్‌మెన్’ టెండూల్కర్ ఎప్పుడు విఫలం కాడు. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే... ‘అతడిని భయంకరమైన వసీం అక్రమం, వఖార్ యూనిస్, ఖదీర్ లాంటి వాళ్ల బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు జట్టులోకి ఎంపిక చేయాలా వద్దా? అనేది ఇప్పుడు మనముందున్న ముఖ్య మైన ప్రశ్న’ అని కేవలం 16 ఏళ్ల వయస్సున్న సచిన్‌ను పాకిస్థాన్ పర్యటనకు తొలిసారిగా జాతీయ జట్టులోకి ఎంపి కచేసిన సెలెక్టర్ నరేన్ తమాన్హె అన్న మాటలివి. తమాన్హె చేసిన ఈ వ్యాఖ్యలు సచిన్‌లో ఆయన చూసిన ప్రతిభకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. అంతేగాకుండా... సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసేనాటికే ఒక మేలి క్రికెట్ వజ్రంగా రూపాంతరం చెందాడనే... వాస్తవానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.
వ్యక్తిగత వివరాలు...

పూర్తి పేరు : సచిన్ రమేశ్ టెండూల్కర్
పుట్టిన తేది : ఏప్రిల్ 24, 1973
జన్మస్థానం : బాంబే (ప్రస్తుతం ముంబాయి), మహారాష్ట్ర
ఎత్తు : 5 అడుగుల 5 అంగుళాలు
ముద్దుపేరు : టెండిల్యా, లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్
ఆడిన జట్లు : భారత్, ఏషియా ఎలెవన్, ముంబాయి,
ముంబాయి ఇండియన్స్
బ్యాటింగ్ స్టైల్ : రైట్-హ్యండ్ బ్యాటింగ్
బౌలింగ్ స్టైల్ : రైట్-ఆర్మ్ ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్
టెస్టు ఆరంగేట్రం : నవంబర్ 15, 1989, పాకిస్థాన్ పై
వన్డే ఆరంగేట్రం : డిసెంబర్ 18, 1989 పాకిస్థాన్ పై
ట్వంటీ20 : డిసెంబర్, 2006 దక్షిణాఫ్రికా పై
మాస్టర్ గొప్పతనం... క్రికెట్ దిగ్గజాల మాటల్లోనే...

* అతని (సచిన్)కి టెస్టు మ్యాచ్ అనేది రెండు రోజుల ముందుగానే తాను చేసే ప్రాక్టీసుతోనే ప్రారంభమౌతుంది. నెట్స్‌లో కూడా సాధ్యమైనంత ఎక్కువ బంతులు ఎదుర్కోవడానికి సచిన్ ఎప్పుడూ తపిస్తుంటాడు. నెట్స్‌లో కూడా అతను ఒక్క చెత్త షాట్‌ను ఆడడం కనిపించదు
- గ్యారీ కిర్‌స్టన్, భారత క్రికెట్ జట్టు కోచ్
* అతని (సచిన్)కి అతడే ఒక చాలెంజ్
- శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర
* మేము క్రికెట్ ఆడే రోజుల్లో సునీల్ గవాస్కర్ నెలకొల్పిన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు అనుకునేవాళ్లం. ఎవ్వరూ కూడా టెస్టుల్లో 50 వ సెంచరీని సాధించే దిశగా ఆలోచన కూడా చేయరని అనుకునేవాళ్లం. ఇది (సచిన్ సాధించిన 50 వ శతకం) ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధించిన గొప్ప ఘనత అని చెప్పగలను.
- కపిల్ దేవ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
* సచిన్ వికెట్ దక్కాలని కోరుకోని జట్టు ప్రపంచలో ఏది ఉండదు. ఎందుకంటే ఆ (సచిన్) వికెట్ దక్కితే... ఆ జట్టు మ్యాచ్‌ను దాదాపు గెలిచినట్లే మరీ
- మ్యాథ్యూ హేడెన్, ఆసీస్ మాజీ ఓపెనర్
* అతడు (సచిన్) ఆడే ప్రతీ మ్యాచ్‌ను చూసే ప్రయత్నం చేస్తాను.. ఎందుకంటే.. అతని లాంటి సహజ సిద్దమైన టెక్నిక్ కలిగిన బ్యాట్స్‌మన్ మరొకరు లేరు. అతని కఠోర శ్రమ, అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది.
