Sunday, May 6, 2012

అబ్దుల్ కలామ్ - స్వప్నరథ సారథి

‘‘కలలు కనండి. నిజం చేసుకోండి’’.
మంచిది. కన్నంత మాత్రాన నిజమైపోతాయా?!
లేదు. కష్టపడాలి.
కష్టమొక్కటేనా?
లేదు. కమిట్‌మెంట్ ఉండాలి.
ఇంకా?!
ప్లానింగ్, ప్రిపరేషన్, పర్సెవరెన్స్...
దేవుడా! ఇవన్నీనా?!
అవును. ఇవన్నీ మరియు మరికొన్ని.
ఈ మాత్రానికి కలలెందుకు? కనడమెందుకు?
అంటే?
నేరుగా ఒళ్లు హూనం చేసుకుంటే పోలా?!
కలంటే నిద్రలో వచ్చేది కాదు.

మరి?
నిద్రపట్టకుండా చేసి, లక్ష్యానికి చేర్చేది.
ఎవరన్నారీ మాట?
అవుళ్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలామ్!
ఇప్పుడెందుకొచ్చారాయన!!
యువభారత్ తాజాగా ఒక కలకంటోంది.
ఏమిటది?
కలామ్ రెండోసారి రాష్ట్రపతి అవ్వాలని!
కల నిజమౌతుందా?
బయోగ్రఫీ చదవండి.



‘‘మీకు ఆసక్తి లేకపోవచ్చు. కానీ కలామ్‌జీ... రాష్ట్రపతిగా మీరు మళ్లీ రావడం కోసం మేమంతా ఆశగా ఎదురు చూస్తున్నాం. మీలాంటి నాయకుడు మాక్కావాలి’’.

‘‘10 జన్‌పథ్‌కు కలామ్ ఒక ఆప్షన్ కాకపోవడంలో వింతేముంది?! కానీ ఈ దేశంలోని యువతీయువకులు ఆయన్ని రెండోసారి రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నారు’’.


‘‘దురదృష్టం చూడండి. మతతత్వ పార్టీగా పేరుపడిన బి.జె.పి... ముస్లిం అయిన కలామ్‌ను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తోంటే, సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వెనకాముందూ ఆలోచిస్తోంది’’.


‘‘గ్రేట్ మేన్. స్టూడెంట్స్ రోల్ మోడల్. కలామ్ వంటి వ్యక్తి ఇంకొకసారి రాష్ట్రపతి అవడానికి ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి?’’.


5,500 నుంచి 6,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర ఉపరితల క్షిపణి ‘అగ్ని 5’ ను ఏప్రిల్ 19న ఒడిశాలోని వీలర్ ఐలండ్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించి చూశాక... ఇంటర్నెట్‌లోని సోషల్ నెట్‌వ ర్కింగ్ సైట్‌లలో అగ్ని టీమ్‌కు అభినందనలు తెలుపుతూ, మన మిస్సయిల్ మేన్... డాక్టర్ కలామ్‌ను మళ్లీ ఒకసారి భారత రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నట్లు యంగ్ ట్వీటరేట్స్ (ట్వీట్ చేసేవాళ్లు), ఎఫ్‌బియన్స్ (ఫేస్‌బుక్ యూజర్లు) పోస్ట్ చేసిన ఆకాంక్షలివన్నీ!

*******

ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జూలై 24తో ముగియబోతోంది. జూలై 25న దేశం కొత్త రాష్ట్రపతితో కళకళలాడాలి. అయితే యంగ్ ఇండియా పూర్తిగా కొత్త ముఖాన్ని కోరుకోవడం లేదు. ‘పూర్వ’ వైభవం కోసం కుతూహలపడుతోంది.

‘అగ్ని -5’ పరీక్షకు, అబ్దుల్ కలామ్ అభ్యర్థిత్వానికి సంబంధం లేకపోయినా, రాష్ట్రపతి ఎన్నికకు మూడు నెలల ముందు జరిగిన అగ్ని పరీక్ష సక్సెస్ కావడంతో యువతరం రెండిటినీ కలిపి చూస్తోంది. ఆ మాటకొస్తే ‘అగ్ని’... మన దగ్గర మాత్రమే ఉన్న క్షిపణి కాదు. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల దగ్గర ఉంది.
కానీ కలామ్ మన సొంతం. మనకు మాత్రమే ప్రత్యేకం. ఆ విధంగా అగ్రరాజ్యాలకన్నా మనం అధికులం!
మన ‘ఆధిక్యరాజ్యానికి’ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి.
కనీసం పద్నాలుగు మంది ప్రముఖులు ప్రస్తుతం రాష్ట్రపతి రేస్‌లో ఉన్నారు. లేనిదల్లా కలామ్. అయితే రేస్‌లో ఆయన ఉండాలని ఆశిస్తున్న దేశ ప్రజలు కోట్లలో ఉన్నారు.
ఏమిటి కలామ్ ప్రత్యేకత?!
కలామే ఒక ప్రత్యేకత.
ఇందుకు నిదర్శనం... రాష్ట్రపతి అభ్యర్థిగా మిగతావారితో పోల్చి చూసినప్పుడు - మునుపు రాష్ట్రపతిగా చేసి ఉన్నప్పటికీ - కలామ్‌కే ఎక్కువ సానుకూలతలు కనిపించడం.
మళ్లీ ఇంకో ‘ప్రతిభా పాటిల్’ని రాష్ట్రపతిగా ముందుకు తెచ్చే మూడ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ లేదు. 2007లో పశ్చిమ బెంగాల్, కేరళలలో అధికారంలో ఉన్న వామపక్షాల మద్దతుతో ఆ పార్టీ పాటిల్‌ను నామినేట్ చేసింది. ‘తొలి మహిళా రాష్ట్రపతి’ అనే ప్రతిష్ట కోసం యు.పి.ఎ. ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పట్టుపట్టడంతో పాటిల్ రాష్ట్రపతి అయ్యారు.

ఇక రెండో చాయిస్ ప్రస్తుత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ. పాటిల్ రాష్ట్రపతి అయిన ఏడాదే (ఆగస్టులో) ఈయనా ఉప రాష్ట్రపతి అయ్యారు. మనిషి మర్యాదస్థుడు. మాటకారి. పెద్ద పెద్ద దౌత్యహోదాలలో ఉండి వచ్చినవారు. వివాదాలకు దూరంగా ఉంటారు. సర్వామోద యోగ్యత కల ముస్లిం. వామ పక్షాలు, ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈయన వైపు ఉంటుందా అన్నది సందేహమే. ఎందుకంటే హమీద్ నూటికి నూరు పాళ్లు కాంగ్రెస్‌వాది కారు. అలాగే కాషాయ శిబిరం ఈయనకు మద్దతు ఇస్తుందన్న గ్యారంటీ లేదు.


మూడో వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. కష్టాల్లో యు.పి.ఎ.ను గట్టెక్కిస్తున్న పెద్ద దిక్కు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి. రాజనీతిజ్ఞుడు, పాలనా దక్షుడు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రధాన అనుసంధానకర్త. అన్ని రాజకీయ పార్టీలలో స్నేహితులను, సన్నిహితులను కలిగివున్నవారు. ప్రణబ్ రాష్ట్రపతి అవుతున్నారంటే ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు. అయితే ఇవన్నీ కూడా ఆయనకు ప్రతికూల అంశాలే అయ్యే ప్రమాదం ఉంది! ఈ అపర చాణక్యుడిని రాష్ట్రపతి భవన్‌కు పంపి కాంగ్రెస్ తన చేతిని తెగనరుక్కుంటుందా అన్నది ప్రశ్న. పెపైచ్చు ప్రణబ్‌కు గానీ హమీద్‌కు గానీ తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బి.జె.పి ప్రకటించింది.

ఇంకొకరు ఎం.కె. ఆంటోనీ. ప్రస్తుత రక్షణశాఖ మంత్రి. రాజ్యసభ సభ్యుడు. ముప్పై ఆరేళ్ల వయసుకే ముఖ్యమంత్రి అయిన ఆంటోనీ కాంగ్రెస్‌లో ఇప్పుడు సీనియర్ లీడర్. ప్రజల్లో పేరు ప్రతిష్టలున్నాయి. కేరళలో ఆయన్ని ‘సెయింట్ ఆంటోనీ’ అనేవాళ్లూ ఉన్నారు. సచ్ఛీలుడు. అయితే రాష్ట్రపతి అయేందుకు ఈయనకున్న అడ్డంకి... జాతీయ స్థాయిలో ఓటు బ్యాంకు లేని క్రిస్టియన్ అవడం. కాషాయ శిబిరం కూడా ఆంటోనీని సమర్థించే అవకాశాల్లేవు.


రాష్ట్రపతి పదవికి వినిపిస్తున్న మరొక పేరు గోపాల్ కె. గాంధీ. మహాత్మాగాంధీ ఆఖరి మనవడీయన. పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పని చేశారు. పాలనాపర ంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న హోదాలలో సేవలు అందించారు. వివిధ దేశాలకు భారతీయ రాయబారిగా, దౌత్యాధికారిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మనిషి కారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ఇస్తున్నప్పటికీ, వామపక్షాలు మాత్రం ఈయన విషయంలో ప్రస్తుతానికైతే మౌనంగా ఉండిపోయాయి.


ఇక కరణ్ సింగ్! ఎప్పుడు రాష్ర్టపతి ఎన్నికల ప్రస్తావన వచ్చినా ఎప్పుడూ వినిపించే పేరు. కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్. రాజ్యసభ ఎం.పి., జమ్మూ-కాశ్మీర్ రాచకుటుంబీకుడు. హైందవ పండితుడు. రచయిత. దౌత్యవేత్త. ఎ.ఐ.సి.సి. విదేశీ వ్యవహారాల విభాగం ఛైర్మన్‌గా చేశారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ అధ్యక్షుడిగా, యునెస్కోలో భారత రాయబారిగా ఉన్నారు. అయితే ఎంచేతో కరణ్ సింగ్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.


వీళ్లతో పాటు ఇంకా... నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ప్రధాని మన్మోహన్‌సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నా హజారే, టాటా గ్రూపు కంపెనీల ఛైర్మన్ రతన్ టాటా, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మొహిసినా కిద్వాయ్, జనతాదళ్ (యునెటైడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్, టెక్నో మేధావి శ్యామ్ పిట్రోడా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరిని ఎవరు ప్రతిపాదించినా, ఎవరిని ఎవరు సమర్థించినా ఉమ్మడి సానుకూలతను (ఒక్క కాంగ్రెస్ నుంచి తప్ప) దాదాపుగా కలిగి ఉన్న వ్యక్తి ఇప్పటి వరకైతే అబ్దుల్ కలామ్ ఒక్కరే!

*******

సరిగ్గా పదేళ్ల క్రితం 2002లో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు దేశ రాజకీయాలలో పూర్తిగా ఆయనొక కొత్త మనిషి. అప్పటివరకు ఒక క్షిపణి శాస్త్రవేత్తగా మాత్రమే ప్రఖ్యాతుడై ఉన్న కలామ్... ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. తర్వాతి ఐదేళ్లూ యువతరం ఆ డెబ్బై ఏళ్ల మనిషిని అనుసరించింది, ఆయన్ని అనుకరించింది. చివరికి ఆయన హెయిర్ స్టెయిల్‌ని కూడా కుర్రాళ్లు వదల్లేదు!

గుజరాత్ అల్లర్లలో గాయపడిన రెండు వర్గాల మధ్య పూర్వపు సయోధ్య, సుహృద్భావం ఏర్పడేందుకు కలామ్ ఎంపిక తోడ్పడవచ్చని ప్రధాని వాజపేయి నాయకత్వంలోని అప్పటి ఎన్.డి.ఎ. ప్రభుత్వం భావించడంతో కలామ్ రూపంలో మన దేశానికొక దార్శనికుడు లభించారు.


రాష్ట్రపతి అవకముందు కలామ్ ఎలా ఉన్నారో, అయ్యాకా అలానే ఉన్నారు! భుజాల మీదకి దిగిన జులపాలను కురచగా కత్తిరించుకోబోతున్నానని కానీ, తన దుస్తుల విషయమై పునరాలోచన జరుపుతానని గానీ ఆయన ఎలాంటి హామీలూ ఇవ్వలేదు. కాళ్లకు క్రితం రోజు వేసుకున్న స్లిప్పర్స్‌నే రాష్ట్రపతి భవన్‌లోనూ వేసుకుని తిరిగారు. అయితే తానొక కొత్త భారత్‌ను దర్శించేందుకు శ్రద్ధ వహించబోతున్నానని మాత్రం ఆయన స్పష్టంగా తెలియజెప్పారు.


‘‘మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలి. అంటే దానర్థం పేదరికమే లేని దేశం అని. సంపన్న దేశం అని. ఆరోగ్యవంతమైన దేశం అని. పిల్లలంతా సంతోషంగా జీవిస్తున్న దేశం అని’’ - అన్నారు కలామ్, బాధ్యతలు స్వీకరించిన రోజు.


రాజకీయ సాంగత్యమే లేని ఈ పెద్దమనిషి దగ్గర దేశాన్ని అభివృద్ధి పథంలోకి పంపే రాకెట్లు ఏముంటాయన్న ప్రశ్న ఆనాడు రాజకీయ పండితులను ఆలోచనలో పడేసింది. అయితే ఇరవై ఏళ్లపాటు రాకెట్ ఇంజినీరుగా, మిస్సయిల్ టెక్నాలజిస్టుగా ఆరుగురు ప్రధాన మంత్రులను చూసిన కలామ్... యువకుల కలలకు ఇంధనంగా మారి, వారిలో నిప్పును రాజేశారు. కలామ్ దేన్నయితే అభివృద్ధి అన్నారో దాన్ని సాధించేందుకు యువభారత్ ముందుకు నడిచింది. ప్రస్తుతం దేశం కోసం నిస్వార్థంగా సేవచేస్తున్న ఎందరో యువతీయువకులలో ఆయన ప్రవచన రక్తం ప్రవహిస్తోంది.


