Friday, October 29, 2010

దేశంలో ఆహార భద్రత అనేది సామాజికార్థిక విధానంలో అంతర్భాగం.

ఆహార అభయ'హస్తం'


 ఆహార భద్రత నేడు ప్రపంచ దేశాల లక్ష్యంగా అవతరించింది. ఆర్థిక సంక్షోభానికి తోడు, కృత్రిమ అహార కొరత, అధిక ధరలు తోడై కోట్లాది మంది ఆకలి అగాథంలోకి జారుకున్నారు. ప్రపంచంలో ఆకలితో నకనకలాడుత్ను వారి సంఖ్య 87కోట్లకు చేరుకోగా వారిలో 25 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆహార భద్రతపై చట్టాన్ని రూపొందించేందుకు యూపీఏ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. 'జాతీయ సలహా మండలి' (ఎన్ఏసీ) సోనియా గాంధీ సారధ్యంలో ఈ నెల 23న సమావేశమై రాబోయే ఆర్థిక సంవత్సరానికల్లా దేశంలోని 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సంక్షేమ కార్యక్రమం ఫలిస్తే 75 శాతం దేశ జనాభా అకలి సమస్య నుంచి బయటపడే అవకాశముంది.

అంతర్జాతీయ విధాన పరిశోధనా సంస్థ (ఇన్‌ఫ్రీ) రూపొందించిన అకలితో నకనకలాడుతున్న 84 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం 67 స్థానంలో ఉంది. మనకంటే పేద దేశాలుగా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల్లాంటి అసియా దేశాలే కాకుండా యుగాండా లాంటి ఆఫ్రికా దేశాలు కూడా ఈ విషయంలో ముందున్నాయి.

మరోవైపు ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో మన దేశ సంపన్నుల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. పేద ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న ఈ అంతరం రాబోయే సామాజిక ఉత్పాతాలకు సంకేతంగా భావించవచ్చు. అంతేకాకుండా ప్రపంచ ఆహారధాన్యాలు, చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలోనూ, పాలు, వంటనూనె, పప్పుల ఉత్పత్తిలో అగ్రస్థానంలోనూ ఉన్న భారత్‌లో ఆకలితో కునారిల్లే వారిసంఖ్య అధికంగా ఉండటం శోచనీయం.

దేశంలో పోషకాహార లోపంతో, ఆకలితో మర ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిపోతోంది. ఒకపక్క లక్ష్యానికి మించిన ఆహారోత్పత్తి సాధిస్తున్నప్పటికీ మరోపక్క దాని లభ్యత 50ల నాటి స్థితికి చే రుకుంది. ఈ పరిస్థితిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు చొరవ చూపడంలేదు. జీడీపీ వృద్ధి రేటు పెంచేందుకు పార్రిశామిక రంగానికి ఉపకరించే విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు ఆమ్ ఆద్మీని నిర్లక్ష్యం చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది.

మరోపక్క లక్షాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మానవ వినియోగానికి పనికి రాకుండా పాడై పోతుండడంతో సుప్రీంకోర్టు పేదల కు పంచాలని ఆదేశించినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇనాళ్ళు తాత్సారం చేసిం ది. 'సమ్మిళిత అర్థికాభివృద్ధి' విధానంలో భాగంగా ప్రజలందరికి పోషకాహార లభ్యతను సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా నేడు ఎంచుకుంది.

'ప్రాణాంతకమైన హింసలన్నిటిలోకి ఆకలి అత్యంత శక్తివంతమైనది.' అని ప్రజల్ని ఆకలి రక్కసికి వదిలి వేస్తున్న ప్రభుత్వ చర్యలు రాజ్యహింసలో భాగమేనని మేధావి జాన్ మెండల్ వ్యాఖ్యానించారు. 2009 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) పటిష్టం చేసి పట్టణాలకు వలస వచ్చే ప్రజల కోసం సార్వత్రిక వంట శాలలను ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం గురించి ఇంత వరకు పట్టించుకోనేలేదు.

