క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వరల్డ్ కప్ టోర్నీ రానే వచ్చింది. ఈ టోర్నీలో 14 దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో పాల్గొనబోతోంది. దాదాపు అన్ని జట్లకు కూడా ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ టోర్నీలో ఆటగాళ్ల ఎంపికలో ఆయా దేశాలు అనేక జాగ్రత్తలు తీసుకున్నారుు. అంతకుముందు జరిగిన వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడిన ఆటగాళ్లను ఎంపికచేయడానిేక ఆయా జట్లు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఆటగాళ్లలో చాలా మంది గత వరల్డ్ కప్ టోర్నీల్లో (2003, 2007) ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు, ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లుగా రికార్డులు సాధించారు. అంతటితో ఆగకుండా త్వరలో జరగనున్న వరల్డ్ కప్‌లో కూడా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆటగాళ్లెవరెవరో నేటి ప్రత్యేక సంచికలో తెలుసుకుందాం.
సచిన్ టెండుల్కర్ (బారత్)
ఆ టోర్నీలో మొత్తం 11 మ్యాచులు ఆడి 673 పరుగులను మాస్టర్ చేశాడు. ఇందులో 1 శతకంతో పాటు 6 అర్ధ శతకాలు ఉన్నాయి. సచిన్ ఉన్న ఈ జట్టు ఎలాగైన వరల్డ్ కప్‌ను గెలవాలని భారత క్రికెట్ అభిమానులు అందరూ ఆశిస్తున్నారు.
సెహ్వాగ్ భారత్
రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా
ఉపఖండంలో జరగబోతోన్న ఈ వరల్డ్‌కప్ టోర్నీని గెలిచి కెప్టెన్‌గా సరిక్రొత్త రికార్డును సృష్టించాలనే ఆశ 36 ఏళ్ల పాంటింగ్‌లో కనబడుతోంది. ఇటీవలికాలంలో జట్టుకు వరుస పరాజయాలు ఎదురౌతున్న నేపథ్యంలో తన ఈ ప్రయత్నంలో పాంటింగ్ ఏ మేరకు విజయం సాధిస్తాడో వరల్డ్ ప్ పోరు వరకు వేచి చూడాల్సిందే.
మురళీధరన్ శ్రీలంక
మురళీధరన్‌కిది నాలుగవ వరల్డ్‌కప్..
బ్రెట్‌లీ ఆస్టేలియా
జహీర్ ఖాన్ భారత్
కుమార సంగక్కర శ్రీలంక
బ్రెండన్ మెకల్లమ్ న్యూజిలాండ్
జాక్వెస్ కలిస్ సౌతాఫ్రికా
ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ టోర్నీని గెలవలేకపోయిన సౌతాఫ్రికా జట్టు ఈ టోర్నీలో ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ పైనే జట్టును ముందుకు నడిపించాల్సి న బాధ్యత పడనుంది.
స్కాట్ స్ట్రైరిస్ న్యూజిలాండ్
35 ఏళ్ల ఈ కివీస్ ఆటగాడికి ఇది వరుసగా మూడో ప్రపంచకప్ టోర్నమెంట్. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో బాగా రాణించినా... వరల్డ్ కప్ ట్రోఫీ మాత్రం న్యూజిలాండ్ జట్టుకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారైన తమ తీరని కలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ జట్టు ఉంది. ఆల్‌రౌండర్‌గా పేరుబడ్డ స్టైరిస్ గనుక రాణిస్తే.. జట్టుకు లాభిస్తుంది.
స్టీన్ టికోలో - కెన్యా
39 ఏళ్ల ఈ కెన్యా ఆటగాడు నాలుగవ సారి వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నాడు. ఈ వరల్డ్ ప్ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లలో అందరికంటే పెద్దవాడు అతడే కావడం విశేషం. కెన్యా జట్టు 1996లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో ఆరంగేట్రం చేసినప్పటినుంచి అతను జట్టులో కొనసాగుతున్నాడు. 2003 ప్రపంచకప్‌లో కెన్యా జట్టు సెమీస్‌కు చేరడంలో టికోలో కీలకపాత్ర పోషించాడు. ఈసారి కూడా జట్టును ముందుకు నడిపించే బాధ్యత అతనిపై పడనుంది.
కాలింగ్‌వుడ్ ఇంగ్లండ్
కాలింగ్‌వుడ్ వరుసగా మూడవ ప్రపంచకప్‌లో పాల్గొననున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడంలోను బౌండరీలు, సిక్సర్లను బాదడంలోను 34 సంవత్సరాల ఈ బ్యాట్స్‌మన్‌కు మంచి పట్టుంది. క్రికెట్‌కు జన్మస్థానమైన ఇంగ్లండ్ దేశం ఈసారి వరల్డ్‌కప్‌లో రాణించాలంటే కాలింగ్‌వుడ్ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.
చందర్‌పాల్ వెస్టిండీస్
No comments:
Post a Comment