- మొహమ్మద్ హనీఫ్, పాక్ మాజీ క్రికెటర్
* ప్రపంచ క్రికెట్‌లో 20 ఏళ్ల సుధీర్ఘ కాలం పాటు కూడా ఒకరు ఆడగలరని నేనే ఎప్పుడూ అనుకోలేదు.
- గేమ్ పొలాక్
* ఇంత సుధీర్ఘకాలం పాటు ఒక టాప్ డ్రాకారునిగా ఎలా ఉండగలిగాడో నేను అతడిని అడుగుతాను... అంతేగాకుండా... అలా ఉండడానికి ఇతరులకు అతనిచ్చే సలహా ఏమిటని కూడా అడుగుతాను
- ఉసైన్ బోల్ట్, ప్రపంచ ఫాస్టెస్ట్ అథ్లెట్
* నేను ఈ రోజు క్రికెటర్‌గా మారడానికి కారణం సచిన్ టెండూల్కర్. అతడే లేకపోతే నేను అసలు బ్యాట్‌ను కూడా పట్టేవాడినే కాదు.
- వీరేంద్ర సెహ్వాగ్, భారత క్రికెట్ జట్టు సభ్యుడు
అద్బుతమైన జ్ఞాపకశక్తి...
సచిన్‌ది అద్బుతమైన జ్ఞాపకశక్తి. తన కెరీర్లో ఆడిన దాదాపు అన్ని మ్యాచులకు సంబంధించిన ముఖ్యమైన వివరాల్ని అతను ఖచ్చితంగా చెప్పగలడు. తానిచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో ఈ విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది.
అవార్డులూ... రికార్డులూ...

అవార్డులు...
2010 : ఐసీసీ అవార్డు- సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫి ఫర్ క్రికెటర్
ఆఫ్ ది ఇయర్
2010 : అక్టోబర్‌లో... ది ఏషియన్ అవార్డ్‌సలో భాగంగా ఇచ్చే
ఔట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ స్పోర్ట్‌స అండ్ ద పీపుల్స్
చాయిస్ అవార్డు
2008 : పద్మ విభూషణ్
2004-07 : ఐసీసీ వరల్డ్ ఎలెవన్
2005 : రాజీవ్ గాంధీ అవార్డు (క్రీడలు)
2003 : వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
2001 : మహారాష్ట్ర రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర
భూషణ్ అవార్డు
1999 : పద్మశ్రీ
1997-98 : రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర
1997 : విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
1994 : అర్జున అవార్డు
రికార్డులు...
* అత్యధిక టెస్టు శతకాలు (50)
* అత్యధిక వన్డే శతకాలు (46)
* అత్యధిక అంతర్జాతీయ శతకాలు (టెస్టులు, వన్డేలు కలుపుకొని-96)
* టెస్టుల్లో అత్యధిక పరుగుల సగటు (56.54)
* అత్యధిక టెస్టులు ఆడిన రికార్డు (176)
* భారత్ వెలుపల అత్యధిక పరుగులు (56.85 సగటుతో) 96 టెస్టుల్లో
7959 పరుగులు)
* భారత్ వెలుపల అత్యధిక సెంచరీలు (28)
* 100 కు పైచిలుకు భాగస్వామ్యాలు (81)
* భారత్-దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక
పరుగులు సాధించిన తొలి క్రికెటర్ (1500)
* భారత్-దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు
సాధించిన క్రికెటర్ (6)
సచిన్ మెచ్చినవి...
* ఆసీస్ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ చేసిన ప్రశంస
* ఈ ఏడాది (2010) టెస్టుల్లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం
* వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా రికార్డును అధిగమించడం
మాస్టర్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు...

* చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీతో స్కూల్ స్థాయిలో జరిగిన హారిస్ మెమోరియల్ చాలెంజ్ షీల్డ్ టోర్నీలో కలిసి సచిన్ చేసిన 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం గురించి అందరికి తెలుసు.. అయితే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన టోర్నీ ఫైనల్ మ్యాచులో సచిన్ సాధించిన 346 నాటౌట్ స్కోరు గురించి చాలామందికి తెలీదు.
* ఆడిన తొలి రంజీ టోర్నీ మ్యాచుతో పాటు దులీప్ ట్రోఫీ మ్యాచులో సచిన్ సెంచరీలు సాధించిన విషయం అందరికి తెలుసు.. అతను సాధించిన ఆ శతకాల సహాయంతోనే జట్టు గట్టెక్కిన విషయం చాలామందికి తెలీదు.
* ఆడిన తొలి టెస్టు మ్యాచులో పాక్ పేసర్ వఖార్ యూనిస్ వేసిన ఒక బంతి తాకి ముక్కు నుంచి రక్తం కారిన విషయం అందరికి తెలుసు.. అయితే ఆ మరుసటి బంతినే మాస్టర్ బౌండరీకి తరలించిన విషయం చాలామందికి తెలీదు.
విదేశీగడ్డపై...
సచిన్ ఆడిన తొలి 21 టెస్టుల్లో 20 టెస్టులు విదేశీ గడ్డపై ఆడినవే కావడం విశేషం. ఈ 21 టెస్టుల్లో కూడా సచిన్ 38 సగటుతో నాలుగు శతకాలు, ఐదు అర్ధ శతకాల్ని అతను సాధించాడు. ఈ టూర్లలో పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలు పర్యటనలు ఉన్నాయి.
ఆయా స్థానాల్లో మాస్టర్ సాధించిన సెంచరీలు...

బ్యాటింగ్ ఆర్డర్ ఇన్నింగ్స్ శతకాలు
1 1 0
4 236 44
5 27 4
6 20 2
7 4 0 మచ్చలేని మనిషి...
టెండూల్కర్‌ది మచ్చలేని వ్యక్తిత్వం. రెండు దశాబ్దాల సుధీర్ఘ కాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఉన్న సచిన్ వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడలేదు. తన వ్యక్తిత్వాన్ని హరించే ఎలాంటి చిన్న పనిని కూడా సచిన్ చేయ లేదు. తన కెరీర్‌గా ఎంచుకున్న రంగానికిగల ప్రాధాన్య త, సమాజంలో తనకుగల స్థానాన్ని గుర్తిం చి అతను మసలుకున్నాడు. సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడిన దాదాపు ప్రతి ఒక క్రికెటర్ కూడా తన ఆట ద్వారా ఏదో ఒక రకమైన పేరును సంపాదిస్తారు. ఇయాన్ బోథమ్ ఇరోల్ ఫ్లైయిన్ ఆఫ్ క్రికెట్‌గా, సర్ వివియన్ రిచర్డ్‌స మార్టిన్ లూథర్ కింగ్, షేస్ వార్న్ మార్లిన్ మాన్రోగా, ముత్త య్య మురళీధరన్ హోబిట్‌గా పేరు ను సంపాదిం చారు. అయితే టెండూల సెక్యు లర్ సేయింట్ (ఋషి)’ అనే పేరును సంపాదించాడు. అటువంటి వ్యక్తిత్వం సచిన్ సొంతం.
బౌలింగ్‌లోనూ దిట్ట...
బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ లోను సచిన్‌కు మంచి ప్రతిభ ఉంది. క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ మాదిరిగా కాకున్నా... అతనితో పోల్చదగ్గ సత్తా సచిన్‌లోనూ ఉంది. సోబర్స్ లాగానే టెండూల్కర్ బంతిని రెండు రకాలు గా స్వింగ్ చేయగలడు. చాలా మంది బౌలింగ్ స్పెషలిస్టుల్లో కూడా ఈ సత్తా అరుదుగా కనబ డుతుంది. అంతేగాకుండా అద్భుతమైన లెగ్ బ్రేక్ బంతుల్ని వేయడంతో పాటు... మణిక ట్టును బాగా తిప్పగల చాలామంది స్పిన్నర్లకు కూడా సాధ్యంకాని గుగ్లీలను సరైన ప్రాంతం లో వేయడంలో కూడా సచిన్ దిట్ట అనడంలో సందేహం లేదు. ఆఫ్‌స్పిన్‌ను వే యడంలో కూడా సచిన్‌కు మంచి ప్రవేశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే... తన బ్యా టింగ్‌కు ఉ న్న ప్రాధాన్యత దృష్ట్యా... జట్టు అ వసరాలను దృష్టిలో ఉంచుకుని సచిన్ పా ర్ట్ టైం బౌలర్ గా తన సేవలను అందిస్తు న్నా డు. అం తేగా కుండా ఒక ఫీల్డర్‌గా స్లిప్స్‌తో పాటు, డీప్ థర్డ్ మ్యాన్ ప్రాంతంలో సచిన్ బాగా రాణించాడు.