ఇంధన ధరలను పెరగడం, నిత్యావసర ధరలు అందుబాటులో లేకపోవడంతో సర్వత్రా అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఆహార భద్రత చట్టాన్ని రూపొందించడంలో మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకపడిపోయాము.

జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేయడం లో భాగంగా దారిద్య్ర రేఖ ప్రమాణాన్ని పక్కన పెట్టింది. ఆహార భద్రతా చట్టం కింద 'ప్రాధాన్య', 'సాధారణ' అనే రెండు విశాలమైన తరగతులుగా కుటుంబాల ను విభజించింది. ప్రాధాన్య విభాగంలోని ప్రజలకు సబ్సిడీ ధరలకు, సాధారణ విభాగంలోని ప్రజలకు కనీస మద్ధతు ధరలో సగం ధరకు ఆహార ధాన్యాలను, చిరు ధాన్యాలను అందించాలని ఎన్ఏసీ సూచించింది.

90 శాతం గ్రామీణ జనా భా, 50 పట్టణ జనాభా ఈ పథకం పరిధిలోకి వస్తారు. గ్రామాల్లో 46 శాతం పట్టణాల్లో 28 శాతం ప్రాధాన్య కుటుంబాలున్నాయని, అదే విధంగా గ్రామాల్లో 44 శాతం, పట్టణాల్లో 22 శాతం సాధారణ కుటుంబాలున్నాయని ప్లానింగ్ కమిషన్ అంచనా వేసింది. ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తూ 2014 కల్లా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని ఎన్ఏసీ నిర్ణయించింది.

2014 గడువుతో రూపొందిన ఈ ఆహార భద్రత చట్టంపై ప్రతి పక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. ఎఫ్‌సీఐ గోడౌన్లలో పాడైపోతున్న బియ్యాన్ని వదిలించుకోవడానికే యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, నిత్యావసరాల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వం ఇలాంటి జనాకర్షణ పథకంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తోందని విమర్శలు వచ్చాయి.

అదే సమయంలో రాహుల్ గాంధీని ఢీల్లీ సింహాసనంపై కూర్చోబెట్టడం కోసం, పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను పునర్ధురించడం కోసం ఒక ఎన్నికల ఎత్తుగడగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, ఉపాధి హామీ పథకాలకు పట్టిన గతే దీనికి పడుతుందని కొందరు పెదవి విరుస్తున్నారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంత్యోదయ అన్న యోజన లాంటి పలు విఫల పథకాలలో ఇదొకటి కాకూడదు. ఇంతకాలంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాలన్నిటిని ఒకే గొడుగు కింద కు తీసుకొస్తే ఆహార భద్రత సాకారమవుతుందని నిపుణులు అభ్రిపాయపడుతున్నారు.

ఆహార భద్రత అనేది ఆహార ధాన్యాల పంపిణీపై కాకుండా, దేశంలో అమల య్యే సామాజికార్థిక విధానాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆహార పంట లు స్థానంలో వాణిజ్య పంటల్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో ప్రజానీకం ఆహారం కొరతను ఎదుర్కోవలసి వస్తోంది. పలు రకాల ఆహార పంటలు వేస్తున్నపుడు కొంత ధాన్యాన్ని రైతు తన అవసరాల కోసం అట్టిపెట్టుకునే వాడు.

అంటే ఉత్పత్తిలోనే ఆహార భద్రత అంశం కూడా ఇమిడి ఉంది. ఎగుమతుల ఆధారిత ఆర్థిక విధానం ఫలితంగా దేశంలో ఆహార అభద్రత నెలకొంది. ప్రభుత్వాలు శాస్ట్రీయమైన వ్యవసాయక, పారిశ్రామిక, కార్పొరేట్ విధానాన్ని రూపొందించకపోవడంతో... అన్నపూర్ణ కాస్తా ఆకలి చావుల దేశంగా మారింది. ఆహార భద్రత అనేది సామాజికార్థిక విధానంలో అంతర్భాగం.