కలామ్‌కి ముందు కె.ఆర్.నారాయణన్, శంకర్ దయాళ్ శర్మ, ఆర్. వెంకటరామన్, జ్ఞానీజైల్‌సింగ్, నీలం సంజీవరెడ్డి, వి.వి.గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మాద్, జకీర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పూర్తికాల రాష్ట్రపతులుగా పని చేశారు. వీరందరిలోనూ కలామ్ భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తారు. కలామ్ శాకాహారి. అవివాహితులు. రాష్ట్రపతి అయిన తొలి శాస్త్రవేత్త, పదవిలో ఉండగా ‘భారతరత్న’ పొందిన తొలి రాష్ట్రపతి కూడా. అన్నిటికన్నా విలక్షణమైనది ఆయన వ్యక్తిత్వం. కలామ్ ఏనాడూ తనని తను ప్రత్యేకించి ఒక ముస్లింగా వ్యక్తీకరించుకోలేదు. రెండు మతాలలోని మూల గ్రంథాలను చక్కగా చదివి అర్థం చేసుకున్నారు. ఆచరించారు. అంతరార్థాలను గ్రహించి వాటి సారాన్ని ప్రబోధించారు.


కలామ్ తన ఆలోచనలను, ఆదర్శాలను, తను కలగంటున్న భారతదేశ స్వరూపాన్ని మూడు పుస్తకాలలో పొందుపరిచారు.

ఇండియా 2020 : ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం
వింగ్స్ ఆఫ్ ఫైర్ : ఏన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
ఇగ్నైటెడ్ మైండ్స్ : అన్‌లీషింగ్

ఈ మూడూ కలిసిందే కలామ్ జీవిత చరిత్ర.
యువ కలామ్‌ల భవిష్యత్ జీవన యాత్ర.
*******

కలామ్ బాల్యం ‘సురక్షితమైనది’! ఈ మాట వింతగా ఉండొచ్చు. ఈనాటి బాల్యాలతో పోల్చి చూస్తే సురక్షితం అనేది ఎంత పెద్ద భాగ్యమో అర్థమౌతుంది. అందుకే కలామ్ ఎప్పుడూ ‘సెక్యూర్డ్ చైల్డ్‌హుడ్’ గురించి మాట్లాడుతుంటారు. అన్ని విధాలా సెక్యూర్డ్‌గా ఉన్నప్పుడే బాల్యం చక్కగా వికసిస్తుందని నమ్మిన వ్యక్తి ఆయన. కలాం బాల్యం కూడా అలా పదిలంగా వికసించిన కుసుమమే. ఈ సంగతి ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’లో తెలుస్తుంది.


‘‘నేనొక మధ్యతరగతి తమిళ కుటుంబంలో పుట్టాను. నాన్నగారు జైనులాబ్దిన్. ఆయన పెద్దగా చదువుకోలేదు. పెద్దగా కలిగిన వారు కూడా కాదు. కానీ సహజసిద్ధమైన ఆయన ఔదార్యానికీ, వివేక గుణానికి ఈ ప్రతికూలతలు అడ్డంకి కాలేకపోయాయి. ఇక ఆయనకు తగిన జీవన సహచరి మా అమ్మగారు. రోజుకు ఎంతమందికి ఆవిడ ఆత్మీయంగా భోజనం వడ్డించేవారో నాకైతే గుర్తు లేదు కానీ ఇంట్లో వాళ్లకన్నా బయటి వాళ్లకే ఎక్కువ విస్తళ్లు పరుచుకునేవని జ్ఞాపకం. మేమున్నది మా పూర్వీకులు కట్టించిన పాత ఇంట్లో. పందొమ్మిదవ శతాబ్దపు నడి దశాబ్దాల నాటిది. రామేశ్వరంలోని మసీదు వీధిలో ఇంత పొడవున సున్నపురాళ్లు, ఇటుకలతో కనిపించే పక్కా ఇల్లేదైనా ఉంటే అది మాదే. నాన్న చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. అనవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు అమర్చేవారు కారు. అత్యవసరమైన వాటిని నిర్లక్ష్యం చేసేవారు కారు. తిండి, మందులు, బట్టలు ఆయన ప్రాధాన్యాంశాలు. అలా నా జీవితం అన్ని విధాలా ఆయన చేతుల మధ్య సురక్షితంగా గడిచింది’’
అని రాసుకున్నారు కలామ్. నిజాయతీ, స్వీయ నియంత్రణ... తల్లిదండ్రుల నుంచి కలామ్‌కు సంక్రమించిన గుణాలు. దయ, దైవభక్తి కూడా వాళ్ల నుంచి అబ్బినవే.

రామేశ్వరంలో ప్రాథమిక విద్య అయ్యాక కలామ్ రామనాథపురంలోని షువర్ట్స్ హైస్కూల్‌లో చదివారు. ఆ తర్వాత పై చదువులకు తిరుచిరాపల్లి వెళ్లారు. షువర్ట్స్ స్కూల్ చదువు పూర్తయ్యేనాటికే కలామ్ పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం గల బాలుడిగా, ఎందులోనైనా విజయం సాధించి తీరాలనే దృఢచిత్తుడిగా తయారయ్యాడు.


తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బి.యస్సీ చదివాక కలామ్ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో చేరారు. తర్వాత బెంగుళూరు లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రెయినీగా చేరారు. ఏరోనాటికల్ ఇంజినీర్‌గా అప్పటికి కలామ్‌కు ఉన్న ఆప్షన్ రెండే రెండు. డెరైక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్స్ - డి.టి.డి. అండ్ పి (రక్షణ మంత్రిత్వశాఖ) లో చేరడం, లేదంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోవడం. కలామ్‌కు ఎయిర్ ఫోర్స్ అంటే ఇష్టం. కానీ అందులో చేరలేకపోయారు. దాంతో డి.టి.డి అండ్ పి (ఎయిర్) ఆధ్వర్యంలోని టెక్నికల్ సెంటర్ (పౌర విమానయానం)లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా చేరారు. జీతం రూ.250. అలా ఎయిర్‌ఫోర్స్ డెరైక్టరేట్‌లో చేస్తున్నప్పుడే ఆయన కల ఫలించి ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్‌లో (ఇస్రోకు ముందరి స్వరూపం)లో జాబ్ వచ్చింది. అలా కలామ్ రాకెట్, మిస్సయిల్ టెక్నాలజీ కెరీర్ మొదలైంది.


భారత రాష్ట్రపతి అయ్యే నాటికి కెరీర్‌లో కలామ్ నాలుగు దశలు దాటి వచ్చారు. మొదటి దశ (1963-82). ఆయన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో వివిధ హోదాలలో పని చేసిన దశ. అక్కడ ఫైబర్ రీ ఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్, ఏరోడైనమిక్స్, డిజైన్ గ్రూపులో అనుభవం గడించాక తంబాలోని ఉపగ్రహ ప్రయోగ వాహక బృందంలో చేరారు. అక్కడే ఎస్.ఎల్.వి-3 మిషన్ ప్రాజెక్ట్ డెరైక్టర్ అయ్యారు. శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని, ఏరోడైనమిక్స్‌ని అభివృద్ధి పరచడంలో కీలకపాత్ర పోషించారు. ‘రోహిణి’ అనే శాస్త్రపరిజ్ఞాన సంబంధ ఉపగ్రహాన్ని కలామ్ నేతృత్వంలోని ఎస్.ఎల్.వి-3 ప్రాజెక్టు 1980 జూలైలో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మన రాకెట్ వ్యవస్థ బలం పుంజుకున్నది కూడా కలామ్ హయాంలోనే. తన కెరీర్‌లోని తొలి దశ గురించి వ్యాఖ్యానిస్తూ - ఈ దశలో నేను ముగ్గురు మహా గురువుల నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నాను. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఫ్రొఫెసర్ సతీశ్ థావన్, డాక్టర్ బ్రహ్మ ప్రకాశ్. ఇది నా జ్ఞాన సముపార్జన దశ’’ అన్నారు కలామ్.


కలామ్ రెండో దశ 1982లో డి.ఆర్.డి.ఓ. (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో మొదలై ంది. డి.ఆర్.డి.ఓ. డెరైక్టర్‌గా ఆయన ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సయిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు సారథ్యం వహించారు. నాగ్ (యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సయిల్), పృథ్వి (బ్యాటిల్ ఫీల్డ్ మిస్సయిల్), ఆకాశ్ (ఎయిర్ మిస్సయిల్) త్రిశూల్ (క్విక్ రియాక్షన్ ఎయిర్ మిస్సయిల్) అగ్ని (మధ్యశ్రేణి మిస్సయిల్) వంటివన్నీ కలామ్ ఆధ్వర్యంలో తయారైనవే. మిస్సయిల్ టెక్నాలజీని అభివృద్ధి పరచడం కోసం ఆయన మూడు ప్రయోగశాలల్ని నెలకొల్పారు. ‘‘ఈ దశలో ఎన్నో వైఫల్యాలు, కొన్ని విజయాలు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ధైర్యంగా ముందుకు సాగాను. ఇది నేను వైఫల్యాలను తట్టుకోవడం నేర్చుకున్న దశ’’ అంటారు డాక్టర్ కలామ్.


భారతీయ రక్షణ సామర్థ్యాలు మెరుగవడంలోనూ డాక్టర్ కలామ్ కృషి ఉంది. ప్రధానంగా తన మూడో దశలో ఆయన మన దేశాన్ని అణ్వాయుధ శక్తిగా మలిచేందుకు ఆరాటపడ్డారు. రక్షణ దళాల సహకారంతో డి.ఆర్.డి.ఓ., డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుకు కీలకమైన సేవలు అందించారు. టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్ అసెస్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా టెక్నాలజీ విజన్ 2020, ఇండియా మిలీనియం మిషన్స్ (ఐ.ఎం.ఎం.2020) రూపొందించారు. భారత ప్రభుత్వానికి శాస్త్రసాంకేతిక ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవీ బాధ్యతలు ముగియడంతోనే కలామ్ నాలుగో దశ మొదలైంది.


చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో టెక్నాలజీ అండ్ సొసైటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రొఫెసర్‌గా చేరారు డాక్టర్ కలామ్. టెక్నాలజీ లక్ష్యాల సాధనలో తన కలలను సాకారం చేసుకునేందుకు యువకుల మేధస్సుకు చురుకుపుట్టించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు 2003 ఆగస్టుని ఒక గడువుగా పెట్టుకున్నారు. ఆ లోపు దేశంలోని వివిధ ప్రాంతాలలో కనీసం లక్షమంది విద్యార్థులనైనా కలవాలనుకున్నారు. అప్పటికే ఆయన నలభై వేల మంది విద్యార్థులను కలిసి స్ఫూర్తినిచ్చారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా కలామ్ కెరీర్ మలుపు తిరిగింది. బహుశా తను కూడా ఊహించని విధంగా ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత భారతరత్న కూడా అయ్యారు!

*******

రాజకీయాల్లో వినేవాళ్లు ఉండరు. అంతా చెప్పేవాళ్లే. ఎవరి దారి వారిది. ఎవరి ‘స్కూల్’ వారిది. ఎవరి సిలబస్ వారిది. కలామ్ వంటి ‘ప్రొఫెసర్ క్రాంతదర్శి’ మాట అసలే పట్టించుకోరు. ఆయన వల్ల తమకేదైనా పని జరుగుతుందా అని ఆలోచిస్తారు. అంత వరకే. కలామ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులకొక విషమ పరీక్ష ఎదురైంది. ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ బిల్లును ఆయన అనుమతి కోసం పంపారు. పంపించేటప్పుడే ఆయనపై డౌట్‌తో పంపారు. ఈ పెద్ద మనిషి ఓకే అంటాడా? అని. డౌట్ ఎందుకంటే ఆయన ‘పీపుల్స్ ప్రెసిడెంట్’. వాళ్లు పంపింది పొలిటీషియన్స్ బిల్లు. పార్లమెంటు సభ్యులు ఏకకాలంలో రెండు పదవులను కలిగి ఉండడాన్ని నిరోధిస్తున్న రాజ్యాంగ నిబంధనను సడలించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లు అది. చివరికి వారు భయపడినంతా అయింది. కలామ్ దాన్ని తిప్పి పంపారు!


దేశాన్ని ముందుకు నడిపించాలంటే ఒత్తిళ్లకు లొంగనవసరం లేని స్వతంత్ర అధికారం ఉండాలి. సాధారణంగా రాష్ట్రపతులందరికీ అలాంటి అధికారం ఉంటుంది. కలామ్‌కి ఇలాంటి అధికారంతో పాటు అదనంగా సంకల్ప బలం కూడా ఉంది. బహుశా అదే ఆయన్ని 2007లో ఇంకోసారి రాష్ట్రపతిని కానీయకుండా అడ్డుకుని ఉండాలి. అలా కాలేకపోవడాన్ని ఆయనైతే పెద్దగా పట్టించుకోలేదు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న కలామ్ అభిమానులు అప్పట్లో తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. వాళ్లకు ఆయన లీడర్ షిప్ నచ్చింది. లీడర్‌షిప్‌కి కలామ్ ఇచ్చిన డెఫినిషన్ నచ్చింది. నడిపించడానికి కాలూ చెయ్యీ కదిలే స్వేచ్ఛ ఉండాలి. కాలూ చెయ్యీ కదల్చనవసరం లేకపోవడమే స్వేచ్ఛ అనుకునేవాళ్లు ఎప్పటికీ నాయకులు కాలేరు. కలామ్ ఇచ్చిన నిర్వచనానికి స్థూలంగా అర్థం ఇదే.