రిజర్వ్‌డ్ పర్సనాలిటీ...
టెండూల్కర్‌ది చాలా రిజర్వ్‌డ్ వ్యక్తిత్వం. క్రొత్తవారితో కలుపుగోలుగా మాట్లాడటం గాని... తన అభిప్రాయాల్ని పంచుకోవడం గాని అతను చేయడు. తనకు తెలిసిన కొద్ది మంది మిత్రుల సమక్షంలోనే... మనసువిప్పి మాట్లాడటాన్ని అతను ఇష్టపడతాడు.
క్రికెట్ దిగ్గజాల మేలు కలయిక...
ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందిన అనేక గొప్ప క్రికెటర్లు తమలో ఉన్న ఏదో ప్రత్యేకత ద్వారా... పేరు ప్రతిష్టలు సంపాదిం చగా... టెండూల్కర్ మాత్రం ఈ క్రికట్ దిగ్గజాల మేలుకలయికగా టెండూల్కర్‌ను పేర్కొనవచ్చు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా విధ్వంసకర బ్యాటింగ్ శైలి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా జట్టుతో గ్వాలియర్‌లో వన్‌డే మ్యాచ్‌లో సచిన్ సాధిం చిన డబుల్ సెంచరీని చూస్తే... అందరికీ ఇట్టే అర్దమౌతుంది. అదే విధంగా... మైదానంలో సర్ వివియన్ రిచర్డ్‌స కదిలే తీరు (2003 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా సెంచూరియన్ లో పాకిస్థాన్ జట్టుపై సచిన్ సాధించిన 98 పరుగులు), సునీల్ గవాస్కర్ టెక్నిక్, పట్టు దల (1999లో చెనై్నలో పాక్‌తో జరిగిన టెస్టు లో సచిన్ సాధించిన 136 పరుగులు), ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా నియంత్రణ, ఒత్తిడిని తట్టుకుని చివరివరకు పోరాడే తత్వం (2004 లో ఆసీస్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో సచిన్ సాధించిన అజేయ 241 పరుగులు) అతనిలో ఉన్న బహుముఖ ప్రజ్ఞను చాటి చెప్పాయి.
దాతృత్వ గుణం...
సచిన్‌లో ప్రత్యర్థులను చీల్చి చెండాడే అరివీర భయంకర బ్యాట్స్‌మన్‌తో పాటు... విశాల హృదయం గల మానవతామూర్తి కూడా ఉన్నాడు. ఎన్నో స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో టెండూల్కర్ పాల్గొన్నాడు. అంతేగాకుండా... తనవం తుగా ప్రతి ఏడాది 200 మంది పిల్లల చదువుల కయ్యే ఖర్చులను సచిన్ భరిస్తున్నాడు.
మాస్టర్ హాబీలు...
క్రికెట్‌నే తన సర్వస్వం అనుకున్న సచిన్ తీరిక దొరికినపుడు ఏం చేస్తుంటాడు అని క్రికెట్ అభిమానుల్లో సహ జంగా ఉదయించే ప్రశ్న. క్రికెట్ కాసేపు ప్రక్కనబెడితే మోటారు రేసులు ఫాస్టు కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంచి ఆహారం అంటే సచిన్‌కు ఎంతో ఇష్టం. మాస్టర్ తనకు ఎప్పుడు తీరిక దొరికినా... త నకు ఇష్టమైన మోటరు రేసులను తిలకించ డాన్ని ఇష్టపడతాడు. అందుకే అతను చాలా సందర్భాల్లో మోటరు రేసులకు ప్రసిద్దమైన యూరోపియన్ దేశాలకు వెళ్లి... అక్కడ ఫా ర్ములా వన్ మోటారు రేసులను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదిస్తుంటాడు. ఇలా గతంలో జర్మ న్, స్పానిష్ గ్రాండ్ ప్రీతో పాటు..సిల్వర్‌స్ట్రోక్ మోటారు రేసులను టెండూల్కర్ వీక్షించాడు.
