ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితా 2012లో ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద గత ఏడాది 2 బిలియన్ పౌండ్లు తగ్గినా ఇంకా నంబర్ 1 స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆసియాలో అత్యంత ధనికుడు మిట్టలే ఆయన సంపద 13.5 బిలియన్ పౌండ్లు . భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే రూ.1,01,250 కోట్లు (బిలియన్ పౌండ్లు అంటే రూ.7,500 కోట్లు) . 2012లో 101 అత్యంత ధనవంతులైన ఆసియా వాసుల జాబితాను ఆసియా మీడియా అండ్ మార్కెటింగ్ గ్రూపు (ఎఎంజీ)కి చెందిన ఈస్ట్రన్ ఐ విడుదల చేసింది. కుబేరుల జాబితాను శుక్రవారం రాత్రి రమ్నిక్‌లాల్ సోలంకీ, సీబీఈ ఎడిటర్ ఇన్ చీఫ్ ఏసియన్ మీడియా అండ్ మార్కెటింగ్ గ్రూపు ఆసియా బిజినెస్ అవార్డు కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ కెయిత్ వాజ్ జాబితాను విడుదల చేశారు.
Lakshmi Mittal house
రెండవ స్థానం హిందూజాలు దక్కించుకున్నారు. తమ సంపదను 500 మిలియన్ పౌండ్లు పెంచుకుని 9.5 బిలియన్‌లకు చేరుకోగలిగారు. మూడవస్థానంలో వేదాంత గ్రూపునకు చెందిన అనిల్ అగర్వాల్ దక్కించకున్నారు. ఆయన సంపద 3.2 బిలియన్ పౌండ్లు, గత ఏడాది 1.3 బిలియన్ పౌండ్లు నష్టపోయినా ఆయన ఇంకా మూడవ స్థానంలో ఉన్నారు. కాపారో గ్రూపు చైర్మన్ లార్డ్ స్వరాజ్‌పౌల్ 7వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 675 మిలియన్ పౌండ్లు. గత ఏడాదితో పోల్చుకుంటే 75 మిలియన్ పౌండ్లు అధికం.
జాబితాలో మిగిలిన భారతీయులు వీరు :
నరేష్ గోయెల్ (జెట్ ఎయిర్‌వేస్) 19వ స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద 275 మిలియన్ పౌండ్లు, గత ఏడాదితో పోల్చుకుంటే 150 మిలియన్ పౌండ్లు సంపద కరిగిపోయింది. కర్తార్ లల్వానీ, వీటా బయోటిక్స్ వ్యవస్థాపకుడు, ఆయన కుమారుడు తెజ్ లల్వానీ 30వ స్థానంలో ఉన్నారు ఆయన సంపద 155 మిలియన్ పౌండ్లు గత ఏడాది పోల్చుకుంటే 5 మిలియన్ పౌండ్లు పెరిగింది. అర్సిలర్ మిట్టల్ చైర్మన్, సీఈవో మిట్టల్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగానే ఉందని ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఏదిఏమైనా ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల షోలో చైనా స్టార్‌గా నిలిచిందని పొగిడారు. దీంతో పాటు మిగిలిన దేశాలు భారత్, దక్షణి అమెరికా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలు కూడా వృద్ధిరేటులో దూసుకుపోతున్నాయన్నారు.ఆర్థిక మాంద్యం ఉన్నా మాంద్యం లేకున్నా హిందూజాలు మాత్రం తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ అపరకుబేరుల రేసులో టాప్ ర్యాంకింగ్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో బ్రిటన్‌కు చెందిన బస్సు ఉత్పత్తి సంస్థ ఒప్‌ట్రాను టేకోవర్ చేసుకున్నారు. ఈ డీల్‌లో భాగంగా హిందూజాలకే చెందిన అశోక్‌లేలాండ్ వాటాను ఒప్‌ట్రాలో 75.1 శాతానికి పెంచుకున్నారు.
హిందూజాలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతున్నారు. ఉదా. హిందుజా లీలాండ్ ఫైనాన్స్ భారత్‌లోని 19 రాష్ట్రాల్లో 400 శాఖలున్నాయి. హిందూజాలు ప్రస్తుతం ఆటోమొబైల్ రంగానికి చెందిన మొత్తం రేంజితో పాటు నిర్మాణ రంగానికి కావాల్సిన పనిముట్లకు ఫైనాన్స్ చేస్తోంది. హిందుజాలు వాణిజ్య వాహనాల నుంచి ద్విచక్రవాహనాల వరకు ... ట్రాక్టర్లు... కార్ల వరకు ఫైనాన్స్ వ్యాపారంలో ఆరితేరింది. గల్ఫ్ ఆయిల్ కూడా హిందూజాలదే. వారి వ్యాపార ప్రకటన ఆసక్తికరంగా ఉంటుంది. గల్ఫ్ ఆయిల్ మీ స్థానిక గ్లోబల్ బ్రాండ్ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత్‌లో కందెన ఉత్పత్తి చేసే ప్లాంట్‌లున్నాయి.
దీంతో పాటు అర్జెంటీనా, చైనా, ఫిలప్పీన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో కూడా ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. హిందుజాలకే చెందిన పలు కంపెనీలు ఈ విధంగా ఉన్నాయి. ఢిఫియెన్స్ టెక్నాలజీ లిమిటెడ్, హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, ఇండస్‌ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, హిందూజా హెల్త్‌కేర్ సర్జికల్ అండ్ హిందుజా రియల్టీ వెంచర్ లిమిటెడ్‌ల కంపెనీలు హిందుజా సోదరులు నిర్వహిస్తున్నారు. లండన్‌లో కూర్చుని వీరు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే బ్రిటన్‌లో మాత్రం వీరు ఎలాంటి ఉత్పత్తి సంస్థను కానీ, అసెంబ్లింగ్ యూనిట్లను కానీ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న కారణంగా వీరిలో కూడా మార్పు వస్తుందో లేదో చూడాలని ఎఎంజీ మీడియా నివేదికలో పేర్కొంది.
No comments:
Post a Comment