*******

రాజకీయాలకు అతీతమైన ప్రజా నాయకుడు డాక్టర్ అబ్దుల్ కలామ్. కలామ్ రెండోసారి భారత రాష్ట్రపతి అయినా, కాకున్నా... రెండోసారి భారత రాష్టపతి కావడానికి కలామ్ ఆసక్తి చూపినా, చూపకున్నా...

ఆయన మాత్రం ఎప్పటికీ ‘పీపుల్స్ ప్రెసిడెంటే’!
‘ప్రెసిడెంట్’ అనే హోదా కన్నా ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే హోదా ఘనమైనది!
- సాక్షి ఫ్యామిలీ
ఎ.పి.జె. అబ్దుల్ కలామ్, మాజీ రాష్ట్రపతి
జననం : 15 అక్టోబర్ 1931
జన్మస్థలం : రామేశ్వరం (తమిళనాడు)
తల్లిదండ్రులు : జైనులాబ్దిన్, అషియమ్మ
వృత్తి, ప్రావీణ్యం : ఏరోస్పేస్ ఇంజినీర్, సైంటిస్ట్{పొఫెసర్, రచయిత
వైవాహికస్థితి : అవివాహితులు
పురస్కారాలు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న

కలామ్ మాట - పువ్వుల బాట

శిఖరాగ్రం చేరుకోడానికి శక్తి కావాలి. అది ఎవరెస్ట్ శిఖరమైనా, జీవిత లక్ష్యం అయినా.

సృష్టికర్త మనలో అసాధారణమైన శక్తి సామర్థ్యాలను నిక్షిప్తం చేసి ఉంచాడు. దైవారాధనతో మనం వాటిని వెలికి తెప్పించుకుని ఉపయోగించుకోవాలి.


మానసిక దాస్యం నుంచి బయటికి రాలేకపోతే మనకెవరూ గౌరవం ఇవ్వరు. జీవితం కష్టమైన ఆట. జీవించే హక్కును కాపాడుకున్నప్పుడే అందులో గెలవగలం.


పైకి చూడండి. కింద మనమొక్కళ్లమే లేము. చుట్టూ మహా విశ్వమే ఉంది. అది స్నేహపూర్వకమైనది. ముఖ్యంగా - కలలు కనేవాళ్లకు, కష్టపడి పనిచేసేవారికి అన్నీ దగ్గరకి చేర్చిపెడుతుంది. కష్టాలు లేకపోతే విజయాలను పూర్తిగా ఆస్వాదించలేం. అనుకున్నది సాధించడానికి ఏకదీక్షగా లక్ష్యానికి అంకితమవ్వాలి.


సమస్య వస్తే బెంబేలు పడిపోకూడదు. మన నెత్తినెక్కి తొక్కే అవకాశం సమస్యకు ఇవ్వకూడదు.


జీవితానుభవం

1957లో కలామ్ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. అది కష్టమైన సబ్జెక్టు. అందులో ఉన్న విద్యార్థులు మొత్తం కలామ్‌తో కలిపి తొమ్మిది మందే! ఫైనల్ ఇయర్‌లో ప్రొఫెసర్ శ్రీనివాసన్ వీళ్లందరినీ పిలిచి ఒక ప్రాజెక్టు పని అప్పగించారు. ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని గడువు విధించారు. ప్రాజెక్టు ఏమిటంటే - తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడి చెయ్యగల యుద్ధ విమానాన్ని డిజైన్ చెయ్యడం. ఏరో డైనమిక్స్, స్ట్రక్చర్స్, ప్రొపల్షన్, కంట్రోల్ ఇలాంటివన్నీ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లోని అంశాలు. వీటి ఆధారంగా విమానం నమూనాను రూపొందించాలి. కలామ్ ప్రాజెక్టు లీడర్. మిగతా ఎనిమిది మందీ సహాయక ఇంజినీర్లు. అంతా కలిసి నాలుగున్నర నెలల పాటు అధ్యయనం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు తప్ప ప్రాజెక్టు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఓరోజు - ఈ టీమ్ మొత్తం లేబరేటరీలో ‘కుస్తీ పాట్లు’ పడుతోంది. అప్పట్లో కంప్యూటర్లు లేవు. డ్రాయింగ్ బోర్డు మీద కలామ్... విమానం డిజైన్‌ని గీస్తుంటే మిగతావాళ్లంతా ఆయన చుట్టూ నిలుచుని చూస్తున్నారు. ఫ్రొఫెసర్ శ్రీనివాసన్ సరాసరి వారి దగ్గరికి వచ్చారు.


‘‘ఫ్చ్. మీ వల్ల లాభం లేదు. నన్ను పూర్తిగా నిరాశ పరిచారు. రెండు వారాల్లో గనుక ప్రాజెక్టు పూర్తి కాకపోతే మీ స్కాలర్‌షిప్పులన్నిటినీ ఆపేస్తాను’’ అన్నారు.


ఆరోజుల్లోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ క్లాస్టీ ఎడ్యుకేషన్. స్కాలర్‌షిప్ ఆపేస్తే ఇక ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవలసిందే. కలామ్ బృందం ప్రొఫెసర్‌కు సారీ చెప్పింది. ఇంకొక్క అవకాశం ఇమ్మని అడిగింది. ఆయన వినలేదు. ‘కష్టపడి పనిచేస్తాం సార్, ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అన్నారు. ఆయన ఒప్పుకోలేదు. చివరికి తామేమిటో నిరూపించదలచుకున్నారు ఈ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు. రాత్రీ పగలు పనిచేసి, శని, ఆదివారాలు ల్యాబ్‌కు వచ్చి ప్రాజెక్టు మీద కూర్చున్నారు. హాస్టళ్లకు కూడా వెళ్లకుండా వర్క్ ిఫినిష్ చేశారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ తయారైంది!


ఆ తర్వాతి ఆదివారం - గడువు తేదీకి ఒకరోజు ముందు - ప్రొఫెసర్ శ్రీనివాసన్ వీళ్ల దగ్గరకు వచ్చారు. డిజైన్ చూశారు. సంతోషించారు. అందర్నీ తన ఇంటికి తీసుకెళ్లి మెడ్రాస్ కాఫీ కాయించి ఇచ్చారు.


‘‘ఆ సంఘటన నాకు ప్రణాళిక తాలూకు ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. కాలం విలువను, టీమ్‌వర్క్ గొప్పతనాన్ని చెప్పింది. మనం చదువుతున్నది... మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్... ఏ ఇంజినీరింగ్ అయినా ప్రాక్టికాలిటీకి తేలిగ్గా అన్వయం అయేలా వాటిల్లోని మెళకువలు నేర్చుకోవాలి. ఇలాంటి విధానాన్ని మన విద్యావ్యవస్థ ప్రోత్సహించాలి’’అంటారు కలామ్.


థింకింగ్ హట్

రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ర్టపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో కలామ్ ఒక ఏకాంత కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. దానిని ఆయన ‘థింకింగ్ హట్’ అనేవారు. హట్‌లో సోఫాలుండేవి. వాటిపై కూర్చుని కలామ్ తన ఆలోచనల్ని అక్షరీకరించేవారు. ఆయన రాసిన పుస్తకాలలో రెండు ‘హట్’లో పుట్టినవే. కలామ్ పదవీకాలం ముగిసిన మూడేళ్లకు గార్డెన్‌ను పూర్వపు డిజైనింగ్‌కు అనుగుణంగా మార్పులు చేసేందుకు ఆ హట్‌ను తొలగించారు.

Sunday, April 1, 2012

ఆసియా అపర కుబేరుడు లక్ష్మీ మిట్టల్‌

http://www.theindiadaily.com/wp-content/uploads/2011/02/lakshmi-mittal.jpg
ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితా 2012లో ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్‌ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద గత ఏడాది 2 బిలియన్‌ పౌండ్లు తగ్గినా ఇంకా నంబర్‌ 1 స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆసియాలో అత్యంత ధనికుడు మిట్టలే ఆయన సంపద 13.5 బిలియన్‌ పౌండ్లు . భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే రూ.1,01,250 కోట్లు (బిలియన్‌ పౌండ్లు అంటే రూ.7,500 కోట్లు) . 2012లో 101 అత్యంత ధనవంతులైన ఆసియా వాసుల జాబితాను ఆసియా మీడియా అండ్‌ మార్కెటింగ్‌ గ్రూపు (ఎఎంజీ)కి చెందిన ఈస్ట్రన్‌ ఐ విడుదల చేసింది. కుబేరుల జాబితాను శుక్రవారం రాత్రి రమ్నిక్‌లాల్‌ సోలంకీ, సీబీఈ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఏసియన్‌ మీడియా అండ్‌ మార్కెటింగ్‌ గ్రూపు ఆసియా బిజినెస్‌ అవార్డు కార్యక్రమంలో బ్రిటన్‌ ఎంపీ కెయిత్‌ వాజ్‌ జాబితాను విడుదల చేశారు.
http://www.funonline.in/wp-content/uploads/2011/07/Lakshmi-Mittal-house.jpg
Lakshmi Mittal house


రెండవ స్థానం హిందూజాలు దక్కించుకున్నారు. తమ సంపదను 500 మిలియన్‌ పౌండ్లు పెంచుకుని 9.5 బిలియన్‌లకు చేరుకోగలిగారు. మూడవస్థానంలో వేదాంత గ్రూపునకు చెందిన అనిల్‌ అగర్వాల్‌ దక్కించకున్నారు. ఆయన సంపద 3.2 బిలియన్‌ పౌండ్లు, గత ఏడాది 1.3 బిలియన్‌ పౌండ్లు నష్టపోయినా ఆయన ఇంకా మూడవ స్థానంలో ఉన్నారు. కాపారో గ్రూపు చైర్మన్‌ లార్డ్‌ స్వరాజ్‌పౌల్‌ 7వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 675 మిలియన్‌ పౌండ్లు. గత ఏడాదితో పోల్చుకుంటే 75 మిలియన్‌ పౌండ్లు అధికం.


జాబితాలో మిగిలిన భారతీయులు వీరు :
srichand 

నరేష్‌ గోయెల్‌ (జెట్‌ ఎయిర్‌వేస్‌) 19వ స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద 275 మిలియన్‌ పౌండ్లు, గత ఏడాదితో పోల్చుకుంటే 150 మిలియన్‌ పౌండ్లు సంపద కరిగిపోయింది. కర్తార్‌ లల్వానీ, వీటా బయోటిక్స్‌ వ్యవస్థాపకుడు, ఆయన కుమారుడు తెజ్‌ లల్వానీ 30వ స్థానంలో ఉన్నారు ఆయన సంపద 155 మిలియన్‌ పౌండ్లు గత ఏడాది పోల్చుకుంటే 5 మిలియన్‌ పౌండ్లు పెరిగింది. అర్సిలర్‌ మిట్టల్‌ చైర్మన్‌, సీఈవో మిట్టల్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగానే ఉందని ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఏదిఏమైనా ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల షోలో చైనా స్టార్‌గా నిలిచిందని పొగిడారు. దీంతో పాటు మిగిలిన దేశాలు భారత్‌, దక్షణి అమెరికా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలు కూడా వృద్ధిరేటులో దూసుకుపోతున్నాయన్నారు.ఆర్థిక మాంద్యం ఉన్నా మాంద్యం లేకున్నా హిందూజాలు మాత్రం తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ అపరకుబేరుల రేసులో టాప్‌ ర్యాంకింగ్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో బ్రిటన్‌కు చెందిన బస్సు ఉత్పత్తి సంస్థ ఒప్‌ట్రాను టేకోవర్‌ చేసుకున్నారు. ఈ డీల్‌లో భాగంగా హిందూజాలకే చెందిన అశోక్‌లేలాండ్‌ వాటాను ఒప్‌ట్రాలో 75.1 శాతానికి పెంచుకున్నారు.

హిందూజాలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతున్నారు. ఉదా. హిందుజా లీలాండ్‌ ఫైనాన్స్‌ భారత్‌లోని 19 రాష్ట్రాల్లో 400 శాఖలున్నాయి. హిందూజాలు ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగానికి చెందిన మొత్తం రేంజితో పాటు నిర్మాణ రంగానికి కావాల్సిన పనిముట్లకు ఫైనాన్స్‌ చేస్తోంది. హిందుజాలు వాణిజ్య వాహనాల నుంచి ద్విచక్రవాహనాల వరకు ... ట్రాక్టర్లు... కార్ల వరకు ఫైనాన్స్‌ వ్యాపారంలో ఆరితేరింది. గల్ఫ్‌ ఆయిల్‌ కూడా హిందూజాలదే. వారి వ్యాపార ప్రకటన ఆసక్తికరంగా ఉంటుంది. గల్ఫ్‌ ఆయిల్‌ మీ స్థానిక గ్లోబల్‌ బ్రాండ్‌ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత్‌లో కందెన ఉత్పత్తి చేసే ప్లాంట్‌లున్నాయి.

anil-agarwal 

దీంతో పాటు అర్జెంటీనా, చైనా, ఫిలప్పీన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో కూడా ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. హిందుజాలకే చెందిన పలు కంపెనీలు ఈ విధంగా ఉన్నాయి. ఢిఫియెన్స్‌ టెక్నాలజీ లిమిటెడ్‌, హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌, ఇండస్‌ఇండ్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌, హిందూజా హెల్త్‌కేర్‌ సర్జికల్‌ అండ్‌ హిందుజా రియల్టీ వెంచర్‌ లిమిటెడ్‌ల కంపెనీలు హిందుజా సోదరులు నిర్వహిస్తున్నారు. లండన్‌లో కూర్చుని వీరు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే బ్రిటన్‌లో మాత్రం వీరు ఎలాంటి ఉత్పత్తి సంస్థను కానీ, అసెంబ్లింగ్‌ యూనిట్లను కానీ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న కారణంగా వీరిలో కూడా మార్పు వస్తుందో లేదో చూడాలని ఎఎంజీ మీడియా నివేదికలో పేర్కొంది.