మాస్టర్‌నే భయపెట్టించిన బౌలర్...
ప్రపంచ క్రికెట్‌లోని దాదాపు అందరు విధ్వంసకరు బౌలర్లకు తన బ్యాటింగ్ తఢాఖా చూపెట్టిన సచిన్ టెండూల్కర్‌ను కూడా భయపెట్టిన బౌలర్ ఉన్నాడంటే నమ్ముతారా! అభిమానులు నమ్మినా... నమ్మకపోయినా.. సచిన్ మాత్రం అవుననే అంటు న్నాడు. అయితే సచిన్ తన కెరీర్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడ్డానని మాస్టర్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికన్ బౌలర్లు ఆలన్ డొనాల్డ్, షాన్ పొలాక్ బౌలింగ్ లలో కంటే.. హాన్సీ బౌలింగ్‌లోనే తాను ఎక్కు వసార్లు ఔటయ్యానని... సచిన్ పేర్కొన్నాడు. క్రానే వేసిన బంతి నేరుగా ఫీల్డరు చేతిలోకి వెళుతున్నట్లు కనబడేది అని సచిన్ ఇటీవల ఇచ్చిన ప్రఖ్యాత గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురైన క్రానే.. 2002లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మృతి చెందాడు. తానెదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లలో ఆస్ట్రేలియన్ బౌలర్ మెక్‌గ్రాత్ అత్యుత్తమ బౌలరని ఈ ఇంట ర్వ్యూ సందర్భంగా అతను ఖితాబిచ్చాడు.
బాల్యం...
ఏప్రిల్ 24, 1973లో ముంబాయిలో సచిన్ రమేశ్ టెండూల్కర్ జన్నించాడు. అతడి బా ల్యం ఎక్కువగా... సాహిత్య సహవాస్ అనే రైటర్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో గడ చింది. బాల్యంలో తన సొసైటీలోని స్నేహి తు లతో కలిసి సచిన్ క్రికెట్‌ను ఆడేవాడు. ఆ సమయంలో సచిన్ కంటే వయస్సులో11 ఏళ్లు పెద్దవాడైన అతడి అన్న అజిత్ టెండూ ల్కర్ సచిన్‌ను క్రికెట్ ఆడడంలో బాగా ప్రొత్సా హించాడు. సచిన్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అతన్ని అన్న అజిత్ ఇచ్చిన ప్రొత్సాహమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని సచిన్ కూడా ఎన్నో సందర్బాల్లో వెల్లడించాడు.
తొలి అడుగులు...