అలాంటిది మిగిలిన సామాజికార్థిక అంశాల నుంచి ఆహార భద్రత అనే అంశాన్ని మాత్రమే విడదీసి పరిష్కరించలేము. ఇతర సంక్షేమ పథకంలాగా పీడీఎస్ ద్వారా ఆహార భద్రత సాధించాలనుకోవడం ప్రభుత్వ హ్రస్వదృష్టికి తార్కాణం. రాజకీయక లబ్ధి కోసం రూపొందించిన ఇతర సంక్షేమ పథకాల లాగా ఇది కూడా ప్రజలకు పాక్షికంగానే ఉపయోగపడుతుంది.

Sunday, October 24, 2010

‘పవర్‌’ ఫుల్‌ పారిశ్రామికవేత్తలు

Mukesh-Ambani
విద్యుత్‌...ఆర్థిక పురోభివృద్ధికి మూల మంత్రం. జాతి జవసత్వాలకు కీలక రూపం. పెరుగుతున్న జనాభాకు, అవసరా లకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి జరగకపోతే సమాజం స్థంభించిపోయే పరిస్థితి. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగిన దార్శనికులు..నాటి, నేటి తరాలకు చెందిన పారిశ్రామికవేత్తలు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచడానికి కృషి జరుపుతున్నారు. దేశ విద్యుత్‌ ఉత్పాదన సామర్ధ్యానికి అదనపు శక్తియుక్తులు జోడించడానికి పాటు పడుతున్నారు.

ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల సహకారంతో కొన్ని కంపెనీలు విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం నిధులు సేకరిస్తుండగా, మరికొన్ని పెద్ద సంస్థలు తమ అంతర్గత వనరులు, బ్యాంకు రుణాలు, ఐపివోల ద్వారా కోట్లాది మూలధనాన్ని సమకూర్చుకుంటున్నాయి. భారత్‌లో పలు పెద్ద సంస్థలు విద్యుత్‌ ఉత్పత్తి దృష్టి సారిస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌-జూలై మాసాలలో దేశం తీవ్ర విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటోంది. గణాంకాలలో చూస్తే ఇది 16,434 మెగావాట్లకు సమానం అంటున్నప్పటికి దీనికి రెండు రెట్లు అధిమని నిపుణులు భావిస్తున్నారు. రానున్న ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశీయ విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల అవసరం ఉందని సిఐఐ నివేదిక తెల్పుతోంది.

ప్రైవేట్‌ ఈక్విటీల ద్వారా ఆసియన్‌ జెన్కో, ఇండియా బుల్స్‌, టాటా పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జిఎంఆర్‌ ఎనర్జీ నిధుల సమీకరణకు ప్రయత్నిస్తుండగా రిలయన్స్‌ పవర్‌, కెఎస్‌కె ఎనర్జీ వెంచర్స్‌, అదానీ పవర్‌, ఎన్‌హెచ్‌పిసి, ఇండియాబుల్స్‌ పవర్‌, జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్‌జెవిఎన్‌ లిమిటెడ్‌ ఇప్పటికే ఐపిల ద్వారా నిధులు సమీకరించడంలో విజయం సాధించాయి. వీటితో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టిపిసి, టాటా గ్రూప్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ఎలాగూ రంగంలో ఉండగా.. మోసర్‌ బేర్‌, గౌతమ్‌ థాపర్‌కు చెందిన అవంత గ్రూప్‌, యాక్షన్‌ షూస్‌, మన హైదరాబాద్‌కు చెందిన పయోనీర్‌ డిస్టలరీస్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రవేశించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగాన్ని ధగధగలాడించడానికి నడుం కట్టిన పారిశ్రామికవేత్తలు, సంస్థలపై ‘సూర్య’ బిజినెస్‌ బ్యూరో అందిస్తున్న ప్రత్యేక కధనమిది.