Friday, November 25, 2011

THE HIMALAYAN LANDSCAPE - Devaang's Photography

Fasten your seat belt. I am now taking you to the uninhabited and never before seen regions of Himachal Pradesh, where you get a golden chance to be one with nature, amidst the silence of the Himalayas. Scroll down slowly, reading the descriptions of the photographs and the techniques I have used to obtain these shots. And do give your feedback at the end of your journey! Please find the Comments section at the bottom.

CHITKUL LANDSCAPE: THE LAST VILLAGE OF INDIA
The photograph above shows the Chitkul village landscape. Chitkul is a small village in the Kinnaur region of Himachal Pradesh, and it is called 'The last village of India', as just a few kilometers walk into the village leads one to the Indo-Tibet border. Chitkul is a picturesque village, a photographer's paradise. It is also the highest village in the valley. Seen in this picture is the Great Himalayan range in the background, and the Baspa river flowing through the landscape of Chitkul.

IMAGE DATA
Aperture: f/22
Shutter Speed: 1/60s
ISO speed: 100
Focal length: 28.8 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens
Location: Chitkul village, Kinnaur district, Himachal Pradesh


THE HIMALAYAS DIAGONALLY
Another shot from village Chitkul (see the first photograph and its description), with a view of the snow capped Himalayas, the abode of the Gods. I "discovered" this style of documenting the Himalayas diagonally on this trip to Himachal, and thereafter I was so fascinated by this (let me call it "diagonal landscaping") technique that I always photograph any landscape from the diagonal perspective after photographing it in the usual horizontal horizon way.

IMAGE DATA
Aperture: f/22
Shutter Speed: 1/100s
ISO speed: 100
Focal length: 88 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Chitkul village, Kinnaur district, Himachal Pradesh





GOD'S CANVAS
This photograph is actually a snap of God's own canvas. Yes, really! Look at the lovely textures on the mountain slopes. They are sure to captivate your attention. These are again "sketched" (naturally, of course) on the sedimentary rock ranges.
A small tributary of the Spiti river flows in the foreground.

IMAGE DATA
Aperture: f/5.6
Shutter Speed: 1/400s
ISO speed: 100

Focal length: 88 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh


THE UNSEEN HIMALAYAN LANDSCAPE
This is one of my favourite photographs. When you look at it, you would want to look at the mountains in the foreground again and again. Their colour, their texture, their grandeur, their spleandour, everything about them can be seen here. At the bottom can be seen the narrow road that passes by them. I photographed this unseen landscape from a moving vehicle, and hence had to use a relatively larger aperture to avoid motion blur from the bumps on the way, since I was already motionless, thanks to the beauty of the Himalayas.


IMAGE DATA
Aperture: f/11
Shutter Speed: 1/125s
ISO speed: 100

Focal length: 28.8 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh


ICING ON THE BROWN RANGE
First look at the brown mountain range in the foreground. Note the particularly rich texture of the range; the lovely shades of brown too. Then there's even an icing on this "brown cake"-- the range just behind it is entirely snow covered!

IMAGE DATA
Aperture: f/5.6
Shutter Speed: 1s
ISO speed: 100
Focal length: 88 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held: yes, I managed it even at 1s exposure,
                            thanks to IS)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh



WHEN THE SUN SETS.....
When the sun sets in the Himalayas, a completely new world springs up. Darkness descends all over, but the snow peaks reflect the cool moonlight, which even through the viewfinder, makes you shiver, really. The sky takes over blue hues, a feast to the eyes. The valleys become dark, with a few tungsten lights here and there from human inhabited areas, which are anyway sparsely populated (some with as little as 20 people!). Do not forget to carry your tripod; its absolutely necessary for these low light shots.

IMAGE DATA
Aperture: f/5.6
Shutter Speed: 0.6s
ISO speed: 100
Focal length: 88 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (on a tripod)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh




THE HIMALAYAN FORT
No, this is not a picture from Rajasthan, and the "wall" you see is not the guard wall on the periphery of some fort. This is a small range in Spiti, where the texture of the Himalayas assumes the form of an ancient fort wall. Look attentively at the texture; you'll really doubt if these are really natural! But yes, they are, they are indeed a natural wonder. And you would have noticed that this shot is another manifestation of my "diagonal landscaping" technique (see the second photograph of this page)

IMAGE DATA
Aperture: f/13
Shutter Speed: 1/80s
ISO speed: 100
Focal length: 88 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh



THE HIMALAYAN FORT: "NORMAL VIEW"
The same "Himalayan fort wall" as in the preceding photograph, but shot horizontally to reveal the Spiti river in the foreground.
IMAGE DATA
Aperture: f/13
Shutter Speed: 1/80s
ISO speed: 100
Focal length: 88 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh



SPITI: THE HIMALAYAN DESERT
Spiti valley is often called the 'cold desert'. And it is true to its name, as there's almost no rain annually, and except for the Spiti river flowing in the valley, there hardly appears to be any water source. Consequently, the land is barren, with no vegetation.
Note the rich texture of the sandy Himalayas here. I shot the above photograph from a moving vehicle; hence I took it at f/3.5, losing some depth of field. Such steps are essential to prevent blurs as you can't have the vehicle stopped at your will always: there's a single narrow road, and vehicles can suddenly come from behind, unseen on account of the wavy mountain roads, raising the danger of accidents.

IMAGE DATA
Aperture: f/3.5
Shutter Speed: 1/1600s
ISO speed: 100
Focal length: 28.8 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh


THE ANCIENT SEABED
This photograph depicts the ancient character of the Himalayas, in that they were formed when the Indo-Australian tectonic plate collided with the Eurasian plate some 45 million years ago. The seabed was thrust upwards, resulting in these sedimentary rock formations which along with the metamorphic rocks, constitute the Himalayas. This area of the Himalayas, close to the Pin Valley in Spiti, is exceptionally rich in fossils, owing to the presence of the sedimentary rocks.

IMAGE DATA
Aperture: f/5.6
Shutter Speed: 1/320s
ISO speed: 100
Focal length: 32 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Spiti, Himachal Pradesh



THE FINAL DESTINATION
While in Spiti, a visit to the Kunzum Pass  from Kaza (the Pass is at a height of 4550 metres or 14,924 feet) is a must. The road offers breathtaking views of the Himalayas. The photograph shows a Buddhist Stupa near the Kunzum pass. We had the chance to revel in the joy of being one with the Himalayas, the abode of Lord Shiva Himself. The view really  does transport one to the abode of the Almighty, which is, our final destination.

IMAGE DATA
Aperture: f/4.5
Shutter Speed: 1/2000s
ISO speed: 100

Focal length: 28.8 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Near Kunzum Pass, Spiti, Himachal Pradesh


PICTURE PERFECT HIMALAYAS
When you visit the Himalayas, you'll realise how picture perfect they are. An example can be seen above, shot on the route from Kaza to the Kunzum Pass. In the background is the magnificent range, and in the foreground, the lovely blue green waters of the Spiti river. The blue sky and the clouds add to the drama.

IMAGE DATA
Aperture: f/20
Shutter Speed: 1/100s
ISO speed: 100

Focal length: 28.8 mm (35mm equivalent)
Camera: Canon EOS 500D (hand held)
Lens: Canon EF-S 18-55mm IS lens

Location: Near Kunzum Pass, Spiti, Himachal Pradesh

Saturday, June 11, 2011

WONDERS OF INDIA

[1] SHRAVANABELAGOLA or GOMATESHWARA
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
The 17.8 m monolith of Jain prophet Bhagavan Gomateshwara Bahubali, which was carved out around 983 C.E and is located in Shravanabelagola, India, is anointed with saffron every 12 years by thousands of devotees as part of the Mahamastakabhisheka festival. The colossal monolithic statue of Gomateshwara (Shravanabelagola is a synonymous word), also called as Bahubali the Jain saint, created around 983 C.E by Chamundaraya, a minister of the Ganga King, Rachamalla (Raachmalla SathyaVaak IV 975-986 C.E) is located atop the Chandragiri hill (618 steps climb leads to the monolith on the hill), near the town of Shravanabelagola in Karnataka state. This statue is said to have been carved out of a single block of fine-grained white granite and is considered of great religious significance because Jains believe Bahubali was the first to attain moksha (freedom from cycle of birth and death). The image stands on a lotus. It has no support up to the thighs and is 60 feet (18 m) tall with the face measuring 6.5 feet (2.0 m). The statue is completely in the nude, in the Jain custom and is visible from a distance of 30 km.With the serene expression on the face of the image, its curled hair with graceful locks, its proportional anatomy, the monolith size, and the combination of its artistry and craftsmanship have led it to be called the mightiest achievement in sculptural art in medieval Karnataka. It is the largest monolithic statue in the world.
The neighbouring areas of Shravanabelagola, apart from the Gomateshwara statue, have Jaina bastis and several images of the Jaina Thirthankaras. A beautiful view of the surrounding areas could be seen from the top of the Chandragiri hill. Every 12 years, thousands of devotees congregate here to perform the Mahamastakabhisheka, a spectacular ceremony in which the thousand-year-old statue is anointed with milk, curds, ghee, saffron and gold coins. The anointing last took place in February 2006, and the next ceremony will occur in 2018.

[2] GOLDEN TEMPLE orHARMANDIR SAHIB
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
The Harmandir Sahib (The abode of God) – Golden Temple (main building) Complex with Akal Takht Sahib.completed in August 1604 AD
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
The Harmandir Sahib (Punjabi) or Darbar Sahib, informally referred to as the Golden Temple or Temple of God, is culturally the most significant shrine of the Sikhs and one of the oldest Sikh Gurudwara. It is located in the city of Amritsar, which was established by Guru Ram Das, the fourth guru of the Sikhs and the city that it was built in, is also due to the shrine known as Amritsar.
The fourth Guru of Sikhism, Guru Ram Das, excavated a tank in 1577 C.E which subsequently became known as Amritsar or Amrit Sarovar (meaning: Pool of the Nectar of Immortality), giving its name to the city that grew around it. In due course, a splendid Sikh edifice, Harmandir Sahib (meaning: The abode of God) [6], rose in the middle of this tank and became the supreme centre of Sikhism. Its sanctum houses the Adi Granth, compiled by Guru Arjun Dev, comprising compositions of Sikh Gurus and other saints considered to have Sikh values and philosophies e.g. Baba Farid, Kabir, etc. . Devotees, for whom the temple is a symbol of freedom and spiritual independence, come here from all over the world to enjoy its environs and offer their prayers. The Golden Temple sits on a rectangular platform, surrounded by a pool of water called the Amrit Sarovar. The temple building has four entrances instead of the usual single entry. This is symbolic of the openness of Sikhism and indicates that followers of all faiths are allowed inside. The walls within are decorated with carved wooden panels and elaborate inlay work in silver and gold. The Adi Granth, rests on a throne beneath a jewel-encrusted canopy. Priests conduct continuous recitation of verses from the holy book.

[3] TAJ MAHALTaj Mahal, built in the memory of the queen Mumtaz Mahal
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
Taj Mahal (also "the Taj"), the pinnacle of Mughal architecture, * Archeological Survey of India description was built by the Mughal emperor Shah Jahan in memory of his queen Mumtaz Mahal. It is considered the finest example of Mughal architecture, a style that combines elements from Persian, Turkish, Indian, and Islamic architectural styles. In 1983, the Taj Mahal became a UNESCO World Heritage Site and was cited as "the jewel of Muslim art in India and one of the universally admired masterpieces of the world's heritage." It is an integrated symmetric complex of structures that was completed around 1648. Ustad Ahmad Lahauri is generally considered to be the principal designer of the Taj Mahal.
The focus of the Taj Mahal is the white marble tomb, which stands on a square plinth consisting of a symmetrical building with an iwan, an arch-shaped doorway, topped by a large dome. Like most Mughal tombs, basic elements are Persian in origin. The base structure is a large, multi-chambered structure. The base is essentially a cube with chamfered edges and is roughly 55 meters on each side (see floor plan, right). On the long sides, a massive pishtaq, or vaulted archway, frames the iwan with a similar arch-shaped balcony. On either side of the main arch, additional pishtaqs are stacked above and below. This motif of stacked pishtaqs is replicated on chamfered corner areas as well. The design is completely symmetrical on all sides of the building. Four minarets, one at each corner of the plinth, facing the chamfered corners, frame the tomb. The main chamber houses the false sarcophagi of Mumtaz Mahal and Shah Jahan; their actual graves are at a lower level. The exterior decorations of the Taj Mahal are among the finest to be found in Mughal architecture. The calligraphy found are of florid thuluth script, created by Persian calligrapher Amanat Khan.
Masons, stonecutters, inlayers, carvers, painters, calligraphers, dome-builders and other artisans were requisitioned from the whole of the empire and also from Central Asia and Iran to build the monument. While bricks for internal constructions were locally prepared, white marble for external use in veneering work was obtained from Makrana in Rajasthan. Semi-precious stones for inlay ornamentation were brought from distant regions of India, Ceylon (SriLanka) and Afghanistan. Red sandstone of different tints was requisitioned from the neighbouring quarries of Sikri, Dholpur. It took 17 years for the Taj to be built.