11 ఏళ్ల ప్రాయం వరకు కూడా సచిన్ ప్రొఫే షనల్ క్రికెట్‌లో ఉపయోగించే బంతిని అసలు చూడలేదు. తన సొసైటీలో కేవలం టెన్నిస్ లేక రబ్బరు బంతితో క్రికెట్‌ను ఆడడం మాత్ర మే అతనికి తెలుసు. ప్రొఫెషనల్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ వద్దకు తోడ్కొని వెళ్లాడు. సచిన్‌ను తొలిసారి చూసిన ఆచ్రేకర్ అతనికి ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఉపయోగించే బంతితో ఆడిన అనుభవం ఉందా అని ప్రశ్నించాడు. అయితే సచిన్ ఇచ్చిన సమాధానం ఆచ్రేకర్‌కు ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. ఆయన ఒక్కసారి తదేకంగా సచిన్ వైపు చూశాడు. వెంటనే తాను శిక్షణ ఇచ్చే జట్టులో నాలుగవ స్థానానికి అతన్ని ఎంపికచే శాడు. అంతే అప్పుడే ప్రపం చ క్రికెట్‌లో ఒక మహాను భావుడి రాకకు నాంది పడింది. అనంతరం శారదా శ్రమ్ విద్యా మందిర్ స్కూల్ తరపున 12 ఏళ్లకే తొలి సెంచరీని సాధించి సచిన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
అనంతరం అండర్-17 విభా గంలో నిర్వహించే హారిస్ మెమోరియల్ చాలెంజ్ షీల్డ్ టోర్నీలో సహచరుడు తర పున చిన్ననాటి స్నేహి తుడు వినోద్ కాంబ్లీతో కలిసి 14 ఏళ్ల వయస్సులో సచిన్ నెల కొల్పిన 664 పరుగుల రికా ర్డు భాగస్వామ్యం అందరికి గుర్తుండే ఉంటుంది. ఏ ఫార్మాట్ క్రికెట్‌లో కూడా ఇది ఇప్పటికీ ఒక రికార్డే. అనంతరం ఇదే టోర్నీ ఫైనల్ మ్యాచులో మరో 346 పరుగుల భారీ స్కోరుతో అజేయంగా సచిన్ నిలిచాడు.
ఈ టోర్నీలో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన టెండూల్కర్ 207, 329, 346 పరుగులతో చెలరేగాడు. ఆచ్రేకర్ శిష్యరికంలో సచిన్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో కూడా అతను పరుగులేమి చేయకుండానే వెనుది రగడం గమనార్హం. ఆచ్రేకర్ ఎంపిక చేసిన నాలుగవ స్థానంలోనే సచిన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదే స్థానంలో ఆడాడు. సచిన్ రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ఆడిన తొలి మ్యాచు ల్లోనే సెంచరీల్ని సాధించాడు. ముంబై జట్టు ఓటమి కోరల్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి లో ఉండి కూడా సచిన్ ఈ శతకాల్ని సాధించడం విశేషం.
16 ఏళ్ల 205 రోజుల వయస్సున్నప్పుడు నవంబర్ 15, 1989 లో పాకిస్థాన్ జట్టుతో కరాచీలో జరిగిన మ్యాచ్‌తో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ వఖార్ యూనిస్ వేసిన ఒక బంతి తాకి ముక్కు నుంచి రక్తం కారింది. అయితే దాని వల్ల అతని ఏకాగ్రత, మోక్కవోని దీక్ష ఇసు మంతైనా దెబ్బతినలేదు. ఆ మరుసటి బంతినే బౌండరీకి తరలించి... తాను క్రికెట్ ప్రపం చాన్ని ఏలడానికి వచ్చానని పరోక్షంగా చాటాడు.
ఆ సిరీస్‌లో అంతగా రాణించకున్నా... తర్వాత జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచులో తన కెరీర్ తొలి సెంచరీని మాస్టర్ సాధించా డు. అంతేగాకుండా తన బ్యాటింగ్ సాయంతో ఆ మ్యాచ్‌లో జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. సచిన్ తన తొలి సెంచరీని మరో 31 రోజులు ముందు సాధించిన ఉంటే... టెస్టు క్రికెట చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా అతను రికార్డును సృష్టిం చేవాడు. అనంతరం 1991-92లో ఆస్ట్రేలి యా పర్యటన సందర్బంగా... సిడ్నీ... పెర్త్ స్టేడియాల్లో రెండు సెంచరీల్ని సాధించాడు. ఇప్పటికీ మాస్టర్ సాధించిన ఆ సెంచరీలు ్ర కెట్ అభిమానులందరికీ గుర్తుండి పోతాయి.
23 ఏళ్ల చిరుప్రాయంలోనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అప్పటి కెప్టెన్ మహ మ్మద్ అజహరుద్దీన్ స్థానంలో సచి న్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ బాధ్య తల్ని తన బ్యాటింగ్‌కు ఇచ్చి న అంకితభావం, అంకుఠిత దీక్షతో సచిన్ గనుక నెరవేరుస్తానని చెప్పి ఉంటే అంతకంటే కొన్నేళ్ల ముందే అతను భారత జట్టుకు కెప్టెన్ అయి ఉండేవాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో సచిన్ తొలిసారిగా కెప్టెన్‌గా వ్వవహ రించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 10, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్‌గా మాస్టర్ వెనుదిరిగినా... మ్యాచును మాత్రం భారత జట్టు కైవసం చేసుకుంది.