రంగంలో రిలయన్స్‌ దిగ్గజాలు
1966లో వస్త్రాల తయారీని చేపట్టి ఆ తరువాత పాలిస్టర్‌, ఫైబర్‌ ఇంటర్మీడియట్స్‌, ప్లాస్టిక్‌, పెట్రో కెమికల్స్‌, పెట్రోలియం శుద్ధి, చివరిగా గ్యాస్‌, చమురు అన్వేషణ ఉత్పత్తి వంటి బహు కీలక రంగాలలో ప్రవేశించి జయకేతనం ఎత్తిన రిలయన్స్‌, అడాగ్‌ గ్రూప్‌ సారధ్యంలో పవర్‌ ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. రిలయన్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు ధీరూభాయి అంబానీ మరణించిన తరువాత ఆయన కుమారులు ముకేష్‌, అనిల్‌ అంబానీలు గ్రూప్‌ పగ్గాలు చేపట్టారు. 2005లో కుటుంబ వివాదల ఫలితంగా విడిపోయిన అన్నదమ్ములు తిరిగి ఈ ఏడాది మేలో కలుసుకున్నారు.

anil_ambani
ఇప్పుడు రిల్‌, అడాగ్‌ గ్రూప్‌లు కలసి ఒకరి వ్యాపారాలలో మరొకరు ప్రవేశించేందుకు మార్గం సుగమం చేసుకుని విద్యుత్‌ ప్రాజెక్టులపై ప్రముఖంగా దృష్టి పెట్టారు. బొగ్గు, జల, పవన, అణు విద్యుత్‌ ప్రాజెక్టులతో సహా వేటిని వదలబోమని, అన్ని విభాగాలలో భారీగా పెట్టుబడులు పెడతామని తమ 36వ వాటాదారుల సర్వసభ్య వార్షిక సమావేశంలో రిలయన్స్‌ పరిశ్రమల అధినేత ముకేష్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే గ్యాస్‌, ఆయిల్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన రిల్‌కు విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పడం పెద్ద ష్టమేమికాదు. చత్తీస్‌ఘడ్‌లో అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిలవాల్సిన బిడ్లను గత మే నుండి ఇప్పటికి మూడు సార్లు వాయిదావేశారు. అందుకు కారణం రిలయన్స్‌ పరిశ్రమల ప్రవేశం కోసమేనన్నది బహిరంగ రహస్యమే. ముకేష్‌ ఆర్థికశక్తికి, ఆలోచనలకు ప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టిపిసి వ్యవస్థాపక ఛైర్మన్‌ డి.వి.కపూర్‌ తోడు కావడంతో రానున్న కాలంలో రిల్‌ విద్యుత్‌ వెలుగులు విచ్చలవిడిగా ప్రసరించడం ఖాయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రిల్‌ బోర్డులో కపూర్‌ ఇప్పుడు స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు.

అనిల్‌ పవర్‌ మెరుపులు
రిలయన్స్‌ సామ్రాజ్యం విభజన తరువాత విద్యుత్‌ ప్రాజక్టులు చేపట్టిన అనిల్‌ ప్రస్తుతం 1,023 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుపుతున్నారు. అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఐపివో ద్వారా రూ.11,563 కోట్ల సేకరించి దేశంలో సంచలనం సృష్టించిన అనిల్‌ తన ప్రతిపాదిత భవిష్యత్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 28,000 మెగావాట్ల నుండి 35,000లకు పెంచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని రోసాలో 300 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పలు ప్రాజెక్టుల ద్వారా అనుకున్నదాని కంటే ముందే 1200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

ససాన్‌లో నెలకొల్పనున్న అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టులను కూడా గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని, 10 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు ఫైనాన్స్‌ క్లోజర్‌ పూర్తి చేశామని, దేశంలో ప్రైవేట్‌ రంగంలో ఏర్పాటువుతున్న పెద్ద పవర్‌ ప్రాజెక్టు తమదేనని రిలయన్స్‌ పవర్‌ సిఇవో జెపి చలసాని అంటున్నారు. 2020 నాటికి 35,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించి ప్రైవేట్‌ రంగ దిగ్గజంగా వెలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం గుల్బార్గాలో నిర్మించనున్న 1,320 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులకు పిలిచిన బిడ్లకు అంబానీ సోదరులు కూడా పోటీ పడుతున్నారు.
రిలయన్స్‌ పవర్‌ వివరాలు
సిఇవో : జెపి చలసాని
ప్రస్తుత సామర్ధ్యం : 1,023 మెగావాట్లు
ప్రతిపాదిత సామర్ధ్యం : 2020 నాటికి 35,000 మెగావాట్లు
పెట్టుబడుల అంచనా : 1.36 ట్రిలియన్‌ డాలర్లు