[4] HAMPI Vijayanagar Raja Gopura at Hampi, Karnataka
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
The 14th century ruins nestle within them with almost every highlight of classical Indian architecture. Palaces, temples, marketplaces, watch towers, stables, baths and monoliths lie scattered amidst huge boulders, which complement the rugged look and historic feel of the place.
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
Ruins of Hampi - UNESCO World Heritage Site, presents the Vijayanagara architecture, a vibrant combination of the Chalukya, Hoysala, Pandya Chola styles, idioms that prospered in previous centuries. It Hampi was the last capital of the Vijayanagar Empire, which was admired by the travellers between the 14th and 16th centuries. But it was pillaged and abandoned by the Muslim confederacy which conquered the Decann in 1565 C.E. Palaces, temples, marketplaces, watch towers, stables, baths and monoliths lie scattered amidst huge boulders, which complement the rugged look and historic feel of the place.
Its legacy of sculpture, architecture and painting influenced the development of the arts long after the empire came to an end. Its stylistic hallmark is the ornate pillared Kalyanamantapa (marriage hall), Vasanthamantapa (open pillared halls) and the Rajagopura (tower). While the empire's monuments are spread over the whole of Southern India, nothing surpasses the vast open air theatre of monuments at its capital at Vijayanagara.

[5] KONARKKonark sun temple at Night, OrissaWheel of Konark Sun Temple
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
Konark Sun temple (also known as the Black Pagoda), was built in black granite by King Narasimhadeva I (1236 C.E-1264 C.E) of the Eastern Ganga Dynasty. The temple is a UNESCO-World Heritage Site. Built in the 13th century, the temple is designed in the shape of a colossal chariot with 24 wheels (3.3 m dia diameter each) drawn by seven horses and, carrying the Sun god, Surya, across the heavens.It is a stunning monument of religious (Brahmanical) architecture. The Sun temple belongs to the Kalinga School of Indian Temples with characteristic curvilinear towers mounted by cupolas and is aligned in the east-west direction as it is dedicated to Sun, which sun lits the entrance. The temple plan depicts three segments, viz., Natmandir (the outer complex), Jagmohan (the central complex) and Garbhagriha (the main complex housing the Deity). The main sanctum which (69.8 m. high) was constructed along with the audience hall (39.5 m. high) having elaborate external projections. The main sanctum which enshrined the presiding deity has fallen off. The Audience Hall survives in its entirely, but only small portions of the Dancing Hall (nata Mandir) and the Dining Hall (Bhoga-Mandap) have survived the vagaries of time. The Temple compound measures The Temple compound measures 857 ft (261 m) by 540 ft (160 m).
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
The entrance to the temple is guarded by two lions, each shown crushing a war elephant. Each elephant in turn is shown on top of a human body. At the entrance, there is also a Nata Mandir or dance hall where the temple dancers used to perform dances in homage to the Sun god. All around the temple, there are various floral and geometric patterns. There are also human, divine and semi-divine figures in sensuous poses. The poses contains couples in various amorous postures, and are derived from the Kama Sutr@.

[6] NALANDA
The stupa of Sariputta at Nalanda.
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
The Nalanda, located in the Indian State of Bihar, was a Buddhist center of learning from 427 C.E to 1197 C.E partly under the Pala Empire. It has been called "one of the first great universities in recorded history." According to historical studies the University of Nalanda was established 450 C.E under the patronage of the Gupta emperors, notably Kumaragupta. Nalanda, considered as the world's first residential university, had dormitories for students and had accommodated over 10,000 students and 2,000 teachers. The university was considered an architectural masterpiece, and was marked by a lofty wall and one gate. Nalanda had eight separate compounds and ten temples, along with many other meditation halls and classrooms. On the grounds were lakes and parks. The library was located in a nine storied building where meticulous copies of texts were produced. The subjects taught at Nalanda University covered every field of learning, and it attracted pupils and scholars from Korea, Japan, China, Tibet, Indonesia, Persia and Turkey. The Tang Dynasty Chinese pilgrim Xuanzang left detailed accounts of the university in the 7th century.

[7] KHAJURAHO
WONDERS OF INDIA - Phani Kiran: World Informatives

WONDERS OF INDIA - Phani Kiran: World Informatives
Lakshmana temple at Khajuraho, a panchayatana temple.Khajuraho Temple, India
Khajuraho has the largest group of medieval (between 950 C.E and 1050 C.E) temples of Hindu and Jain religion. There is perfect fusion of architecture and sculpture at this temple complex, famous for their erotic sculpture. The temples are a UNESCO world Heritage Site. At the Temple of Kandariya, there is a profusion of decorated sculptures considered as one of the greatest masterpieces of Indian art. Built by Chandela dynasty, the temples exhibit stunningly explicit sexual sculptures which were created by the artist's imagination of lovemaking positions prevalent at that time, or based on the rules outlined in the Kamasutra. Many of the sculptors have claimed artistic ownership on many sculptures. Built of sandstone in varying shades of buff, pink or pale yellow, most of the temples belong to the Shiva, Vaishnava or Jaina religious Sects, which are difficult to differentiate from one another. The temples, sited in an East-West direction, depicts a plan with spacious layout with interior rooms inter connected. An entrance, a hall, a vestibule and a sanctum are part the common layout plan of the temples. It is stated that the Khajuraho temples are a celebration of womankind, her innumerable moods and facets which are witnessed by the carvings of a woman writing letter, applying makeup to her eyes, combing her tresses, dancing, and playing with her child. Also etched, sculpted with consummate skill are innocent, coquettish, smiling, seductive, passionate and beautiful and erotic sculptures depicted in intricate detail. It is also opined that the Chandelas followed the Tantric cult with the faith that gratification of earthly desires is a step towards attaining Nirvana, the infinite liberation.

Thank You !
 
Received this from Mr.Chandra Shekhar, Hyderabad

Tuesday, February 15, 2011

యోధాను యోధులు

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వరల్డ్‌ కప్‌ టోర్నీ రానే వచ్చింది. ఈ టోర్నీలో 14 దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు వరల్డ్‌ కప్‌ ట్రోఫీని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో పాల్గొనబోతోంది. దాదాపు అన్ని జట్లకు కూడా ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ టోర్నీలో ఆటగాళ్ల ఎంపికలో ఆయా దేశాలు అనేక జాగ్రత్తలు తీసుకున్నారుు. అంతకుముందు జరిగిన వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఆడిన ఆటగాళ్లను ఎంపికచేయడానిేక ఆయా జట్లు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఆటగాళ్లలో చాలా మంది గత వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో (2003, 2007) ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు, ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లుగా రికార్డులు సాధించారు. అంతటితో ఆగకుండా త్వరలో జరగనున్న వరల్డ్‌ కప్‌లో కూడా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆటగాళ్లెవరెవరో నేటి ప్రత్యేక సంచికలో తెలుసుకుందాం.

సచిన్‌ టెండుల్కర్‌ (బారత్‌)
sachinవరల్డ్‌ కప్‌లో పాల్గొంటున్న వెటరన్‌ ఆటగాళ్ల జాబితాలో భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటివరకు వరుసగా ఐదు ప్రపంచ కప్‌ ((1992-2007) టోర్నీల్లో అతను పాల్గొన్నాడు. ఈసారి జరగనున్న టోర్నీ సచిన్‌కు ఆరవది. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో పాల్గొనడం ద్వారా పాక్‌ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ నెలకొల్పిన ఆరు వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో పాల్గొన్న రికార్డును అతను సమం చేయనున్నాడు. సుధీర్ఘమైన రెండు దశాబ్దాలకు పైగా గల తన క్రికెట్‌ కెరీర్లో సచిన్‌ ఆడే చివరి వరల్డ్‌ కప్‌ ఇదేనని అందరు భావిస్తున్నారు. ఈ వరల్డ్‌ కప్‌ను గెలిచి సచిన్‌కు కానుకగా ఇవ్వాలనే కృత నిశ్చయంతో మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలోని టీం ఇండియా ఉంది. బ్యాటింగ్‌ విభాగంలోని దాదాపు అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో అగ్ర స్థానంలో సచిన్‌ నిలిచాడు.

ఆ టోర్నీలో మొత్తం 11 మ్యాచులు ఆడి 673 పరుగులను మాస్టర్‌ చేశాడు. ఇందులో 1 శతకంతో పాటు 6 అర్ధ శతకాలు ఉన్నాయి. సచిన్‌ ఉన్న ఈ జట్టు ఎలాగైన వరల్డ్‌ కప్‌ను గెలవాలని భారత క్రికెట్‌ అభిమానులు అందరూ ఆశిస్తున్నారు.

సెహ్వాగ్‌ భారత్‌
sehewagటీం ఇండియా డాషింగ్‌ ఓపెనర్‌గా తాను బ్యాట్‌తోనే కాదు ఫీల్డింగ్‌లో కూడా రాణించగలనని నిరూపించాడు. జట్టులో కీలకమైన బ్యాటింగ్‌ బాధ్యతలు మోస్తున్న సెహ్వాగ్‌ 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌ టోర్నీలో తన ఫీల్డింగ్‌ సత్తాను ప్రపంచానికి చూపెట్టాడు. మొత్తం 11 మ్యాచుల్లో పాల్గొని ఏకంగా ఎనిమిది క్యాచులను పట్టాడు.


రికీ పాంటింగ్‌ ఆస్ట్రేలియా
ponting కప్‌ను గెలిచి హ్యాట్రిక్‌ను సాధించాలనే ఆశతో ఈసారి జరగనున్న టోర్నీలో పాంటింగ్‌ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. క్రీజులోకి రావడంతోటే దూకుడుగా ఆడడం పాంటింగ్‌ నైజం. 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌లో మూడవ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అతను అవతరించాడు. ఆడిన 11 మ్యాచుల్లో మొత్తం 415 పరుగులను సాధించి తన సత్తాను చాటాడు. ఇందులో ఒక సెంచరీ ఆరు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా ఫీల్డింగ్‌ విభాగంలో కూడా అతను రాణించి అత్యధిక క్యాచులు పట్టిన ఫీల్డర్‌ మరో రికార్డును కూడా పాంటింగ్‌ నెలకొల్పాడు. ఇక 2007లో జరిగిన వరల్డ్‌ కప్‌లో కూడా పాంటింగ్‌ బ్యాటింగ్‌ విభాగంలో చెలరేగాడు. మొత్తం 11 మ్యాచులు ఆడిన 535 పరుగులను అతను సాధించాడు. ఇందులో ఒక శతకంతో పాటు నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో జట్టు ఘోరపరాజయం పాలు కావడం, భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో ధోని సేన చేతిలో ఎదురైన సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ నుంచి అతను బయటపడలేకపోయాడు.

ఉపఖండంలో జరగబోతోన్న ఈ వరల్డ్‌కప్‌ టోర్నీని గెలిచి కెప్టెన్‌గా సరిక్రొత్త రికార్డును సృష్టించాలనే ఆశ 36 ఏళ్ల పాంటింగ్‌లో కనబడుతోంది. ఇటీవలికాలంలో జట్టుకు వరుస పరాజయాలు ఎదురౌతున్న నేపథ్యంలో తన ఈ ప్రయత్నంలో పాంటింగ్‌ ఏ మేరకు విజయం సాధిస్తాడో వరల్డ్‌ ప్‌ పోరు వరకు వేచి చూడాల్సిందే.

మురళీధరన్‌ శ్రీలంక
మురళీధరన్‌కిది నాలుగవ వరల్డ్‌కప్‌..

murali1996లో జరిగిన వరల్డ్‌కప్‌లో శ్రీలంకను విశ్వవిజేతగా చేయడంలో అతను కీలకపాత్ర పోషించాడు. ఈసారి జరగనున్న వరల్డ్‌కప్‌లో కూడా ఈ 36 సంవత్సరాల స్పిన్‌ దిగ్గజం కీలకపాత్ర పోషించనున్నాడు. ఇప్పటికే టెస్టుల నుంచి రిటైరైన అతను వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఉపఖండంపై జరుగుతున్న ఈ టోర్నీలో మురళీ బౌలింగ్‌ ప్రభావం ప్రత్యర్థులపై ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌లో మురళీధరన్‌ 17 వికెట్లను కూల్చి ఆరవ స్థానంలో నిలవగా.. 2007 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఏకంగా 23 వికెట్లను కైవసం చేసుకొని అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌ అయ్యాడు.

బ్రెట్‌లీ ఆస్టేలియా
b-leeఈ ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో తన సత్తాను చాటాడు. గంటకు దాదాపు వంద మైళ్ల పరుగును అందుకునే సామర్ధ్యం ఉన్న బౌలర్‌గా గుర్తింపు పొందిన బ్రెట్‌ లీ 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌ టోర్నీలో 22 వికెట్లను కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలోని ఒక మ్యాచులో అతను 42 పరుగులిచ్చి 5 వికెట్లను తీశాడు. ఈసారి జరగునున్న వరల్డ్‌కప్‌లో కూడా బ్రెట్‌ లీ కీలక భూమికను పోషించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


జహీర్‌ ఖాన్‌ భారత్‌
zeheerఈ భారత స్పీడ్‌స్టర్‌ కొత్త బంతిని స్వింగ్‌ చేయడంలో నేర్పరి. అంతే గాకుండా పాతబడ్డ బంతితో రివర్స్‌ స్వింగ్‌ను కూడా వేయగలడు. 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌లో 18 వికెట్లను కూల్చి అత్యధిక వికెట్లను కూల్చిన బౌలర్ల జాబితాలో నాలుగవ స్థానాన్ని జహీర్‌ కైవసం చేసుకున్నాడు. ఈ వరల్డ్‌ కప్‌లో కూడా టీం ఇండియాలో జహీర్‌ కీలక భూమికను పోషించనున్నాడు.

కుమార సంగక్కర శ్రీలంక
sangakarఈ వరల్డ్‌ కప్‌లో శ్రీలంక జట్టుకు సంగక్కర నేతృత్వం వహిస్తున్నాడు. వికెట్‌ కీపర్‌గా అనేక రికార్డులను అతను సొంతం చేసుకున్నాడు. గత రెండు వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో కూడా అద్బుతంగా రాణించి సంగక్కర అందరి దృష్టిని ఆకర్షించాడు. 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌టోర్నీలో 10 మ్యాచుల్లో పాల్గొన్న అతను 17 ఆటగాళ్లను ఔట్‌ చేసి బెస్ట్‌ వికెట్‌ కీపర్ల జాబితాలో రెండవ స్థానాన్ని సాధించాడు. ఇందులో 15 క్యాచులు రెండు స్టంప్‌ ఔట్‌లు ఉన్నాయి. అదే విధంగా 2007లో జరిగిన వరల్డ్‌కప్‌లో కూడా సంగక్కర రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడి 15 మందిని ఔట్‌ చేశాడు. వీటిలో 11 క్యాచౌట్లు, 4 స్టంప్‌ ఔట్‌లు ఉన్నాయి.

బ్రెండన్‌ మెకల్లమ్‌ న్యూజిలాండ్‌
m-callamదూకుడు బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన ఈ న్యూజిలాండర్‌ గత రెండు వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో కూడా వికెట్‌ కీపర్‌గా బాగా రాణించాడు. 2003లో జరిగిన వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఏడు మ్యాచుల్లో పాల్గొన్న మెకల్లమ్‌ తొమ్మిది మందిని పవేలియన్‌ దారి పట్టించాడు. అదే విధంగా 2007లో జరిగిన వరల్డ్‌ కప్‌లో 10 మ్యాచుల్లో పాల్గొన్న అతను 14 మంది బ్యాట్స్‌మెన్లను ఔట్‌ చేశాడు. వీటిలో 13 క్యాచులు, ఒక స్టంప్‌ఔట్‌ ఉన్నాయి. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయే తత్వం మెకల్లమ్‌ది. ఒంటి చేత్తో మ్యాచును గెలిపించే సత్తా అతని సొంతం. బీసీసీఐ నిర్వహించే అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌ టోర్నీ తొలి ఎడిషన్లో ఏకంగా సెంచరీ సాధించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశాడు.

జాక్వెస్‌ కలిస్‌ సౌతాఫ్రికా
bestbatmans


ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌ కప్‌ టోర్నీని గెలవలేకపోయిన సౌతాఫ్రికా జట్టు ఈ టోర్నీలో ఫేవరేట్‌ జట్టుగా బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ పైనే జట్టును ముందుకు నడిపించాల్సి న బాధ్యత పడనుంది.

స్కాట్‌ స్ట్రైరిస్‌ న్యూజిలాండ్‌
35 ఏళ్ల ఈ కివీస్‌ ఆటగాడికి ఇది వరుసగా మూడో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌ టోర్నీల్లో బాగా రాణించినా... వరల్డ్‌ కప్‌ ట్రోఫీ మాత్రం న్యూజిలాండ్‌ జట్టుకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారైన తమ తీరని కలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ జట్టు ఉంది. ఆల్‌రౌండర్‌గా పేరుబడ్డ స్టైరిస్‌ గనుక రాణిస్తే.. జట్టుకు లాభిస్తుంది.

స్టీన్‌ టికోలో - కెన్యా
39 ఏళ్ల ఈ కెన్యా ఆటగాడు నాలుగవ సారి వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నాడు. ఈ వరల్డ్‌ ప్‌ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లలో అందరికంటే పెద్దవాడు అతడే కావడం విశేషం. కెన్యా జట్టు 1996లో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో ఆరంగేట్రం చేసినప్పటినుంచి అతను జట్టులో కొనసాగుతున్నాడు. 2003 ప్రపంచకప్‌లో కెన్యా జట్టు సెమీస్‌కు చేరడంలో టికోలో కీలకపాత్ర పోషించాడు. ఈసారి కూడా జట్టును ముందుకు నడిపించే బాధ్యత అతనిపై పడనుంది.

కాలింగ్‌వుడ్‌ ఇంగ్లండ్‌
కాలింగ్‌వుడ్‌ వరుసగా మూడవ ప్రపంచకప్‌లో పాల్గొననున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడంలోను బౌండరీలు, సిక్సర్లను బాదడంలోను 34 సంవత్సరాల ఈ బ్యాట్స్‌మన్‌కు మంచి పట్టుంది. క్రికెట్‌కు జన్మస్థానమైన ఇంగ్లండ్‌ దేశం ఈసారి వరల్డ్‌కప్‌లో రాణించాలంటే కాలింగ్‌వుడ్‌ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.

చందర్‌పాల్‌ వెస్టిండీస్‌
chandarpal కాలం పాటు జట్టుకు దూరమైన 36 చంద్రపౌల్‌ తిరిగి వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చాడు. అతనికిది నాలుగో వరల్డ్‌ కప్‌. ఏ పరిస్థితుల్లోనైనా రాణించడం, భాగస్వామ్యాలు నిర్మించడం చందర్‌పౌల్‌ ప్రత్యేకత.

Sunday, January 2, 2011

క్రికెట్‌ రారాజు * సచిన్‌ టెండూల్కర్‌...

sachin-tendulkar-w 
సచిన్‌ టెండూల్కర్‌... ఈ పేరు వింటేనే ప్రతి ఒక్క భారతీయుడి ఒళ్లు గర్వంతో పులకించిపోతుంది. క్రికెట్‌ క్రీడను ప్రేమించే వారైతే అతడిని దేవునిగా ఆరాధిస్తారు. రెండు దశాబ్దాల సుధీర్ఘమైన క్రికెట్‌ కెరీర్‌, లెక్కలేనన్ని రికార్డులు... అనేక ఘనతల్ని తన సొంతం చేసుకున్న సచిన్‌ ఖాతాలో కొద్ది రోజుల క్రితం (డిసెంబర్‌ 19, 2010) మరో చారిత్రాత్మక ఘనత వచ్చి చేరింది. 133 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఎవ్వరూ సాధించని సరికొత్త రికార్డును మాస్టర్‌ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 50 శతకాలు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌ అయ్యాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని అనితర సాధ్యమైన రికార్డును సాధించి కూడా... ‘50వ సెంచరీ అనేది నా గణాంకాల్లో చేరిన మరో అంకె మాత్రమే’ అని చెప్పడం అయిన సచిన్‌కే చెల్లింది. అందుకే అతను క్రికెట్‌ క్రీడకు రారాజు.. క్రికెట్‌ ఎవరెస్టు అయ్యాడు. అసలు సచిన్‌ ఇంత గొప్ప క్రికెటర్‌గా రూపాంతరం చెందడానికి ఏఏ అంశాలు తోడ్పడ్డాయి అనేది ఒకసారి విశ్లేషిస్తే...

నిత్య విద్యార్థి...
sachinbrad1 
తన కెరీర్లో ఎన్నో రికార్డుల్ని తన అక్కున చేర్చుకున్న సచిన్‌ ఇప్పటికీ కూడా నిత్య విద్యార్థే... క్రికెట్‌ సంబంధించి ఏ విషయానై్ననా అతను తదేకమైన దీ, అంకుఠిత భావంతో నేర్చుకుంటాడు. ఇప్పటికీ కూడా తనకంటే జూని యర్ల నుంచి సలహాలను స్వీకరించడానికి అతను సిగ్గుపడడు. నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నప్పుడు.. తాను ఎలా షాట్లను ఆడుతున్నానని... ఆ షాట్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా అన్న విషయాల్ని... తన సహచరులతో అడిగి తెలు సుకునే ప్రయత్న సచిన్‌ చేస్తుంటాడు. ఇలాంటి గుణం సమకాలీన క్రికెటర్‌ లలో కనిపించడం చాలా అరుదు.

క్రికెటే లోకం...
34th-centuryటెండూల్కర్‌ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం క్రికెట్‌ పట్ల అతనికున్న మోజు, ఏకాగ్రత, అంకితభావం, అంకుఠిత దీక్ష అలాంటిది. అతను ఆడే ప్రతి షాట్లో ఇది మనకు కనబడుతుంది. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడడం ప్రారంభించిన తొలినాళ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను మైదానంలో క్రికెట్‌ ఆడుతూనే గడుపుతూ ఉండేవాడు. ఇంతటి ఏకాగ్రత అంకుఠిత భావం మాస్టర్‌ తన ఆటపై చూపెట్టాడు కాబట్టే.. ఈ రోజు ప్రపంచ రికార్డులన్నీ అతనికి దాసోహమంటున్నాయి.

క్రీజులో అతను చేసే అతిచిన్న కదిలిక కూడా... వంద శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటుంది. ‘సంప్రదాయం కోసం ఉపయోగించే ఫుట్‌వర్క్‌ను నేను నమ్మను. ఎందుకంటే టెస్టు క్రికెట్‌కు అవసరమైన ఆటతీరు... పుస్తకాల్లో తెలిపిన విధంగా ఉండదు’ అని సచిన్‌ ఒక సందర్భంలో అన్నాడు. ఈ ఒక్క ఉదాహరణ టెండూల్కర్‌కు క్రికెట్‌పై ఉన్న పిచ్చి ప్రేమను చాటి చెబుతుంది. మాస్టర్‌లోని ఈ క్వాలిటీయే అతనిలో అన్ని రకాల షాట్లను ఆడగలిగే సత్తా సాధించేలా చేసింది. బయట సచిన్‌ ఎలాఉన్నా... ఒక్కసారి క్రీజులోకి వచ్చాడంటే... అతను పూర్తిగా మారిపోతాడు. బయటి ప్రపంచానికి బదులు కేవలం క్రికెట్‌ మాత్రమే అతని లోకంగా మారుతుంది. ఈ క్రీడ పట్ల సచిన్‌కున్న ఏకాగ్రత, క్రికెట్‌పట్ల అతనికున్న అంకుఠిత భావం, మోజు... అతను ఆడే ప్రతి షాట్లోను ప్రతిఫలిస్తుంది.

Sachin_Tendul 
ఆడేది ఏ రంజీ మ్యాచ్‌ అయినా... గల్లీ క్రికెట్‌ అయినా... టెస్టు మ్యాచైనా... వన్డే మ్యా చైనా... పూర్తిస్థాయి ఏకాగ్రత, అంకిత భావంతో ఆడడం సచిన్‌కున్న ప్రత్యేకత అని చెప్పవచ్చు. తాను ఆడేది ఏ మ్యా చైనా ప్రజలు తనను గమనిస్తున్నా రనే భావన అతనిలో ఎప్పుడూ ఉండడమే దీనికి ప్రధానమైన కార ణం. ఒక బాలు డు ప్రతీ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎలాంటి ఆసక్తిని చూపెడతాడో అదే విధమైన కుతూహలాన్ని చూపెట్టడంతో పాటు... ఆడే ప్రతి మ్యాచులో కూడా తన అత్యుత్తమంగా రాణించాలనే గట్టి పట్టుదల అతన్ని ఇంత గొప్ప క్రికెటర్‌గా మార్చింది. 21 ఏళ్ల సుధీర్ఘ కాలం నుంచి ఆడుతున్నా... ఇప్పటికీ కూడా సచిన్‌కు క్రికెటే లోకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేగాకుండా... ఇతర కెప్టెన్‌ లాంటి ఇతర బాధ్యతల్ని తలకెత్తుకోకుండా... కేవలం బ్యాటింగ్‌పైనే మాస్టర్‌ తన పూర్తి స్థాయిలో దృష్టిని సారించడం కూడా అతన్ని గొప్ప క్రికెటర్‌ను చేసింది. అర్ద సెంచరీలు, సెంచరీలు సాధించాలనే ఏకైక లక్ష్యమే అతడిని ఎన్నో బ్యాటింగ్‌ రికార్డులు నెలకొల్పేలా చేసింది.

సచిన్‌కున్న క్రేజ్‌...
సచిన్‌ క్రీజులోకి వచ్చిన ప్రతిసారి వేల సంఖ్యలో కళ్లు అతని ప్రతీ కదలికను గమనిస్తూ ఉంటాయి. అతను బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి కూడా తనకు తానే ఉదాహరణ గా సచిన్‌ కనబడుతాడు. మాస్టర్‌ బ్యాటు నుంచి పరుగులు జాలువారుతున్నంత సేపు... అతన్ని గమనిస్తున్న... వేల మందికి లెక్కకు మించిన ఆనందం లభ్యమౌతుంది. అదే అతను ఔటయితే... మొత్తం స్టేడియం నిశ్శబ్దంగా మారిపో తుంది. టెండూల్కర్‌ ఔటయితే... ఎందుకు అతను ఎలా ఔటయ్యాడనే దానికంటే... ఏ పరిస్థితులు అతను ఔటయ్యే లా చేసాయనే దానిపై విశ్లేషకులు ఆలోచిస్తారు.