టెండూల్కర్‌ది మచ్చలేని వ్యక్తిత్వం. రెండు దశాబ్దాల సుధీర్ఘ కాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఉన్న సచిన్ వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడలేదు. తన వ్యక్తిత్వాన్ని హరించే ఎలాంటి చిన్న పనిని కూడా సచిన్ చేయ లేదు. తన కెరీర్‌గా ఎంచుకున్న రంగానికిగల ప్రాధాన్య త, సమాజంలో తనకుగల స్థానాన్ని గుర్తిం చి అతను మసలుకున్నాడు. సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడిన దాదాపు ప్రతి ఒక క్రికెటర్ కూడా తన ఆట ద్వారా ఏదో ఒక రకమైన పేరును సంపాదిస్తారు. ఇయాన్ బోథమ్ ఇరోల్ ఫ్లైయిన్ ఆఫ్ క్రికెట్‌గా, సర్ వివియన్ రిచర్డ్‌స మార్టిన్ లూథర్ కింగ్, షేస్ వార్న్ మార్లిన్ మాన్రోగా, ముత్త య్య మురళీధరన్ హోబిట్‌గా పేరు ను సంపాదిం చారు. అయితే టెండూల సెక్యు లర్ సేయింట్ (ఋషి)’ అనే పేరును సంపాదించాడు. అటువంటి వ్యక్తిత్వం సచిన్ సొంతం.
బౌలింగ్‌లోనూ దిట్ట...
రిజర్వ్‌డ్ పర్సనాలిటీ...
టెండూల్కర్‌ది చాలా రిజర్వ్‌డ్ వ్యక్తిత్వం. క్రొత్తవారితో కలుపుగోలుగా మాట్లాడటం గాని... తన అభిప్రాయాల్ని పంచుకోవడం గాని అతను చేయడు. తనకు తెలిసిన కొద్ది మంది మిత్రుల సమక్షంలోనే... మనసువిప్పి మాట్లాడటాన్ని అతను ఇష్టపడతాడు.
క్రికెట్ దిగ్గజాల మేలు కలయిక...
దాతృత్వ గుణం...
సచిన్‌లో ప్రత్యర్థులను చీల్చి చెండాడే అరివీర భయంకర బ్యాట్స్‌మన్‌తో పాటు... విశాల హృదయం గల మానవతామూర్తి కూడా ఉన్నాడు. ఎన్నో స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో టెండూల్కర్ పాల్గొన్నాడు. అంతేగాకుండా... తనవం తుగా ప్రతి ఏడాది 200 మంది పిల్లల చదువుల కయ్యే ఖర్చులను సచిన్ భరిస్తున్నాడు.
మాస్టర్ హాబీలు...
మాస్టర్‌నే భయపెట్టించిన బౌలర్...
ప్రపంచ క్రికెట్‌లోని దాదాపు అందరు విధ్వంసకరు బౌలర్లకు తన బ్యాటింగ్ తఢాఖా చూపెట్టిన సచిన్ టెండూల్కర్‌ను కూడా భయపెట్టిన బౌలర్ ఉన్నాడంటే నమ్ముతారా! అభిమానులు నమ్మినా... నమ్మకపోయినా.. సచిన్ మాత్రం అవుననే అంటు న్నాడు. అయితే సచిన్ తన కెరీర్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడ్డానని మాస్టర్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికన్ బౌలర్లు ఆలన్ డొనాల్డ్, షాన్ పొలాక్ బౌలింగ్ లలో కంటే.. హాన్సీ బౌలింగ్‌లోనే తాను ఎక్కు వసార్లు ఔటయ్యానని... సచిన్ పేర్కొన్నాడు. క్రానే వేసిన బంతి నేరుగా ఫీల్డరు చేతిలోకి వెళుతున్నట్లు కనబడేది అని సచిన్ ఇటీవల ఇచ్చిన ప్రఖ్యాత గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురైన క్రానే.. 2002లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మృతి చెందాడు. తానెదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లలో ఆస్ట్రేలియన్ బౌలర్ మెక్‌గ్రాత్ అత్యుత్తమ బౌలరని ఈ ఇంట ర్వ్యూ సందర్భంగా అతను ఖితాబిచ్చాడు.