table-past

table-project

Thursday, October 21, 2010

పారిశ్రామిక హబ్‌ గుజరాత్‌

gujarath-ind-hubఅహ్మదాబాద్‌: పారిశ్రామికాభివృద్ధిలో ఎప్పుడూ ముందు వరసలో ఉండే గుజరాత్‌ రాబోయే 5-6 ఏళ్లలో కొత్తగా12 పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు చేయబోతోంది. వీటిలో ప్రైవేట్‌ రంగానికి చెందిన కంపెనీలు ప్రధాన భూమిక పోషిస్తాయి. మొత్తం 12 ప్రాజెక్టులకు గాను ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులను గుర్తించింది. 2015- 16 నాటికి ఇవి కార్యరూపం దాలు స్తాయని గుజరాత్‌ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ (జీఐడీసీ) సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (సర్‌)కు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చింది.

మొట్ట మొదటిసారి ఏర్పాటు చేసే ఈ హబ్‌లో పెట్రో కెమికల్‌ - పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌)ను బరూచ్‌లో గత సంవత్సరం 4.53 లక్షల చదరపు హెక్టార్లలో నిర్మించారు. రాష ్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్‌ అనే పారిశ్రామిక హబ్‌లో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. వాటిలో ఆటో విడి పరికరా లు, రసాయ నాలు, హెల్త్‌కేర్‌, ఎలక్ట్రానిక్స్‌కు చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి రూ.70,000 కోట్లకు పైగా పెట్టుబడులు అవసరమవుతా యి. దీనికి గాను ఒఎన్‌జీసీ పెట్రో అడిషన్స్‌ లిమిటెడ్‌ పీసీపీఐఆర్‌లో రూ.19,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతుంది.

ప్రైవేట్‌ రంగానికి చెందిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారిని ఆహ్వానిస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న డజను స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (సర్‌)లో 10 జీడీఐసీ, పీఎస్‌యూలు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తాయి. మిగిలిన రెండు గుజరాత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (జీఐడీబి) గుజరాత్‌ మెరిటైం బోర్డు నిర్మిస్తాయి. 50,000 వేల హెక్టార్లలో నిర్మిస్తున్న స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌లో (సర్‌)లో పారిశ్రామికవేత్తలు స్థానిక యజమానులతో సంప్రదించి ఇక్కడ స్థలాలను కొనుగోలు చేసుకోవచ్చు. సెజ్‌ల మాదిరిగా పన్నుల్లో రాయితీలు మాత్రం ఉండవు. అయితే ఇక్కడ కొనుగోలు చేసిన స్థలాలు నాణ్యమైన మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తారు. అనుకున్న సమయం కంటే ముందే ఇక్కడ యూనిట్‌లను ప్రారంభించవచ్చు. స్పెషల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ రీజియన్‌లో (సర్‌)లో 55 శాతం గృహ సముదా యాలు టౌన్‌షిప్‌లు కాగా, మిగిలినవి పారిశ్రామిక యూనిట్‌లు ఉంటాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

సంతాల్‌ పూర్‌లో ఏర్పాటు చేసే సర్‌లో 1.86 లక్షల హెక్టార్లలో (ప్రధానంగా ఆగ్రో, సోలార్‌ ఎనర్జీపై) దృష్టి పెడతారు. హలోల్‌ సావ్లీ సర్‌లో ఏర్పాటు చేసే 1.22 లక్షల ెహక్టార్లలో ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ విడపరికరాలు పరిశ్రమలకు కేటాయించారు.విరామ్‌గామ్‌సానాంద్‌ సర్‌ 1.38 లక్షల హెక్టార్లు (ఇక్కడ ఆటో, ఇంజనీరింగ్‌, హెల్త్‌కేర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. అతి చిన్న సర్‌ దోలెరా కూడా 50,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద సెజ్‌ చైనాలోని షెన్‌జన్‌లో ఇది 32,700 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాని కంటే కూడా ఇది చాలా పెద్దదని ఆ అధికారి తెలియజేశారు.

Jai Ho .............