అయితే టెండూల్కర్‌ మాత్రం వీటన్నింటిని పట్టించుకోకుండా... తన ఆటను ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆడుతూనే ఉంటాడు. ‘జెంటిల్‌మెన్‌’ టెండూల్కర్‌ ఎప్పుడు విఫలం కాడు. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే... ‘అతడిని భయంకరమైన వసీం అక్రమం, వఖార్‌ యూనిస్‌, ఖదీర్‌ లాంటి వాళ్ల బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు జట్టులోకి ఎంపిక చేయాలా వద్దా? అనేది ఇప్పుడు మనముందున్న ముఖ్య మైన ప్రశ్న’ అని కేవలం 16 ఏళ్ల వయస్సున్న సచిన్‌ను పాకిస్థాన్‌ పర్యటనకు తొలిసారిగా జాతీయ జట్టులోకి ఎంపి కచేసిన సెలెక్టర్‌ నరేన్‌ తమాన్హె అన్న మాటలివి. తమాన్హె చేసిన ఈ వ్యాఖ్యలు సచిన్‌లో ఆయన చూసిన ప్రతిభకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. అంతేగాకుండా... సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసేనాటికే ఒక మేలి క్రికెట్‌ వజ్రంగా రూపాంతరం చెందాడనే... వాస్తవానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

వ్యక్తిగత వివరాలు...

Sachinn 
పూర్తి పేరు : సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌
పుట్టిన తేది : ఏప్రిల్‌ 24, 1973
జన్మస్థానం : బాంబే (ప్రస్తుతం ముంబాయి), మహారాష్ట్ర
ఎత్తు : 5 అడుగుల 5 అంగుళాలు
ముద్దుపేరు : టెండిల్యా, లిటిల్‌ మాస్టర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌
ఆడిన జట్లు : భారత్‌, ఏషియా ఎలెవన్‌, ముంబాయి,
ముంబాయి ఇండియన్స్‌
బ్యాటింగ్‌ స్టైల్‌ : రైట్‌-హ్యండ్‌ బ్యాటింగ్‌
బౌలింగ్‌ స్టైల్‌ : రైట్‌-ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌, లెగ్‌ బ్రేక్‌
టెస్టు ఆరంగేట్రం : నవంబర్‌ 15, 1989, పాకిస్థాన్‌ పై
వన్డే ఆరంగేట్రం : డిసెంబర్‌ 18, 1989 పాకిస్థాన్‌ పై
ట్వంటీ20 : డిసెంబర్‌, 2006 దక్షిణాఫ్రికా పై


మాస్టర్‌ గొప్పతనం... క్రికెట్‌ దిగ్గజాల మాటల్లోనే...
Sachin-Tendulkar 
* అతని (సచిన్‌)కి టెస్టు మ్యాచ్‌ అనేది రెండు రోజుల ముందుగానే తాను చేసే ప్రాక్టీసుతోనే ప్రారంభమౌతుంది. నెట్స్‌లో కూడా సాధ్యమైనంత ఎక్కువ బంతులు ఎదుర్కోవడానికి సచిన్‌ ఎప్పుడూ తపిస్తుంటాడు. నెట్స్‌లో కూడా అతను ఒక్క చెత్త షాట్‌ను ఆడడం కనిపించదు
- గ్యారీ కిర్‌స్టన్‌, భారత క్రికెట్‌ జట్టు కోచ్‌
* అతని (సచిన్‌)కి అతడే ఒక చాలెంజ్‌
- శ్రీలంక కెప్టెన్‌ కుమార సంగక్కర
* మేము క్రికెట్‌ ఆడే రోజుల్లో సునీల్‌ గవాస్కర్‌ నెలకొల్పిన రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేరు అనుకునేవాళ్లం. ఎవ్వరూ కూడా టెస్టుల్లో 50 వ సెంచరీని సాధించే దిశగా ఆలోచన కూడా చేయరని అనుకునేవాళ్లం. ఇది (సచిన్‌ సాధించిన 50 వ శతకం) ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధించిన గొప్ప ఘనత అని చెప్పగలను.
- కపిల్‌ దేవ్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌
* సచిన్‌ వికెట్‌ దక్కాలని కోరుకోని జట్టు ప్రపంచలో ఏది ఉండదు. ఎందుకంటే ఆ (సచిన్‌) వికెట్‌ దక్కితే... ఆ జట్టు మ్యాచ్‌ను దాదాపు గెలిచినట్లే మరీ
- మ్యాథ్యూ హేడెన్‌, ఆసీస్‌ మాజీ ఓపెనర్‌
* అతడు (సచిన్‌) ఆడే ప్రతీ మ్యాచ్‌ను చూసే ప్రయత్నం చేస్తాను.. ఎందుకంటే.. అతని లాంటి సహజ సిద్దమైన టెక్నిక్‌ కలిగిన బ్యాట్స్‌మన్‌ మరొకరు లేరు. అతని కఠోర శ్రమ, అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది.
- మొహమ్మద్‌ హనీఫ్‌, పాక్‌ మాజీ క్రికెటర్‌
* ప్రపంచ క్రికెట్‌లో 20 ఏళ్ల సుధీర్ఘ కాలం పాటు కూడా ఒకరు ఆడగలరని నేనే ఎప్పుడూ అనుకోలేదు.
- గేమ్‌ పొలాక్‌
* ఇంత సుధీర్ఘకాలం పాటు ఒక టాప్‌ డ్రాకారునిగా ఎలా ఉండగలిగాడో నేను అతడిని అడుగుతాను... అంతేగాకుండా... అలా ఉండడానికి ఇతరులకు అతనిచ్చే సలహా ఏమిటని కూడా అడుగుతాను
- ఉసైన్‌ బోల్ట్‌, ప్రపంచ ఫాస్టెస్ట్‌ అథ్లెట్‌
* నేను ఈ రోజు క్రికెటర్‌గా మారడానికి కారణం సచిన్‌ టెండూల్కర్‌. అతడే లేకపోతే నేను అసలు బ్యాట్‌ను కూడా పట్టేవాడినే కాదు.
- వీరేంద్ర సెహ్వాగ్‌, భారత క్రికెట్‌ జట్టు సభ్యుడు

అద్బుతమైన జ్ఞాపకశక్తి...
సచిన్‌ది అద్బుతమైన జ్ఞాపకశక్తి. తన కెరీర్లో ఆడిన దాదాపు అన్ని మ్యాచులకు సంబంధించిన ముఖ్యమైన వివరాల్ని అతను ఖచ్చితంగా చెప్పగలడు. తానిచ్చిన అనేక ఇంటర్వ్యూల్లో ఈ విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది.

అవార్డులూ... రికార్డులూ...

3rd-century 
అవార్డులు...
2010 : ఐసీసీ అవార్డు- సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫి ఫర్‌ క్రికెటర్‌
ఆఫ్‌ ది ఇయర్‌
2010 : అక్టోబర్‌లో... ది ఏషియన్‌ అవార్డ్‌‌సలో భాగంగా ఇచ్చే
ఔట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ స్పోర్ట్‌‌స అండ్‌ ద పీపుల్స్‌
చాయిస్‌ అవార్డు
2008 : పద్మ విభూషణ్‌
2004-07 : ఐసీసీ వరల్డ్‌ ఎలెవన్‌
2005 : రాజీవ్‌ గాంధీ అవార్డు (క్రీడలు)
2003 : వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌
2001 : మహారాష్ట్ర రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర
భూషణ్‌ అవార్డు
1999 : పద్మశ్రీ
1997-98 : రాజీవ్‌ గాంధీ ఖేల్త్న్ర
1997 : విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌
1994 : అర్జున అవార్డు
రికార్డులు...
* అత్యధిక టెస్టు శతకాలు (50)
* అత్యధిక వన్డే శతకాలు (46)
* అత్యధిక అంతర్జాతీయ శతకాలు (టెస్టులు, వన్డేలు కలుపుకొని-96)
* టెస్టుల్లో అత్యధిక పరుగుల సగటు (56.54)
* అత్యధిక టెస్టులు ఆడిన రికార్డు (176)
* భారత్‌ వెలుపల అత్యధిక పరుగులు (56.85 సగటుతో) 96 టెస్టుల్లో
7959 పరుగులు)
* భారత్‌ వెలుపల అత్యధిక సెంచరీలు (28)
* 100 కు పైచిలుకు భాగస్వామ్యాలు (81)
* భారత్‌-దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక
పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌ (1500)
* భారత్‌-దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు
సాధించిన క్రికెటర్‌ (6)

సచిన్‌ మెచ్చినవి...
* ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ చేసిన ప్రశంస
* ఈ ఏడాది (2010) టెస్టుల్లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం
* వెస్టిండీస్‌ గ్రేట్‌ బ్రియాన్‌ లారా రికార్డును అధిగమించడం

మాస్టర్‌ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు...
Sachin_tendulker_gana 
* చిన్ననాటి స్నేహితుడు వినోద్‌ కాంబ్లీతో స్కూల్‌ స్థాయిలో జరిగిన హారిస్‌ మెమోరియల్‌ చాలెంజ్‌ షీల్డ్‌ టోర్నీలో కలిసి సచిన్‌ చేసిన 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం గురించి అందరికి తెలుసు.. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన టోర్నీ ఫైనల్‌ మ్యాచులో సచిన్‌ సాధించిన 346 నాటౌట్‌ స్కోరు గురించి చాలామందికి తెలీదు.
* ఆడిన తొలి రంజీ టోర్నీ మ్యాచుతో పాటు దులీప్‌ ట్రోఫీ మ్యాచులో సచిన్‌ సెంచరీలు సాధించిన విషయం అందరికి తెలుసు.. అతను సాధించిన ఆ శతకాల సహాయంతోనే జట్టు గట్టెక్కిన విషయం చాలామందికి తెలీదు.
* ఆడిన తొలి టెస్టు మ్యాచులో పాక్‌ పేసర్‌ వఖార్‌ యూనిస్‌ వేసిన ఒక బంతి తాకి ముక్కు నుంచి రక్తం కారిన విషయం అందరికి తెలుసు.. అయితే ఆ మరుసటి బంతినే మాస్టర్‌ బౌండరీకి తరలించిన విషయం చాలామందికి తెలీదు.

విదేశీగడ్డపై...
సచిన్‌ ఆడిన తొలి 21 టెస్టుల్లో 20 టెస్టులు విదేశీ గడ్డపై ఆడినవే కావడం విశేషం. ఈ 21 టెస్టుల్లో కూడా సచిన్‌ 38 సగటుతో నాలుగు శతకాలు, ఐదు అర్ధ శతకాల్ని అతను సాధించాడు. ఈ టూర్లలో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలు పర్యటనలు ఉన్నాయి.

ఆయా స్థానాల్లో మాస్టర్‌ సాధించిన సెంచరీలు...
బ్యాటింగ్‌ ఆర్డర్‌  ఇన్నింగ్స్‌  శతకాలు

       1    1    0
       4   236    44
       5    27     4
       6    20     2
       7           4     0 
table-sachn

మచ్చలేని మనిషి...
టెండూల్కర్‌ది మచ్చలేని వ్యక్తిత్వం. రెండు దశాబ్దాల సుధీర్ఘ కాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఉన్న సచిన్‌ వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడలేదు. తన వ్యక్తిత్వాన్ని హరించే ఎలాంటి చిన్న పనిని కూడా సచిన్‌ చేయ లేదు. తన కెరీర్‌గా ఎంచుకున్న రంగానికిగల ప్రాధాన్య త, సమాజంలో తనకుగల స్థానాన్ని గుర్తిం చి అతను మసలుకున్నాడు. సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ ఆడిన దాదాపు ప్రతి ఒక క్రికెటర్‌ కూడా తన ఆట ద్వారా ఏదో ఒక రకమైన పేరును సంపాదిస్తారు. ఇయాన్‌ బోథమ్‌ ఇరోల్‌ ఫ్లైయిన్‌ ఆఫ్‌ క్రికెట్‌గా, సర్‌ వివియన్‌ రిచర్డ్‌‌స మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, షేస్‌ వార్న్‌ మార్లిన్‌ మాన్రోగా, ముత్త య్య మురళీధరన్‌ హోబిట్‌గా పేరు ను సంపాదిం చారు. అయితే టెండూల సెక్యు లర్‌ సేయింట్‌ (ఋషి)’ అనే పేరును సంపాదించాడు. అటువంటి వ్యక్తిత్వం సచిన్‌ సొంతం.