బాల్యం...
తొలి అడుగులు...
11 ఏళ్ల ప్రాయం వరకు కూడా సచిన్ ప్రొఫే షనల్ క్రికెట్‌లో ఉపయోగించే బంతిని అసలు చూడలేదు. తన సొసైటీలో కేవలం టెన్నిస్ లేక రబ్బరు బంతితో క్రికెట్‌ను ఆడడం మాత్ర మే అతనికి తెలుసు. ప్రొఫెషనల్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ వద్దకు తోడ్కొని వెళ్లాడు. సచిన్‌ను తొలిసారి చూసిన ఆచ్రేకర్ అతనికి ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఉపయోగించే బంతితో ఆడిన అనుభవం ఉందా అని ప్రశ్నించాడు. అయితే సచిన్ ఇచ్చిన సమాధానం ఆచ్రేకర్‌కు ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. ఆయన ఒక్కసారి తదేకంగా సచిన్ వైపు చూశాడు. వెంటనే తాను శిక్షణ ఇచ్చే జట్టులో నాలుగవ స్థానానికి అతన్ని ఎంపికచే శాడు. అంతే అప్పుడే ప్రపం చ క్రికెట్‌లో ఒక మహాను భావుడి రాకకు నాంది పడింది. అనంతరం శారదా శ్రమ్ విద్యా మందిర్ స్కూల్ తరపున 12 ఏళ్లకే తొలి సెంచరీని సాధించి సచిన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ టోర్నీలో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన టెండూల్కర్ 207, 329, 346 పరుగులతో చెలరేగాడు. ఆచ్రేకర్ శిష్యరికంలో సచిన్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో కూడా అతను పరుగులేమి చేయకుండానే వెనుది రగడం గమనార్హం. ఆచ్రేకర్ ఎంపిక చేసిన నాలుగవ స్థానంలోనే సచిన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదే స్థానంలో ఆడాడు. సచిన్ రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ఆడిన తొలి మ్యాచు ల్లోనే సెంచరీల్ని సాధించాడు. ముంబై జట్టు ఓటమి కోరల్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి లో ఉండి కూడా సచిన్ ఈ శతకాల్ని సాధించడం విశేషం.
16 ఏళ్ల 205 రోజుల వయస్సున్నప్పుడు నవంబర్ 15, 1989 లో పాకిస్థాన్ జట్టుతో కరాచీలో జరిగిన మ్యాచ్‌తో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ వఖార్ యూనిస్ వేసిన ఒక బంతి తాకి ముక్కు నుంచి రక్తం కారింది. అయితే దాని వల్ల అతని ఏకాగ్రత, మోక్కవోని దీక్ష ఇసు మంతైనా దెబ్బతినలేదు. ఆ మరుసటి బంతినే బౌండరీకి తరలించి... తాను క్రికెట్ ప్రపం చాన్ని ఏలడానికి వచ్చానని పరోక్షంగా చాటాడు.
23 ఏళ్ల చిరుప్రాయంలోనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అప్పటి కెప్టెన్ మహ మ్మద్ అజహరుద్దీన్ స్థానంలో సచి న్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ బాధ్య తల్ని తన బ్యాటింగ్‌కు ఇచ్చి న అంకితభావం, అంకుఠిత దీక్షతో సచిన్ గనుక నెరవేరుస్తానని చెప్పి ఉంటే అంతకంటే కొన్నేళ్ల ముందే అతను భారత జట్టుకు కెప్టెన్ అయి ఉండేవాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో సచిన్ తొలిసారిగా కెప్టెన్‌గా వ్వవహ రించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 10, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్‌గా మాస్టర్ వెనుదిరిగినా... మ్యాచును మాత్రం భారత జట్టు కైవసం చేసుకుంది.
- ఎం.డి.ఇంకేషాఫ్ అహ్మద్
No comments:
Post a Comment