బౌలింగ్‌లోనూ దిట్ట...
table-sachబ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌ లోను సచిన్‌కు మంచి ప్రతిభ ఉంది. క్రికెట్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ మాదిరిగా కాకున్నా... అతనితో పోల్చదగ్గ సత్తా సచిన్‌లోనూ ఉంది. సోబర్స్‌ లాగానే టెండూల్కర్‌ బంతిని రెండు రకాలు గా స్వింగ్‌ చేయగలడు. చాలా మంది బౌలింగ్‌ స్పెషలిస్టుల్లో కూడా ఈ సత్తా అరుదుగా కనబ డుతుంది. అంతేగాకుండా అద్భుతమైన లెగ్‌ బ్రేక్‌ బంతుల్ని వేయడంతో పాటు... మణిక ట్టును బాగా తిప్పగల చాలామంది స్పిన్నర్లకు కూడా సాధ్యంకాని గుగ్లీలను సరైన ప్రాంతం లో వేయడంలో కూడా సచిన్‌ దిట్ట అనడంలో సందేహం లేదు. ఆఫ్‌స్పిన్‌ను వే యడంలో కూడా సచిన్‌కు మంచి ప్రవేశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే... తన బ్యా టింగ్‌కు ఉ న్న ప్రాధాన్యత దృష్ట్యా... జట్టు అ వసరాలను దృష్టిలో ఉంచుకుని సచిన్‌ పా ర్ట్‌ టైం బౌలర్‌ గా తన సేవలను అందిస్తు న్నా డు. అం తేగా కుండా ఒక ఫీల్డర్‌గా స్లిప్స్‌తో పాటు, డీప్‌ థర్డ్‌ మ్యాన్‌ ప్రాంతంలో సచిన్‌ బాగా రాణించాడు.

రిజర్వ్‌డ్‌ పర్సనాలిటీ...
టెండూల్కర్‌ది చాలా రిజర్వ్‌డ్‌ వ్యక్తిత్వం. క్రొత్తవారితో కలుపుగోలుగా మాట్లాడటం గాని... తన అభిప్రాయాల్ని పంచుకోవడం గాని అతను చేయడు. తనకు తెలిసిన కొద్ది మంది మిత్రుల సమక్షంలోనే... మనసువిప్పి మాట్లాడటాన్ని అతను ఇష్టపడతాడు.

క్రికెట్‌ దిగ్గజాల మేలు కలయిక...
IN_SEHWAGప్రపంచ క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందిన అనేక గొప్ప క్రికెటర్లు తమలో ఉన్న ఏదో ప్రత్యేకత ద్వారా... పేరు ప్రతిష్టలు సంపాదిం చగా... టెండూల్కర్‌ మాత్రం ఈ క్రికట్‌ దిగ్గజాల మేలుకలయికగా టెండూల్కర్‌ను పేర్కొనవచ్చు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా విధ్వంసకర బ్యాటింగ్‌ శైలి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా జట్టుతో గ్వాలియర్‌లో వన్‌డే మ్యాచ్‌లో సచిన్‌ సాధిం చిన డబుల్‌ సెంచరీని చూస్తే... అందరికీ ఇట్టే అర్దమౌతుంది. అదే విధంగా... మైదానంలో సర్‌ వివియన్‌ రిచర్డ్‌‌స కదిలే తీరు (2003 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భాగంగా సెంచూరియన్‌ లో పాకిస్థాన్‌ జట్టుపై సచిన్‌ సాధించిన 98 పరుగులు), సునీల్‌ గవాస్కర్‌ టెక్నిక్‌, పట్టు దల (1999లో చెనై్నలో పాక్‌తో జరిగిన టెస్టు లో సచిన్‌ సాధించిన 136 పరుగులు), ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా నియంత్రణ, ఒత్తిడిని తట్టుకుని చివరివరకు పోరాడే తత్వం (2004 లో ఆసీస్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో సచిన్‌ సాధించిన అజేయ 241 పరుగులు) అతనిలో ఉన్న బహుముఖ ప్రజ్ఞను చాటి చెప్పాయి.

దాతృత్వ గుణం...
సచిన్‌లో ప్రత్యర్థులను చీల్చి చెండాడే అరివీర భయంకర బ్యాట్స్‌మన్‌తో పాటు... విశాల హృదయం గల మానవతామూర్తి కూడా ఉన్నాడు. ఎన్నో స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో టెండూల్కర్‌ పాల్గొన్నాడు. అంతేగాకుండా... తనవం తుగా ప్రతి ఏడాది 200 మంది పిల్లల చదువుల కయ్యే ఖర్చులను సచిన్‌ భరిస్తున్నాడు.

మాస్టర్‌ హాబీలు...
11th-centuryక్రికెట్‌నే తన సర్వస్వం అనుకున్న సచిన్‌ తీరిక దొరికినపుడు ఏం చేస్తుంటాడు అని క్రికెట్‌ అభిమానుల్లో సహ జంగా ఉదయించే ప్రశ్న. క్రికెట్‌ కాసేపు ప్రక్కనబెడితే మోటారు రేసులు ఫాస్టు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మంచి ఆహారం అంటే సచిన్‌కు ఎంతో ఇష్టం. మాస్టర్‌ తనకు ఎప్పుడు తీరిక దొరికినా... త నకు ఇష్టమైన మోటరు రేసులను తిలకించ డాన్ని ఇష్టపడతాడు. అందుకే అతను చాలా సందర్భాల్లో మోటరు రేసులకు ప్రసిద్దమైన యూరోపియన్‌ దేశాలకు వెళ్లి... అక్కడ ఫా ర్ములా వన్‌ మోటారు రేసులను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదిస్తుంటాడు. ఇలా గతంలో జర్మ న్‌, స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీతో పాటు..సిల్వర్‌స్ట్రోక్‌ మోటారు రేసులను టెండూల్కర్‌ వీక్షించాడు.

మాస్టర్‌నే భయపెట్టించిన బౌలర్‌...
ప్రపంచ క్రికెట్‌లోని దాదాపు అందరు విధ్వంసకరు బౌలర్లకు తన బ్యాటింగ్‌ తఢాఖా చూపెట్టిన సచిన్‌ టెండూల్కర్‌ను కూడా భయపెట్టిన బౌలర్‌ ఉన్నాడంటే నమ్ముతారా! అభిమానులు నమ్మినా... నమ్మకపోయినా.. సచిన్‌ మాత్రం అవుననే అంటు న్నాడు. అయితే సచిన్‌ తన కెరీర్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ హాన్సీ క్రానే బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడ్డానని మాస్టర్‌ వెల్లడించాడు. దక్షిణాఫ్రికన్‌ బౌలర్లు ఆలన్‌ డొనాల్డ్‌, షాన్‌ పొలాక్‌ బౌలింగ్‌ లలో కంటే.. హాన్సీ బౌలింగ్‌లోనే తాను ఎక్కు వసార్లు ఔటయ్యానని... సచిన్‌ పేర్కొన్నాడు. క్రానే వేసిన బంతి నేరుగా ఫీల్డరు చేతిలోకి వెళుతున్నట్లు కనబడేది అని సచిన్‌ ఇటీవల ఇచ్చిన ప్రఖ్యాత గార్డియన్‌ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురైన క్రానే.. 2002లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మృతి చెందాడు. తానెదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లలో ఆస్ట్రేలియన్‌ బౌలర్‌ మెక్‌గ్రాత్‌ అత్యుత్తమ బౌలరని ఈ ఇంట ర్వ్యూ సందర్భంగా అతను ఖితాబిచ్చాడు.

బాల్యం...
sachin-kambli ఏప్రిల్‌ 24, 1973లో ముంబాయిలో సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌ జన్నించాడు. అతడి బా ల్యం ఎక్కువగా... సాహిత్య సహవాస్‌ అనే రైటర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీలో గడ చింది. బాల్యంలో తన సొసైటీలోని స్నేహి తు లతో కలిసి సచిన్‌ క్రికెట్‌ను ఆడేవాడు. ఆ సమయంలో సచిన్‌ కంటే వయస్సులో11 ఏళ్లు పెద్దవాడైన అతడి అన్న అజిత్‌ టెండూ ల్కర్‌ సచిన్‌ను క్రికెట్‌ ఆడడంలో బాగా ప్రొత్సా హించాడు. సచిన్‌ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అతన్ని అన్న అజిత్‌ ఇచ్చిన ప్రొత్సాహమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని సచిన్‌ కూడా ఎన్నో సందర్బాల్లో వెల్లడించాడు.

తొలి అడుగులు...
11 ఏళ్ల ప్రాయం వరకు కూడా సచిన్‌ ప్రొఫే షనల్‌ క్రికెట్‌లో ఉపయోగించే బంతిని అసలు చూడలేదు. తన సొసైటీలో కేవలం టెన్నిస్‌ లేక రబ్బరు బంతితో క్రికెట్‌ను ఆడడం మాత్ర మే అతనికి తెలుసు. ప్రొఫెషనల్‌ గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌ వద్దకు తోడ్కొని వెళ్లాడు. సచిన్‌ను తొలిసారి చూసిన ఆచ్రేకర్‌ అతనికి ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఉపయోగించే బంతితో ఆడిన అనుభవం ఉందా అని ప్రశ్నించాడు. అయితే సచిన్‌ ఇచ్చిన సమాధానం ఆచ్రేకర్‌కు ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. ఆయన ఒక్కసారి తదేకంగా సచిన్‌ వైపు చూశాడు. వెంటనే తాను శిక్షణ ఇచ్చే జట్టులో నాలుగవ స్థానానికి అతన్ని ఎంపికచే శాడు. అంతే అప్పుడే ప్రపం చ క్రికెట్‌లో ఒక మహాను భావుడి రాకకు నాంది పడింది. అనంతరం శారదా శ్రమ్‌ విద్యా మందిర్‌ స్కూల్‌ తరపున 12 ఏళ్లకే తొలి సెంచరీని సాధించి సచిన్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు.

pacifying-fansఅనంతరం అండర్‌-17 విభా గంలో నిర్వహించే హారిస్‌ మెమోరియల్‌ చాలెంజ్‌ షీల్డ్‌ టోర్నీలో సహచరుడు తర పున చిన్ననాటి స్నేహి తుడు వినోద్‌ కాంబ్లీతో కలిసి 14 ఏళ్ల వయస్సులో సచిన్‌ నెల కొల్పిన 664 పరుగుల రికా ర్డు భాగస్వామ్యం అందరికి గుర్తుండే ఉంటుంది. ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లో కూడా ఇది ఇప్పటికీ ఒక రికార్డే. అనంతరం ఇదే టోర్నీ ఫైనల్‌ మ్యాచులో మరో 346 పరుగుల భారీ స్కోరుతో అజేయంగా సచిన్‌ నిలిచాడు.

ఈ టోర్నీలో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన టెండూల్కర్‌ 207, 329, 346 పరుగులతో చెలరేగాడు. ఆచ్రేకర్‌ శిష్యరికంలో సచిన్‌ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో కూడా అతను పరుగులేమి చేయకుండానే వెనుది రగడం గమనార్హం. ఆచ్రేకర్‌ ఎంపిక చేసిన నాలుగవ స్థానంలోనే సచిన్‌ తన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అదే స్థానంలో ఆడాడు. సచిన్‌ రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ఆడిన తొలి మ్యాచు ల్లోనే సెంచరీల్ని సాధించాడు. ముంబై జట్టు ఓటమి కోరల్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి లో ఉండి కూడా సచిన్‌ ఈ శతకాల్ని సాధించడం విశేషం.

16 ఏళ్ల 205 రోజుల వయస్సున్నప్పుడు నవంబర్‌ 15, 1989 లో పాకిస్థాన్‌ జట్టుతో కరాచీలో జరిగిన మ్యాచ్‌తో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ పేసర్‌ వఖార్‌ యూనిస్‌ వేసిన ఒక బంతి తాకి ముక్కు నుంచి రక్తం కారింది. అయితే దాని వల్ల అతని ఏకాగ్రత, మోక్కవోని దీక్ష ఇసు మంతైనా దెబ్బతినలేదు. ఆ మరుసటి బంతినే బౌండరీకి తరలించి... తాను క్రికెట్‌ ప్రపం చాన్ని ఏలడానికి వచ్చానని పరోక్షంగా చాటాడు.

jai-sachinఆ సిరీస్‌లో అంతగా రాణించకున్నా... తర్వాత జరిగిన ఇంగ్లండ్‌ పర్యటనలో ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచులో తన కెరీర్‌ తొలి సెంచరీని మాస్టర్‌ సాధించా డు. అంతేగాకుండా తన బ్యాటింగ్‌ సాయంతో ఆ మ్యాచ్‌లో జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. సచిన్‌ తన తొలి సెంచరీని మరో 31 రోజులు ముందు సాధించిన ఉంటే... టెస్టు క్రికెట చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా అతను రికార్డును సృష్టిం చేవాడు. అనంతరం 1991-92లో ఆస్ట్రేలి యా పర్యటన సందర్బంగా... సిడ్నీ... పెర్త్‌ స్టేడియాల్లో రెండు సెంచరీల్ని సాధించాడు. ఇప్పటికీ మాస్టర్‌ సాధించిన ఆ సెంచరీలు ్ర కెట్‌ అభిమానులందరికీ గుర్తుండి పోతాయి.

23 ఏళ్ల చిరుప్రాయంలోనే భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా అప్పటి కెప్టెన్‌ మహ మ్మద్‌ అజహరుద్దీన్‌ స్థానంలో సచి న్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ బాధ్య తల్ని తన బ్యాటింగ్‌కు ఇచ్చి న అంకితభావం, అంకుఠిత దీక్షతో సచిన్‌ గనుక నెరవేరుస్తానని చెప్పి ఉంటే అంతకంటే కొన్నేళ్ల ముందే అతను భారత జట్టుకు కెప్టెన్‌ అయి ఉండేవాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో సచిన్‌ తొలిసారిగా కెప్టెన్‌గా వ్వవహ రించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 10, రెండో ఇన్నింగ్స్‌ లో డకౌట్‌గా మాస్టర్‌ వెనుదిరిగినా... మ్యాచును మాత్రం భారత జట్టు కైవసం చేసుకుంది.

- ఎం.డి.ఇంకేషాఫ్‌ అహ్మద్

Jai Ho .............